हैदराबाद: आंध्र प्रदेश के कावली में शहर में आरटीसी ड्राइवर पर हमले की घटना में पुलिस ने छह लोगों को गिरफ्तार किया है। पुलिस ने बताया कि आरोपी शिवा रेड्डी, विल्सन, महेश, राजी, मल्ली और इलियाज के खिलाफ मामला दर्ज किया गया है। यह स्पष्ट किया गया है कि मुख्य आरोपी देवरकोंडा सुधीर कुछ अन्य लोगों के साथ फरार हैं और उनकी तलाश जारी है। खबर है कि आरोपियों को रविवार को मीडिया के सामने पेश किया जाएगा।
आपको बता दें कि कावली मंडल मद्दुरुपाडु के राष्ट्रीय राजमार्ग पर 14 लोगों ने आरटीसी बस ड्राइवर बीआर सिंह पर हमला कर दिया। यह हमला इसलिए किया गया क्योंकि सड़क पर कार चलते समय बस चालक ने हॉर्न बजाया। स्थानीय लोगों ने बताया कि आरोपियों में से एक वाईसीपी का प्रमुख नेता था। इसके अलावा, इस हमले के दृश्य सेल फोन पर रिकॉर्ड किए गए। नेटिज़न्स ने सोशल मीडिया पर गुस्सा व्यक्त किया कि हमला वाईएसआरसीपी के कार्यकर्ताओं द्वारा किया गया था। पुलिस ने मामले का खुलासा कर दिया।
Crime: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనలో ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్: కావలి (ఆంధ్రప్రదేశ్) లో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనలో ఆరుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు శివారెడ్డి, విల్సన్, మహేశ్, రాజీ, మల్లి, ఇలియాజ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌తో పాటు మరికొంతమంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిందితులను ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.
కాగా కావలి మండలం మద్దూరుపాడు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్‌ను 14 మంది మూకుమ్మడిగా దాడి చేశారు. రహదారిపై కారు వెళ్తున్న సమయంలో బస్సు డ్రైవర్ హారన్ కొట్టారనే కారణంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు వైసీపీకి చెందిన కీలక నేత అని స్థానికులు తెలిపారు. అంతేకాదు ఈ దాడి దృశ్యాలు సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. దీంతో ఈ దాడికి పాల్పడింది వైసీపీ శ్రేణులేనని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసును ఛేదించారు. (ఏజెన్సీలు)