ఖర్గే హత్య వ్యవహారంపై జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు
మణికంఠ రాథోడ్ ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించాలి.
150 సీట్లతో కర్ణాటకలో గెలవబోతున్నాం
తెలంగాణలో అధికారంలో వస్తాం
ఖర్గే నేతృత్వంలో కేంద్రంలో కూడా అధికారం చేపడతాం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : మల్లికార్జున ఖర్గేను చంపడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖర్గే నాయకత్వాన్ని ఎదుర్కోలేక వారి కుటుంబాన్ని హత్య చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. ఖర్గే, కుటుంబ సభ్యులను అంతమొందిస్తానంటూ బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ మాట్లాడిన ఆడియో బయటికి వచ్చిన నేపథ్యంలో సంబంధిత అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు. తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు.
మణికంఠ రాథోడ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. మల్లికార్జున్ ఖర్గే కుటుంబ సభ్యులను చంపితే అధికారంలోకి వస్తామని బీజేపీ అనుకోవడం భ్రమ అని ఆయన వ్యాఖ్యానించారు.
“హైదరాబాద్-కర్ణాటక పరిధిలోకి వచ్చే చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో మల్లికార్జున ఖర్గే ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో సారి ప్రియాంక్ గెలవబోతున్నారు. ప్రియాంక్ మీద పోటీ చేసేందుకు అభ్యర్ధి లేక 30 క్రిమినల్ కేసులు, నగర బహిష్కరణ శిక్షను ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ మణికంఠ రాథోడ్ ను నిలబెట్టింది” అని రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని విమర్శించారు. ప్రియాంక ఖర్గేను ఓడించడానికి జాతీయ నాయకులు అందరూ చిత్తాపూర్లో మోహరించారన్న రేవంత్ రెడ్డి.. అక్కడ ఆయన ఓడిపోయేటటువంటి అవకాశం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఖర్గేను మణికంఠ రాథోడ్ హత్య చేస్తానని బెదిరించాడు. కుటుంబంతో సహా హత్య చేస్తానని బెదిరించిన ఆడియో బయటకు వచ్చింది. దేశ భక్తులమనే బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మణికంఠ రాథోడ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని మోదీ, నడ్డాలను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మల్లికార్జన ఖర్గే గారు 50 ఏళ్ల నుంచి ప్రజా సేవలో ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర రైల్వే, కార్మిక శాఖ మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి గుల్బార్గా జిల్లాను ఆదర్శంగా తీర్చిద్దారు అని రేవంత్ పేర్కిన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఓటు వేసి ఎన్నుకున్నారు. “2014-19 మధ్య ఖర్గే గారు లోకసభలో ప్రతిపక్ష నేతగా మోదీ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపి ఉక్కిరి బిక్కిరి చేశారు. అందుకే కక్ష గట్టి అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గానికి ఇంచార్జిగా నియమించి, ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను దుర్వినియోగం చేసి ఖర్గేను ఓడించారు” అని రేవంత్ అన్నారు.
మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యతలు చేపట్టాక మొదటి అడుగులోనే హిమాచల్ ప్రదేశ్లో గెలిచాం. రెండో అడుగులో కర్ణాటకలో గెలవబోతున్నాం. ఈ నెల 10న కర్ణాటక ప్రజలు తమ తీర్పును వెల్లడించబోతున్నారు. 150 సీట్లతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టాబెట్టాలని అక్కడి ప్రజలు నిర్ణయానికొచ్చారు. మూడో అడుగులో ఈ డిసెంబర్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో గెలుస్తాం. నాలుగో దేశమంతా గెలిచి ఎర్రకోట మీద కాంగ్రె జెండా ఎగురవేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్వీట్…
నిన్న అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన దుండగుడి కాల్పుల్లో తెలుగు బిడ్డ ఐశ్వర్య మృతి చెందడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఐశ్వర్య భౌతిక కాయాన్ని స్వస్థలానికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి.
ఈ రోజు సరూర్ నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభ
ముఖ్య అతిదిగా హాజరుకానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ విడుదల చేయనున్న టీపీసీసీ. మద్యాహ్నం 3.30 గంటలకు ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి, ఎంపీ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్.బి నగర్ లో శ్రీకాంత చారి విగ్రహానికి పూల దండలు వేసి నివాళులర్పిస్తారు.
అక్కడ నుంచి పాదయాత్ర తో సరూర్ నగర్ స్టేడియం వరకు వెళతారు. 4 గంటలకు ప్రియాంక గాంధీ బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడ నుంచి హెలికాప్టర్ లో సరూర్ నగర్ స్టేడియం కు చేరుకుంటారు..
రేవంత్ రెడ్డి నేరుగా హెలిప్యాడ్ వద్దకు చేరుకొని ప్రియాంక గాంధీ గారికి స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రమాదాలల్లో మరణించిన 140 మంది భీమా పరిహారం అందజేస్తారు. తర్వాత బహిరంగ సభ యువ సంఘర్షణ సభలో ప్రసంగిస్తారు.
కేటీఆర్ కు తెలంగాణతో పేగు బంధం లేదు
కేసీఆర్ కుమారుడనే అర్హతతో అన్ని రకాల హోదాలు
అవినీతిని స్టడీ చేయాలా? పేపర్ లీకును స్టడీ చేయాలా?
కేటీఆర్ కు రేవంత్ రెడ్డి చురకలు
“కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పేరే అరువు పేరు. సొంతంగా ఊరు లేదు. తెలంగాణలో సదువుకుంది లేదు. తెలంగాణతో పేరు బంధం గానీ, పేగు బంధం గానీ లేదు. నీ పేరే డ్రామారావు ఎక్కడి నుంచి తెచ్చుకున్నవు ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చుకున్నవ్. ఆయన గుంటూరు విజ్ఞాన్ లో చదువుకుండు. నీ సదువు గుంటూరు, నీ ఉద్యోగం అమెరికాలో. 6 పాయింట్ ఫార్ములా, 610 జీవోను అనుసరించి తెలంగాణలో ఏ హోదాలోనూ కొనసాగడానికి కేటీఆర్ కు సాంకేతికంగా, నైతికంగా అర్హత లేదు. కేసీఆర్ కుమారుడు అనే హోదాలో డ్రామారావు ఈ రోజు అన్నీ రకాల హోదాలను అనుభవిస్తున్నారు” అని కేటీఆర్ ను రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బిర్లా టెంపుల్ మెట్ల మీద, నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెతుకునే వారు అని కేసీఆర్, కేటీఆర్ ను విమర్శించారు. “కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి త్యాగాల కుటుంబం నుంచి వస్తున్న సోనియా గాంధీ బిడ్డ, బీహెచ్ఈఎల్, ఐడీబీఎల్.. లాంటి అనేక పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ని తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిన ఇందిరా గాంధీ మనుమరాలు ప్రియాంక గాంధీని కలిసి కాళ్ళకు నమస్కరిస్తే నీ పాపాలు కొంత వరకైనా తొలగుతాయి” అని రేవంత్ రెడ్డి కేటీఆర్ కు సూచించారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఉప్పు పాతరేస్తారు అని హెచ్చరించారు.
మొన్న సభల్లో గాడ్సే ఫోటోను ప్రదర్శించారు. అటువంటి వారి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. “ఎనిమిదేళ్లు గాడ్సే పార్టీతో అంటకాగారు. రాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు, జీఎస్టీ, సీఏఏ వంటి వందల బిల్లులు లోకసభలో, రాజ్యసభలో పాస్ అవ్వడానికి మద్దతిచ్చారు. అటువంటి గాడ్సే పార్టీని మెదక్ పిలుపించుకొని మాకు ఏమి వద్దు మీ ప్రేమ ఉంటే చాలు అని అన్నది కేసీఆర్. కేటీఆర్ తండ్రి. కాంగ్రెస్ పార్టీని, నాయకులను విమర్శించి బతకాలనుకుంటున్నట్లు కేటీఆర్ మాటలను బట్టి అర్ధమవుతుంది” అని రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు గుప్పించారు.
అభివృద్ధి నమూనాను స్టడీ చేయాలన్నా వ్యాఖ్యాలకు రేవంత్ రెడ్డి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి నమూనా అంటే ఏంటో చెప్పమన్న రేవంత్ రెడ్డి.. రాష్టంలో జరుగుతున్న అవినీతిని స్టడీ చేయాలా? పేపర్ లీకును స్టడీ చేయాలా?లేదంటే అత్యాచారాలపై స్టడీ చేయాలా అని ఆయన ప్రశ్నించారు. మేము.. 3 వేల వైన్ షాపులు, 60 వేల బెల్టు షాపులను మేం స్టడీ చేయాలా? పంట నష్టం ఇవ్వని రైతుల గోసాను స్టడీ చేయాలా? పదో తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి. 12వ తరగతి పరీక్ష పత్రాలు దిద్దితే 25 మంది విద్యార్థులు చనిపోయారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయడం చేతకాలేదు. ఈ రోజు టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు సంతలో సరుకుల్లా దొరుకుతున్నాయి. ఈ లీకేజీని స్టడీ చేయాలా? అని రేవంత్ కేటీఆర్ కు చురకలు అంటించారు.
మహారాష్ట్ర నుంచి కిరాయి మనుషులను తెచ్చుకుని సీఎంఓలో ఉద్యోగం ఇచ్చి ఇక్కడి నిరుద్యోగులను కేసీఆర్ అవమానించరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవన్నీ ప్రియాంక గాంధీకి తెలియవా అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిందే ఆ కుటుంబం. కేటీఆర్ కు సూచన చేస్తున్నా తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు ప్రియాంక గాంధీ కాళ్లకు నమస్కరించి క్షమాపణ అడగండి. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి తప్పుకుంటే తెలంగాణ సమాజం కనీసం మనుషులుగానైన గుర్తిస్తుంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.