హైదరాబాద్: పి.హెచ్.డి ప్రవేశాల్లో సీట్ల కేటాయింపుపై పలువురు విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం వేసిన సీనియర్ ప్రొఫెసర్ ఎం కుమార్, ప్రొఫెసర్ స్టీవెన్ సన్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను సమర్పించింది. ఇవ్వాళ జరిగిన యూనివర్శిటీ స్థాయీ సంఘ సమావేశంలో పలు సిఫార్సులు చేస్తూ నివేదిక వివరాలను వెల్లడించింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్టా యుద్ద ప్రాతిపదికన ఐదు సార్లు సమావేశమైన కమిటీ… రాజనీతి శాస్త్ర విభాగంలో పీహెచ్డీ సీట్ల కేటాయింపులో జరిగిన తప్పును సరిదిద్దుతూ చేసిన నూతన కేటాయింపుల జాబితాను విడుదల చేసింది.
ఆయా విభాగాల డీఆర్సీ లు, డీన్ నేతృత్వంలో జరిగే పీహెచ్డీ సీట్ల కేటాయింపు విషయంలో ఉపకులపతి, పరిపాలనా విభాగంపై పలువురు చేసిన ఆరోపణలను కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. భవిష్యత్తులో ఆయా విభాగాల డీఆర్సీలు, డీన్లు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఓయూ ఇంజినీరింగ్ కళాశాల డీన్, సీనియర్ ప్రొఫెసర్ ఎం కుమార్ కమిటీ సిఫార్సు చేసింది. ఆయా విభాగాల్లో సూపర్ వైజర్ లు, వారికి కేటాయించిన పీహెచ్డీ అభ్యర్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని మెరిట్ విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని స్పష్టం చేసింది.
మెరిట్ విద్యార్థులకు సూపర్ వైజర్ల కొరత ఉన్నప్పుడు… అవసరమైతే ప్రొటెం సూపర్ వైజర్లను కేటాయించాలని, తిరిగి ఖాళీలు ఏర్పడ్డప్పుడు పూర్తి స్థాయి ప్రవేశానికి మార్చుకోవాలని సూచించింది. ఇదంతా ఆయా విభాగాల డీన్ల పర్యవేక్షణలో జరగాలని స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలు, భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని… అపోహలతో ఆరోపణలు చేయటం సరికాదని అభిప్రాయపడింది. కమిటీ నివేదికను రానున్న పాలకమండలి సమావేశంలో ప్రవేశపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థాయీ సంఘం అభిప్రాయపడింది.
Committee Submitted Report On Allotment Of Seats In Ph D Admissions In Osmania University
Hyderabad: A committee headed by Sr Prof M Kumar and Prof Stevenson of Osmania University has submitted its report on the objections raised by students on the allotment of seats in Ph.D. admissions in the Department of Political Sciences. The details of the report were disclosed by making several recommendations in the University Standing Committee meeting held today. The committee met on five different occasions to safeguard the interest of the students.
The list of new allotments has been released after correcting the error made in the allotment of PhD seats in the Department of Political Science. Regarding the allotment of PhD seats headed by Department Research Committee (DRCs) and Deans of the respective departments, the committee strongly refuted the allegations made by many against the Vice-Chancellor and the administration. Dean, OU College of Engineering, Sr.Prof. M Kumar committee has recommended that DRCs and Deans of the respective departments should strictly adhere to the rules in future.
It has been clarified that the supervisors in the respective departments should provide opportunities to the merit students considering the number of PhD candidates allotted to them. When there is a shortage of supervisor for merit students, it was suggested that protem supervisors should be assigned if necessary and then converted to full-time entry when vacancies arise.
It has also been clarified that all this should be done under the supervision of the Deans of the respective departments. They vehemently held that there is no point in compromising the interests and future of the students. The committee also believed that it is not correct to make accusations based on misconceptions. The standing committee opined that the report of the committee should be presented in the upcoming meeting of the governing body and action should be taken against those responsible.