Chief Minister Revanth Reddy and Minister Ponnam Prabhakar unveil Bharat Ratna Dr. B. R. Ambedkar statue at Dr. B. R. Ambedkar Open University
CM lays foundation stone for construction of four buildings at the university
Promises fee reimbursement to Dr. B.R.Ambedkar Open University students.
Committed to recruit faculty vacancies in all universities in the state
Proposal to enhance professor retirement age upto 65 years.
Center’s conspiracy to trample on the rights of states – No one’s interference in the appointment of VCs will be tolerated.
Hyderabad: Chief Minister Revanth Reddy Unveiled the Statue of Bharat Ratna Dr. B. R. Ambedkar at the Dr. B. R. Ambedkar Open University Campus on Sunday. Chief Minister along with Ponnam Prabhakar, Hon’ble Transport & BC Welfare Minister; Chief Secretary Smt. Shanti Kumari, VC Prof. Ghanta Chakrapani and other officials, unveiled a 15 feet bronze statue of Ambedkar and also laid foundation stone for four buildings in the university premises.
Revanth Reddy, Chief Minister assured that Dr. B. R. Ambedkar open University will be strengthened by providing basic facilities as well as filling vacancies. He said that a committee has been formed under the leadership of Prof. Chakrapani to formulate various policies to fill vacancies in all Universities in the state of Telangana very soon. CM Revanth Reddy revealed that a proposal to increase the retirement age of professors to 65 years is being considered with the intention of utilizing the services of senior professors. He assured that the fee reimbursement program will be implemented for students studying in Ambedkar open University.

He proposed to implement a program to make one lakh Dalit and poor students to study higher education will be considered under the “CM Graduation Scheme”. He mentioned that the Government is committed to strengthen the education system in telangana. He will oppose the Center Government’s conspiracy to trample on the rights of the states through the UGC draft policy in appointing Vice -Chancellors. He said that he has already spoken to the Chief Ministers of south Indian states. He also requested to intellectuals in the state to oppose the central decision. Also he pointed out in selection of Padma Awards recently announced unfairly to Telangana.
Prof. Ghanta Chakrapani, Vice-Chancellor presided over the program. Prof. Chakrapani said that Rs 20 crore was sanctioned from UGC under PM-USHA funds for University development. Digital Resource Center to be set up with funds provided by UGC of about Rs 10 crore. The New laboratory and a Central Instrumentation Center will be built at a cost of Rs. 3 crore, and for this, UGC will provide financial assistance under the PM USHA Scheme. It was revealed that a special full-fledged skill training institute will be set up to provide training in modern skills to the unemployed in rural areas of Telangana. At least 10 thousand skill oriented students come out every year. The University constructing residential accommodation to Essential staff working campus to build a respectable housing complex in the size of a double bedroom for them and that he considers the foundation stone laying ceremony of the building complex auspicious.

Transport Minister Ponnam Prabhakar said the government is committed to the spread of higher education in the state and called on the intellectuals and teachers of Telangana to give necessary suggestions and advice for this. He mentioned that they are committed to the development of all universities in Telangana. He explained that his government will always provide support for the development of Ambedkar University, which is working for the upliftment of the poor.
The guests of honor were Chief Secretary Smt. A. Shanthi kumara, IAS; Higher Education Secretary Dr. Yogita Rana, IAS; Telangana Higher Education Council Chairman Prof. V. Balakista Reddy, Prof. Hara Gopal, former VCs Prof. VS Prasad, Prof. Ramachandram, Prof. Vayunandan, Prof. V. Venkaiah, Veera Nari Chakali Ailamma Mahila University VC Prof. Surya Dhananjay, EFLU In-charge VC Prof. Lakshmi, Vice-Chairmen of the Council of Higher Education Prof. Purushottam, Prof. S. K. Mahmood, Ambedkar University Founder VC Prof. Ram Reddy’s wife Pramila Ram Reddy, academicians from various educational institutions, government officials and others participated in the program. Registrar Dr. L. Vijaya Krishna Reddy presented the vote of thanks, while directors of various departments, deans, heads of respective departments, several former vice-chancellors, retired faculty members, and vice-chancellors of various universities were present.
Related News-
విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : సీఎం రేవంత్ రెడ్డి
అంబేద్కర్ వర్శిటీలో భారత రత్న డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, వీసీ ఘంటా చక్రపాణి
విశ్వవిద్యాలయంలో నాలుగు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం
అంబేద్కర్ విశ్వవిద్యాలయ విద్యార్థులకూ ఫీజు రీ ఇమ్బర్స్మేంట్ హామీ.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ లలో అధ్యాపక ఖాళీల భార్తీకీ హామీ
ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 65 కు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తాం
రాష్ట్రాల హక్కులను కాలరాయడానికి కేంద్రం కుట్ర – వీసీల నియామకంలో ఎవరి జోక్యాన్ని సహించం
పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి అన్యాయం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అదేవిధంగా మరో నాలుగు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనతరం ఆయన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఉద్యోగులు, విద్యార్ధులు, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ వర్శీటీకి అటు మౌళిక వసతులతో పాటు ఇటు ఖాళీల భర్తీని చేపట్టి పటిష్ట పరుస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే అన్ని విశ్వవిద్యలయల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి విదివిధానాలను రూపొందించడానికే ప్రొ. చక్రపాణి నేతృత్వంలో కమిటీని వేశామన్నారు. సీనియర్ ప్రొఫెసర్ల సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రోఫెస్సర్ల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆయా వర్గాల్లో నిష్ణాతులను వీసీలుగా నియమించామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు అమలు అవుతున్న మాదిరిగానే అంబేద్కర్ విశ్వవిద్యాయంలో అభ్యసించే విద్యార్థులకూ ఫీజు రీ ఇమ్బర్స్మేంట్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని హామీ. సీఎం గ్రాడ్యుయేశన్ స్కీం కింద లక్ష మంది దళిత, పేద విద్యార్ధులను ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమ అమలు అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను రాష్ట్రంలో నిర్వీర్యం చేశారని రానున్న రోజుల్లో కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మరో 10 సంవత్సరాలు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రాల హక్కులను కాలరాయడానికి కేంద్రం కుట్ర చేస్తోందని ఇది మంచి పరిణామం కాదన్నారు. కేంద్రం పరిధిలోని యూజీసీ ద్వారా చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రాల పరిధిలో జరిగే వీసీల నియామకాన్ని కేంద్రం లాగేసుకొని వాళ్ళే వీసీలను నియమించేలా మార్గాదర్శకాలు రూపొందించి డ్రాఫ్ట్ ను రాష్ట్రాలకు పంపారని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడానని అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం తో కూడా మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభలో, రాష్ట్రంలో ఉన్న మేధావులు కూడా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాలని అభిప్రాయపడ్డారు. పద్మ అవార్డుల్లో సైతం తెలంగాణ కు అన్యాయం జరిగిందని, గద్దర్, జయధీర్, గోరెటి వెంకన్న, అందెశ్రీ వంటి ప్రముఖుల పేర్లను తెలంగాణ ప్రభుత్వం పంపినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు ఇవ్వడాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆచార్య. చక్రపాణి మాట్లాడుతూ అంబేద్కర్ వర్శీటీ లో చివరగా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సీఎం హోదాలో చివరగా అడుగు పెడితే తిరిగి 30 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తమ యూనివర్సిటీ లో అడుగు పెట్టారని ఇది తమకు శుభ సూచకమన్నారు. రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ కి తక్కువ కాకుండా అన్ని కోర్సులు అంబేద్కర్ వర్సిటీలో అందిస్తున్నామని, ఇటీవలే పీఎం-ఉషా నిధుల కింద యూజీసీ నుంచి 20 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని అందులో భాగంగా దాదాపు రూ. 10 కోట్ల నిధులతో ఏర్పాటు చేయబోతున్న డిజిటల్ రీసోర్స్ సెంటర్ కు ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నామని, ఈ సెంటర్ ద్వారా భవిష్యత్తులో అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాఠ్యాంశాలను, బోధనను, ఇతర విద్యార్థి సేవలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా డిజిటల్ కంటెంట్ రూపంలో అందజేయడానికి వీలవుతుందని వివరించారు. సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ దాదాపు రూ. 3 కోట్ల వ్యయంతో కొత్త ప్రయోగశాలలలను నిర్మించనున్నట్లు, దీనికిగాను యూజీసీ పీఎం ఉషా స్కీం కింద ఆర్థిక సాయం అందజేస్తుందని వెల్లడించారు.
తెలంగాణ గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు కూడా ఆధునిక నైపుణ్యాలలో శిక్షణను ఇవ్వడానికి, కనీసం ప్రతి ఏడాది 10 వేల మంది నిపుణులను అందించడానికి ఒక ప్రత్యేక పూర్తి స్థాయి నైపుణ్య శిక్షణా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఆలోచన రేవంత్ రెడ్డి మానస పుత్రిక అని వెల్లడించారు. ఈ భవన నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం మంచి పరిణామం అని ప్రొ. ఘంటా చక్రపాణి వివరించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వివిధ రకాల సేవలు అందిస్తూ రాత్రింభవళ్లు ఇక్కడ పనిచేస్తున్నEssential staff (ఎలక్ట్రిషన్స్, ప్లంబర్లు, కార్పెంటర్, డ్రైవర్లు తదితరులు) నివాస వసతి కోసం వారికి డబుల్ బెడ్ రూమ్ సైజులో గౌరవప్రదమైన గృహ సముదాయాన్ని నిర్మించాలని యూనివర్సిటీ సంకల్పించిందని ఆ భవన సముదాయ నిర్మానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రాంలో ఉన్నత విద్యా వ్యాప్తికి తమ ప్రభుత్వం క్రుతనిచ్చయంతో ఉందని దానికి అవసరమైన సూచనలు సలహాలు తెలంగాణలోని మేధావులు, అధ్యాపకులు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నఅంబేద్కర్ ఓపెన్ వర్సీటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ చేయూతను అందిస్తుందని వివరించారు.
గౌరవ అతిథులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎ. శాంతికుమారి ఐ.ఏ.ఎస్.ఉన్నత విద్యా కార్యదర్శి డా. యోగితా రాణా, ఐ.ఏ.ఎస్., తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి. బాలకిస్టా రెడ్డి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి తదితరులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి ప్రొ. హర గోపాల్, మాజీ వీసీ లు ప్రొ. వీఎస్ ప్రసాద్, ప్రొ. రామచంద్రం, ప్రొ. వాయునంధన్, ప్రొ. వి. వెంకయ్య, వీర నారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ. సూర్య ధనంజయ్, ఇఫ్లూ ఇంచార్జ్ వీసీ ప్రొ. లక్ష్మీ, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ లు ప్రొ. పురుషోత్తం, ప్రొ. ఎస్. కె. మహమూద్, అంబేద్కర్ వర్సిటీ వ్యవస్థాపక వీసీ ప్రొ. రాం రెడ్డి సతీమణి ప్రమీలా రాం రెడ్డి, పలు విద్యాసంస్థలకు సంబంధించిన విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి వందన సమర్పణ చేయగా, పలు విభాగాల డైరక్టర్లు, డీన్లు, ఆయా శాఖల అధిపతులు, పలువురు మాజీ ఉప కులపతులు, రిటైర్డ్ అధ్యాపకులు, పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.