हैदराबाद: एसआरएच प्रबंधन और हैदराबाद क्रिकेट एसोसिएशन (एचसीए) के बीच कॉम्पलीमेंट्री पास को लेकर उठे विवाद पर सीएम रेवंत रेड्डी गंभीर हो गए हैं। उन्होंने एसआरएच प्रबंधन पर पास के लिए परेशान किए जाने पर रोष व्यक्त किया। उन्होंने चेतावनी दी कि यदि एसआरएच प्रबंधन को परेशान किया गया तो कड़ी कार्रवाई की जाएगी। इसी क्रम में एसआरएच प्रबंधन ने गंभीर आरोप लगाया है कि एचसीए ने उन्हें मुफ्त पास के लिए धमकी दी है।
साथ ही यह भी आरोप लगाया गया कि पास नहीं दिये जाने के कारण स्टेडियम में कुछ बॉक्सों बंद करके उन्हें परेशान किया गया है। एसआरएच प्रबंधन ने एचसीए को पत्र लिखकर कहा कि अगर ऐसा ही रहा तो हम यहां नहीं खेल पाएंगे तथा कहीं और चले जाएंगे। सीएमओ ने एचसीए और एसआरएच के बीच पास का गर्म बनते देख इस विवाद के बारे में जानकारी हासिल की। साथ ही सीएमओ कार्यालय ने एसआरएच प्रबंधन को धमकी दिये जाने पर विवरण एकत्र किया है। सरकार ने पास के लिए एसआरएच प्रबंधन को धमकाने के मामले की सतर्कता जांच के आदेश दे दिए हैं।
सतर्कता महानिदेशक कोत्ताकोटा श्रीनिवास रेड्डी को एसआरएच और एचसीए विवाद की जांच कर रिपोर्ट प्रस्तुत करने का आदेश दिया गया है। सरकार इस बात को लेकर सतर्क हो गई है कि यदि एसआरएच प्रबंधन छोटे-मोटे विवादों के कारण किसी अन्य स्थान पर चला जाता है तो इससे हैदराबाद की ब्रांड छवि को नुकसान पहुंचने का खतरा है। इसके तहत, सीएम रेवंत रेड्डी ने चेतावनी जारी की है कि अगर एसआरएच प्रबंधन को परेशान किया गया तो सख्त कार्रवाई की जाएगी।
विवाद की जड़
आईपीएल टिकटों को लेकर सनराइजर्स हैदराबाद फ्रेंचाइजी और हैदराबाद क्रिकेट एसोसिएशन (एचसीए) के बीच विवाद चल रहा है। एसआरएच महाप्रबंधक की ओर से भेजे गए एक ईमेल ने विवाद खड़ा कर दिया है, जिसमें दावा किया गया है कि एचसीए मुफ्त में दिए जाने वाले मानार्थ पासों की संख्या बढ़ाने की धमकी दे रहा है। एचसीए ने रविवार को घोषणा की कि उसे एसआरएचए से कोई आधिकारिक ईमेल प्राप्त नहीं हुआ है, जिसमें कहा गया हो कि यदि एचसीए का दृष्टिकोण नहीं बदला तो वह किसी अन्य राज्य में खेलने के लिए चले जाएंगे।
ऐसा प्रतीत होता है कि इस महीने की 27 तारीख को लखनऊ के खिलाफ मैच के दौरान उप्पल स्टेडियम के साउथ स्टैंड में एफ 12-ए कॉरपोरेट बॉक्स में टिकटों के आवंटन को लेकर विवाद उत्पन्न हो गया। एसआरएच का कहना है कि वह एचसीए को संबंधित पास दे रहा है, तथा बता रहा है कि बॉक्स की क्षमता पहले की तरह 50 सीटों की है। हालांकि, एचसीए का कहना है कि चूंकि उस बॉक्स की क्षमता केवल 30 सीटों की है, इसलिए फ्रेंचाइजी को इस सीजन से पहले ही सूचित कर दिया गया था कि शेष 20 टिकटों को अन्य कॉर्पोरेट बॉक्सों में समायोजित किया जाना चाहिए, और वह ऐसा करने के लिए सहमत हो गई।
हालांकि, उनका तर्क है कि उन्हें समझौते के अनुसार स्टेडियम की क्षमता के दस प्रतिशत (10%) की तुलना में 20 कम टिकट (3900) मिल रहे हैं, क्योंकि पिछले दो मैचों के लिए एक ही बॉक्स में 50 पास आवंटित किए गए। बताया जा रहा है कि पिछले मैच के दौरान इस मुद्दे पर दोनों समूहों के बीच बहस हुई और इसे चर्चा करके और हल करने का निर्णय लिया गया। एचसीए ने कहा कि सनराइजर्स फ्रेंचाइजी के कुछ लोग जानबूझकर उन्हें धमकाकर उनकी प्रतिष्ठा को धूमिल करने की कोशिश कर रहे हैं।
Also Read-
ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం, హెచ్‌సీఏ మధ్య పాసుల వివాదం, సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
హైదరాబాద్: కాంప్లిమెంటరీ పాసుల విషయంలో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాసుల కోసం ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ను ఇబ్బంది పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కాంప్లిమెంటరీ పాసుల కోసం హెచ్‌సీఏ తమను బెదిరింపులకు గురి చేసిందని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం సంచలన ఆరోపణలు చేసింది.
పాసులు ఇవ్వకపోతే స్టేడియంలోని కొన్ని బాక్సులకు తాళాలు వేసి ఇబ్బందులు పెట్టారని ఆరోపించింది. ఇలాగైతే మా వల్ల కాదని.. మేం వేరే చోటుకు వెళ్లిపోతామని హెచ్‌సీఏకి లేఖ రాసింది ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్. హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య రాజుకున్న పాసుల వివాదం హాట్ టాపిక్‌గా మారడంతో దీనిపై సీఎంవో ఆరా తీసింది. ఈ మేరకు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసిన విషయంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. ఈ మేరకు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం బెదిరించిన అంశంపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించింది.
ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ వివాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. చిల్లర వివాదాలతో ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ వేరే చోటుకి తరలివెళ్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కారణం
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మధ్య ఐపీఎల్ టికెట్ల వివాదం నడుస్తోంది. తమకు ఉచితంగా ఇచ్చే కాంప్లిమెంటరీ పాసుల సంఖ్య పెంచాలంటూ హెచ్‌సీఏ బెదిరిస్తోందని ఎస్‌ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ పేరిట వచ్చిన ఓ ఈ–మెయిల్ చర్చనీయాంశమైంది. హెచ్‌సీఏ తీరు మారకపోతే తాము మరో రాష్ట్రంలో ఆడుకుంటామని అందులో పేర్కొనగా అసలు ఎస్‌ఆర్‌హెచ్ నుంచి తమకు ఎలాంటి అధికారిక ఈ–మెయిల్ రాలేదని హెచ్‌సీఏ ఆదివారం ప్రకటన చేసింది.
ఉప్పల్ స్టేడియం సౌత్ స్టాండ్‌లోని ఎఫ్12–-ఎ కార్పొరేట్ బాక్సులో పాసుల కేటాయింపుపై ఈ నెల 27న లక్నోతో మ్యాచ్ సమయంలో వివాదం జరిగినట్టు తెలుస్తోంది. గతంలో మాదిరి ఆ బాక్సు కెపాసిటీ 50 సీట్లుగా పేర్కొంటూ అందుకు సంబంధించిన పాసులను హెచ్‌సీఏకు ఇస్తున్నట్టు ఎస్‌ఆర్‌హెచ్ చెబుతోంది. కానీ, ఆ బాక్స్ సామర్థ్యం 30 సీట్లు మాత్రమే కావడంతో మిగిలిన 20 టికెట్లను ఇతర కార్పొరేట్ బాక్సుల్లో అడ్జస్ట్ చేయాలని ఈ సీజన్‌కు ముందే ఫ్రాంచైజీకి దృష్టికి తీసుకెళ్లగా అందుకు ఒప్పుకుందని హెచ్‌సీఏ అంటోంది.
అయితే, గత రెండు మ్యాచ్‌లకు అదే బాక్సుకు 50 పాసులు కేటాయించడంతో ఒప్పందం ప్రకారం స్టేడియం కెపాసిటీలో పది శాతం టికెట్లలో (3900) తమకు 20 తక్కువ వస్తున్నాయని వాదిస్తోంది. ఈ విషయంపై గత మ్యాచ్ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాదనలు జరగ్గా చర్చించి పరిష్కరించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదిలాఉంటే తాము బెదిరిస్తున్నామంటూ సన్ రైజర్స్ ఫ్రాంచైజీలోని కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే తమ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని హెచ్‌సీఏ పేర్కొంది. (ఏజెన్సీలు)