Hyderabad: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్వీ సీ54 విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్వీ సీ54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, ఎనిమిది చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు.సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది.
ఇందులో హైదరాబాద్‌కు చెందిన ధ్రువ సంస్థ రూపొందించిన థైబోల్ట్ శాట్-1, థైబోల్డ్ శాట్-2 ఉపగ్రహాలు ఉన్నాయి. మిగితావి భారత్, భూటాన్ సంయుక్తంగా తయారుచేసిన భూటాన్‌శాట్, అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థ రూపొందించిన 4 అస్ట్రోకాట్ ఉపగ్రహాలు, బెంగళూరుకు చెందిన పిక్సెల్ సంస్థ తయారుచేసిన ఆనంద్‌శాట్ నింగిలోకి చేరాయి.
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే తెలంగాణ కీర్తి ప్రతిష్ఠలు అంతరిక్షం వరకు చేరాయి. పలు రంగాల్లో ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. మరో అద్భుత ఘట్టాన్ని ఆవిషరించింది. దేశంలోనే తొలిసారి ప్రైవేట్ ఉపగ్రహాల ప్రయోగ చరిత్రలో మరో రికార్డును సాధించింది. ఐటీ, శాస్త్రసాంకేతిక రంగాల్లో యువతను ప్రోత్సహించే దిశగా సీఎం కేసీఆర్ దార్శనికత, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీహబ్‌లో యువత తమ ప్రతిభతో పలు రంగాల్లో అద్భుతాలను సృష్టిస్తున్నారు. మొన్నకిమొన్న స్కైరూట్ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్లగా, ఇప్పుడు ధ్రువ స్టార్టప్ తయారుచేసిన 2 ఉపగ్రహాలు విజయవంతంగా రోదసిలోకి చేరాయి.
సీఎస్‌ఎల్‌వీ-సీ54 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అభినందనలు తెలిపారు. ధ్రువ స్పేస్ బృందం చైతన్య దొర, క్రాంతి మూసునూరు, అభయ్ ఏగూర్, కృష్ణ తేజ, సంజయ్ నెక్కంటికి హృదయపూర్వక అభినందనలు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది ఎంతో గర్వించదగ్గ క్షణమని, మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్‌ఎస్ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ షాటిలైట్స్‌తో పాటు… 17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం. (Agencies)