हैदराबाद : सिद्दीपेट जिला हेडक्वार्टर के बाहरी इलाके में हाई सिक्योरिटी वाली जिला जेल बनकर तैयार हो गया है। इस जेल को 9 करोड़ रुपये की लागत से आधुनिक सुविधाओं के साथ एनसानपल्ली जीपी एरिया में 30 एकड़ एरिया में बनाया गया है। निर्माण का काम दो साल पहले शुरू हुआ था और हाल ही में पूरा हुआ। अब उद्घाटन के लिए तैयार है। आरडीओ ऑफिस के बगल में मौजूदा जिला जेल अपनी कम सुविधाओं के कारण कैदियों के लिए सही नहीं है। इसके चलते एक बड़े एरिया में जेल बनाने का फैसला किया गया।
सिद्दीपेट जिला हेडक्वार्टर बन जाना और पुलिस कमिश्नरेट बन जाने के कारण पुलिस स्टेशनों की संख्या बढ़ाई गई। इसी क्रम में 2018 में जेल को मंज़ूरी दी गई क्योंकि कैदियों को रखने के लिए सिद्दीपेट सब-जेल नहीं थी। जेल नियमों के अनुसार, पांच किलोमीटर के दायरे में 100 बेड का हॉस्पिटल बनाने का प्रोविज़न है। एनसानपल्ली के बाहरी इलाके में निर्माण का काम इस नियम के साथ शुरू किया गया कि पांच किलोमीटर के दायरे में 100 बेड का अस्पताल होना चाहिए।
9 करोड़ रुपये की लागत से 30 एकड़ में बन चुकी नई जिला जेल को मॉडर्न सुविधाओं और कड़ी निगरानी के हिसाब से डिज़ाइन किया गया है। जेल को 400 से ज़्यादा कैदियों के रहने के लिए बनाया गया है, ताकि अगर भविष्य में यह संख्या बढ़ती भी है, तो कोई दिक्कत न हो। पुरुष और महिला कैदियों के लिए अलग-अलग बैरक बनाए गए हैं। सिद्दीपेट की जिला जेल में 8 बैरक वाली यह जेल हाई सिक्योरिटी के साथ बनाई गई है। कुल बैरकों में से एक महिलाओं के लिए अलग से दी गई है। इसमें 60 महिला कैदियों के लिए सुविधाएं हैं। बाकी सात बैरक पुरुष कैदियों के लिए बनाए गए हैं। इनमें से 350 से ज़्यादा कैदियों के रहने का इंतज़ाम किया गया है।
जेल के चारों ओर 40 फीट की ऊंचाई पर वॉच टावर लगाए जाएंगे और दिन-रात पहरा दिया जाएगा। जेल में कैदियों के बीमार पड़ने पर इलाज के लिए खास बेड, एक लाइब्रेरी और कैदियों से काम करवाने के लिए चार खास विभाग बनाए गए हैं। कैदियों को भागने से रोकने के लिए करंट वाली फेंसिंग वायर के साथ 7 मीटर ऊंचा कंपाउंड बनाया गया है। इस जेल में एक डिप्टी सुपरिटेंडेंट और एक सिविल असिस्टेंट सर्जन समेत 16 डिपार्टमेंट के 66 स्टाफ सदस्य काम करेंगे। स्टाफ के लिए जेल के अंदर क्वार्टर बनाए गए हैं।
मुख्यमंत्री रेवंत रेड्डी 22 मार्च को दोपहर 3 बजे आधुनिक तरीके से बनाई गई इस जिला जेल का उद्घाटन करेंगे। मुख्यमंत्री नरमेट्टा ऑयल पाम फैक्ट्री का दौरा करने वाले, वहीं उसी दिन जिला जेल का उद्घाटन भी करेंगे। जिला जेल का निर्माण पूरा हुए लगभग छह महीने हो गए हैं, लेकिन पंचायत और म्युनिसिपल चुनाव की वजह से उद्घाटन समारोह टालता चला आया है। जिला जेल के उद्घाटन रविवार दोपहर 3 बजे तय किया गया है।
Also Read-
హైసెక్యూరిటీతో సిద్దిపేట శివారులో జిల్లా జైలు, ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాకేంద్రం శివారులో హైసెక్యూరిటీతో జిల్లా జైలు నిర్మాణం పూర్తయింది. ఎన్సాన్ పల్లి జీపీ పరిధిలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.9కోట్లతో ఆధునిక సౌకర్యాలతో దీనిని నిర్మించారు. రెండేండ్ల కింద నిర్మాణ పనులు ప్రారంభం కాగా ఇటీవల పూర్తవడంతో ప్రారంభానికి సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆర్డీవో ఆఫీస్ పక్కనున్న జిల్లా జైలు అరకొర సౌకర్యాలతో ఖైదీలకు సరిపోవడం లేదు. ఈనేపథ్యంలో విశాలమైన స్థలంలో జైలు నిర్మించేందుకు నిర్ణయించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంగా మారడం, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు కావడంతోపాటు పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ఖైదీలకు అనుగుణంగా సిద్దిపేట సబ్ జైలు లేకపోవడంతో 2018లో జైలు మంజూరైంది. జైలు నిబంధనల ప్రకారం ఐదు కిలోమీటర్ల పరిధిలో 100 పడకల హాస్పిటల్ ఉండాలనే నిబంధన నేపథ్యంలో ఎన్సాన్పల్లి శివారులో నిర్మాణ పనులను ప్రారంభించారు.
రూ.9కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా జైలు ఆధునిక సౌకర్యాలతో పాటు పటిష్ట నిఘా ఉండేలా రూపకల్పన చేశారు. సుమారు 400 మందికి పైగా ఉండేలా, భవిష్యత్‌లో ఈ సంఖ్య పెరిగినా ఇబ్బందులు కలగకుండా జైలును నిర్మించారు. దీనిలో పురుష, మహిళా ఖైదీల కోసం వేర్వేరుగా బారక్‌లు నిర్మించారు. సిద్దిపేటలో జిల్లా జైలు 8 బారక్లతో హైసెక్యూరిటీతో ఈ జైలు నిర్మించారు. మొత్తం బారక్‌ల్లో మహిళలకు సపరేట్గా ఒకదానిని కేటాయించారు. దీనిలో 60 మంది మహిళా ఖైదీలు ఉండేదుకు వసతులు కల్పించారు. మిగిలిన ఏడు బారక్‌లు పురుష ఖైదీల కోసం నిర్మించగా.. వీటిలో దాదాపు 350 మందికి పైగా ఉండేలా ఏర్పాటు చేశారు.
జైలు చుట్టు 40 అడుగుల ఎత్తులో వాచ్ టవర్లను ఏర్పాటు చేసి రాత్రీ పగలు పహారా కాయనున్నారు. జైలులో ఖైదీలు అనారోగ్యం పాలైతే చికిత్స కోసం ప్రత్యేక బెడ్స్, లైబ్రరీ, ఖైదీల చేత పనులు చేయించేందుకు నాలుగు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఖైదీలు పారిపోకుండా దాదాపు 7 మీటర్ల ఎత్తైన కాంపౌండ్, దానికి కరెంట్ ఫెన్సింగ్ వైర్ ఏర్పాటు చేశారు. ఈ జైలులో డిప్యూటీ సూపరింటెండెంట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌తోపాటు 16 విభాగాలకు సంబంధించి 66 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. జైలు లోపల సిబ్బంది నివాసానికి క్వార్టర్స్‌ను నిర్మించారు.
అధునాతన రీతిలో నిర్మించిన జిల్లా జైలును ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సీఎం పర్యటించనుండగా.. అదే రోజు జిల్లా జైలును ప్రారంభించనున్నారు. జిల్లా జైలు నిర్మాణం పూర్తి చేసుకుని దాదాపు ఆరు నెలలు కావస్తున్నా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. (ఏజెన్సీలు)
