हैदराबाद: रामोजी ग्रुप ऑफ कंपनीज के चेयरमैन रामोजी राव की अंतिम यात्रा फिल्म सिटी स्थित उनके आवास से शुरू होकर स्मृति वनम पहुंची है। टीडीपी नेता और सीएम चंद्रबाबू नायडू रामोजी राव के अंतिम संस्कार में शामिल हुए। इस दौरान रामोजी ने पार्थिव शरीर को श्रद्धांजलि दी और अंतिम यात्रा में शामिल हो गये।
तेलंगाना सरकार रामोजी राव का अंतिम संस्कार सरकारी सम्मान के साथ कर रही है। एपी सरकार की ओर से आईएएस अधिकारी आरपी सिसौदिया, रजत भार्गव और साई प्रसाद भी कार्यक्रम में शामिल हुए। अंतिम यात्रा में विभिन्न राजनीतिक दलों के नेता, फिल्मी हस्तियां और रामोजी समूह संगठनों के कर्मचारी बड़ी संख्या में उपस्थित थे।
संबंधित खबर-
రామోజీరావు అంతిమయాత్ర
హైదరాబాద్ : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంతిమయాత్ర ఫిల్మ్ సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన స్మృతి వనం వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో అంతియ యాత్రకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అనంతరం రామోజీ భౌతిక కాయం వద్ద నివాళులర్పించి ఉద్విగ్నమైన క్షణాల్లో పాడెను మోశారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం తరఫున ఆర్‌పీ సిసోడియా, రజత్ భార్గవ, సాయి ప్రసాద్ ఐఏఎస్ అధికారులు కూడా హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇంతకు ముందు తీవ్ర అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు అంత్యక్రియలు రామోజీ ఫిలీం సిటీలోని నివాసం వద్ద ప్రారంభం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో, పోలీసుల గౌరవ వందనం అనంతరం అంతిమ యాత్ర మొదలయ్యాయి. రామోజీరావును కడసారి చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తన ఫిలిం సిటీకి వచ్చారు. రామోజీ నివాసం నుంచి స్మృతి వనం వరకు అంతియ యాత్ర కొనసాగనుంది. అదేవిధంగా ఆయన పెద్ద కొడుకు కిరణ్ దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, తదితర ప్రముఖులు అంతియ యాత్ర వెంట ఉన్నారు.(ఏజెన్సీలు)