బ్రిటన్ పార్లమెంట్ లో BRS పార్టీ అంబెడ్కర్ పేరుతో చేసిన కార్యక్రమం తో బ్రిటన్ ఎంపీ ల పేరుతో BRS తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రచారం ,అసత్యాన్ని ఖండిస్తూ టీపీసీసీ ఎన్నారై సెల్ నుండి విడుదల చేసిన ప్రెస్ నోట్ , ఎంపీ లకు అందజేసిన లేఖ
BRS సభ్యులు, మే 9, 2023 బ్రిటన్ పార్లమెంట్ లో మంగళవారం డా. అంబెడ్కర్ పేరుతో కార్యక్రమం నిర్వహించి బ్రిటన్ ముగ్గురు ఎంపీ లు నవీందు మిశ్రా , కుల్దీప్సింగ్ సహోట ,వీవీరేంద్ర శర్మ లనిఆహ్వానించి, అంబెడ్కర్ చాటున రాజకీయ లబ్ది, వ్యక్తి ప్రతిష్ట పెంపొందించే కుట్ర చేసి, మోసగించి, ఎంపీ లని, ప్రవాసులని తెలంగాణ ప్రజలని మోసగంచడం జరిగంది .
సంబంధిత వాస్తవ అంశాలని లేఖ ద్వారా పాల్గొన్న ముగ్గురు ఎంపీ ల ద్రుష్టి కి లేఖ ద్వారా తెలిపి, BRS పార్టీ కుట్ర ని వారి ద్రుష్టి కి తీసుకెళ్లడం జరిగింది.
అంబెడ్కర్ పేరు చెప్పగానే ఏ ప్రజాప్రతినిధి ఐన హాజరు అవడం, వారిని గౌరవించడం సర్వ సాధారణం. BRS రాజకీయ లబ్ది ప్రచారం చేసుకునే కుట్ర లో బ్రిటన్ ఎంపీ ల పేర్లు వాడుకోవడం జరిగింది .
రాజ్యాంగ నిర్మాత, దేశ ప్రజాస్వామ్యానికి సూచిక, అంబేద్కర్ గురించి, వారి ఆశయ సాధన, వారి విద్యా, స్ఫూర్తి చైతన్యం గురించి మాట్లాడకుండా, ఇలా ఒక ఎన్నికల్లో ఓట్ల లబ్ది కోసం చేసిన ఆకర్షనియ కనికట్టు పధకం గురించి, అంబెడ్కర్ గారి భావజాలం లేని, స్పూర్తి లేని ఆత్మ లేని శారీరక నిలువెత్తు విగ్రహం గురించి మాట్లాడటం మిమ్ములను అవమానించడం తో పాటు భారతీయులని మోసం చేసినట్లే.
1) ఈ BRS పార్టీ మొదటి నుండి ఒకసారి అధికారం లోకి వస్తే దళితుని సీఎం చేస్తా అని చెప్పి ఓట్లు పొంది 2014, 2018 ల లో 2 సార్లు అధికారం లోకి వచ్చి దళితున్ని సీఎం చేయకుండా మోసం చేశారు. తానే సీఎం అయ్యాడు
2) 2014-2018 ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టో లో దళితులకు 3 ఎకరాలు అగ్రికల్చర్ భూమి ఇస్తాం అని చెప్పి మోసం చేశారు.
3) అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మరుస్తాం, తీసివేయాలని మాట్లాడి, చర్చ జరగాలని దేశం మొత్తం తిరిగి అంబేద్కర్ ని అగౌరవ పరిచారు.
4) రాజ్యాంగ బద్ద, చట్ట బద్ద రక్షణ కలిగి 25000 కోట్ల నిధులు విడుదల తో రూప కల్పన చేసిన SC సబ్ ప్లాన్ పాలసీ ని తొలగించి కేవలం 8% ₹2000 కోట్ల నిధులు దళిత బంధు కు కేటాయించి దళితులకు అన్యాయం చేస్తుంది.
5) 20 లక్షల ఎకరాలు గల అసైన్ భూములు, భూ దాన్ భూములు, శిఖం భూములు, దళితులకు అందకుండా ధరణి పాలసీ తీసుకువచ్చి దళితులకు భూ పంపిణి చేయకుండా చేసింది. ఇందులో 12 లక్షల భూదాన్ భూములు ఉన్నాయి.
6) ఎన్నికల ల్లో దళితులకు 3 ఎకరాల పంపిణి చేస్తం అని ఓట్లు వేయించుకొని, పంపిణి చేయకుండా మోసం చేసింది.
7) దళిత ఇండస్ట్రీయల్ పాలసీ ద్వారా దళిత యువకులకు 10000 కొట్లు పంచె అవకాశం నిర్వీర్యం చేసి దళిత బంధు పేరుతో 2000 కొట్లు పంచి మోసం చేస్తుంది.
8)దళిత సంక్షేమ హాస్టల్ లకు 100 ల కొట్లు నిధులు నిలిపి వేసి దళిత విద్యార్థి లకు అన్యాయం చేస్తుంది.
ఇలా అంబేద్కర్ ఆశయాలకు, స్ఫూర్తి కి ద్రోహం చేస్తూ, వారి పేరుతో మోసం చేయడం హాస్యాస్పదం. ప్రతి దేశం లో ప్రతి పార్టీ వీకర్ సెక్షన్ కి వివిధ పధకాలు పెట్టడం సర్వ సాధారణం. ఐతే ఇటీవల కాలం లో ఎన్నికల్లో లబ్ది, ఓట్ల కోసమే పధకాలు పెట్టి తాత్కాలిక ప్రయోజనం పొందే దురుద్దేశం తో పాలసీలు రూపకల్పనా చేస్తున్నారు. అందులో భాగమే ఈ దళిత బంధు.
సచివాలయం కి అంబెడ్కర్ గారి పేరు పెట్టినా అదే రోజు నుండి ప్రతి పక్షం పార్టీలను రానీయక పోవడం , రానీయం అని ఆ BRS పార్టీ మంత్రులు మాట్లాడటం అంబేద్కర్ ఆశయాల్లో ప్రజాస్వామ్యం రక్షణ కి తూట్లు వేయడం.
ధన్యవాదములు
గంప వేణుగోపాల్
కన్వీనర్
టీపీసీసీ ఎన్నారై సెల్