हैदराबाद : बीआरएस के अध्यक्ष और तेलंगाना के मुख्यमंत्री कल्वकुंट्ला चंद्रशेखर राव ने घोषणा की है कि महाराष्ट्र के हर गांव में भारत राष्ट्र समिति समितियों का गठन किया जाएगा। तेलंगाना भवन में सीएम केसीआर की मौजूदगी में महाराष्ट्र के चंद्रपुर से कई लोग बीआरएस में शामिल हुए। इस अवसर पर बोलते हुए उन्होंने कहा, “भारत राष्ट्र समिति भारत के परिवर्तन के लिए एक मिशन के रूप में काम करेगी। 7 मई से 7 जून तक हम महाराष्ट्र के हर गांव में एक बीआरएस समिति का गठन करेंगे। हम एक विशाल किसान रैली का आयोजन करेंगे। महाराष्ट्र में 10 से 12 लाख किसानों के साथ रैली का आयोजन करेंगे। बीआरएस भारत के परिवर्तन के लिए स्थापित एक मिशन है।” उन्होंने कहा कि यह मिशन तब तक जारी रहेगा जब तक कोई बदलाव नहीं होता है।
మహారాష్ట్రలో ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ కమిటీలు, 12 లక్షల మందితో కిసాన్ ర్యాలీ : కేసీఆర్
హైదరాబాద్ : మహారాష్ట్రలోని ప్రతీ గ్రామంలో భారత్ రాష్ట్ర సమితి కమిటీలు వేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన పలువురు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “భారత్ పరివర్తన్ మిషన్‌గా భారత్ రాష్ట్ర సమితి పని చేస్తుందన్నారు. మే 7 నుంచి జూన్ 7 వరకు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కమిటీ వేస్తాం. 10 నుంచి 12లక్షల మందితో మహారాష్ట్రలో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తాం” అని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. భారత్ పరివర్తన్ కోసం ఏర్పాటైన మిషన్ బీఆర్ఎస్. ఎప్పటివరకు మార్పురాదో అప్పటివరకు ఈ మిషన్ కొనసాగుతుంది అని అన్నారు.
”ఇంతకుముందే పలు మీటింగ్ లలో మీరు నా సందేశాన్ని విన్నారు. దేశంలో ఎన్నో పార్టీలున్నాయి. మరెందరో రాజకీయ నాయకులున్నారు. దేశంలో వీటికి తక్కువ లేదు. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ఇలా ఎన్నో పార్టీలున్నాయి. 75 స్వతంత్ర భారతదేశంలో వేల ప్రసంగాలను విన్నాం. ఎందరో రాజకీయ నాయకుల మాటలు విన్నారు. మనది వింతైన దేశం. మన దేశ ప్రజలు కూడా వింతైన వారు. దేశ పరిస్థితుల పై అవగాహన ఉండి కూడా మనం సరైన రీతిలో స్పందించడం లేదు. మనం కుట్రలో ఇరుక్కుపోయాం. దీనికి గల కారణాలను ఏమిటి ? దీని పై మనం తప్పకుండా చర్చించాలి. అందుకే నేను ఇక్కడ చెప్పే విషయాలను ఇక్కడే మరిచిపోకుండా మీ మీ ఊళ్ళకు వెళ్ళిన తర్వాత ఈ విషయాల పై చర్చించమని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా కోరుతున్నాను.
దీని వెనుక నేపథ్యాన్ని, మంచి చెడులను, నిజానిజాలను చర్చిస్తే మీరు దేశానికి ప్రయోజనం చేకూర్చినవారవుతారు. ఎన్నికల కోసమో, ఎవరినో నాయకున్ని చేయాలనే లక్ష్యంతోనో బీఆర్ఎస్ ఆవిర్భవించలేదు. బీఆర్ఎస్ కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమైన పార్టీ కాదు. భారతదేశం సంస్కరించబడాల్సిన అవసరం ఉంది. దేశం సంస్కరించబడనంత వరకు మన జీవితాలు మారవు. ప్రసంగాలు వింటుంటూనే, రాజకీయ నాయకుల పొడగ్తలు వింటుంటేనే మన దేశ పరిస్థితిల్లో ఎలాంటి మార్పులు రాబోవు. ఇది ఖాయం. 50 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను అంతా గమనిస్తూనే ఉన్నాను. అంతా మన కళ్ల ముందే ఉంది. మన దేశానికి అపూర్వ సంపద ఉంది. ఎవ్వరిని బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం లేదు” అని సీఎం కేసీఆర్ అన్నారు.
Related News:
నీరు, విద్యుత్తు వంటి సమస్యలను తెలంగాణ తప్ప మహారాష్ట్రతో పాటు యావత్ దేశం ఎదుర్కొంటున్నదని కేసీఆర్ అన్నారు. తాగునీరు, సాగునీరు, పరిశ్రమలతో ఇతర అవసరాలకు కావాల్సిన నీటి వనరులకు మించి రెండు రెట్ల జల వనరులు మన దేశంలో అందుబాటులో ఉన్నాయన్నారు. అయినా మనం నీటి కొరతను ఎదుర్కొంటున్నామన్నారు. ఈ ఒక్క విషయాన్ని విశ్లేషిస్తే మనకు మిగతా పరిస్థితులను అవగాహనలోకి వస్తాయన్నారు. ” మహారాష్ట్ర ‘కిచిడీ’ ప్రభుత్వం నుంచి మమ్మల్ని రక్షించమని ప్రజలు కోరుతున్నారు. జల వనరుల కోసం మన దేశం రష్యానో, అమెరికానో ప్రాధేయపడాల్సిన అవసరం లేదు.
ఎవరి అనుమతి అవసరం లేదు. పుష్కలంగా నీటి లభ్యత ఉన్నప్పటికీ మనకు నీరు ఎందుకు అందటం లేదు. దీని వెనుక జరుగుతున్నదేమిటి. రాజకీయాలు, విధానాలు, రాజ్యాంగం అనే అంశాలు ఎక్కడో ఆకాశంలో లేవు. మన భూమి పైనే ఉన్నాయి. నీరు లేకపోతే జీవితమే లేదు. మరి నీటి సమస్యలు ఎందుకు నివారించలేకపోతున్నారు ? నీటిని ఫ్యాక్టరీల్లో తయారుచేయలేం. మనిషి నీటిని తయారుచేయనే లేడు. నీరు దేవుడు ప్రసాదించిన వరం. నీటిని పరిశ్రమల్లో తయారుచేయడం మీరు ఎవరైనా చూశారా ? ఇది చిన్న విషయమే కావచ్చు. కానీ ఎవరికీ దీని పై ఆలోచనే లేదు. నీటిని భగవంతుడు సృష్టిస్తే ప్రకృతి మనకు అందిస్తుంది. నీరు చాలా అమూల్యమైనది. నీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన దేశంలోని ఎన్నో వరద ప్రభావిత ప్రాంతాలున్నాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఐనా మనం ఏమీ జరగనట్లుగా ఉంటాం. రాజకీయ నాయకులకు గానీ మనకు గానీ ఎలాంటి విచారం లేదు.
ప్రజలు ఒక పార్టీకి కాకపోతే మరొక పార్టీకి ఓటు వేస్తారు. కాబట్టీ వాళ్ళకు ఎలాంటి బాధా లేదు. వాళ్ళ దుకాణాలు ఏదో ఒక విధంగా నడుస్తూనే ఉన్నాయి. రైతుల చనిపోతే వాళ్ళకు పోయేదేముంది. మనం మూర్ఖులం. ఐనా వారికి ఓటు వేస్తూనే సాగుతున్నాం. ఎన్నికలు రాగానే మనకు కులతత్వ రోగం, మతతత్వ రోగం అంటుకొని మనం విభజింపబడతాం. మన జీవితాలను మార్చే ఓటును వారు చెప్పారని, వీరు చెప్పారని ఎలాంటి ఆలోచన లేకుండా చాలా తేలిగ్గా ఎవరికి పడితే వారికి వేస్తున్నాం. ఎవరికి ఓటు వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం. మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే ఆలోచన లేకుండా ఓటు వేయవద్దు. బాగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు.
”గడ్చిరోలి ప్రాంతం గుండా గోదావరి నది ప్రవహిస్తున్నా అక్కడ తాగడానికి నీరు ఎందుకు లభించడం లేదు ? ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసెంబ్లీలు, మంత్రిత్వశాఖలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఉన్నా దేశానికి ఈ బలహీనత ఏంటి? దేశంలో 1 లక్షల 40 వేల టీఎంసీల వర్షపాతం నమోదవుతుంది. దీంట్లో సగం నీరు ఆవిరైనా ఇంకా 70 వేల టీఎంసీల నీరు మన నదుల్లో ప్రవహిస్తుంది. అమెరికా వైశాల్యం మనకన్నా రెండున్నర రెట్లు, చైనా వైశాల్యం మన దేశం కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కానీ వారి దగ్గర వ్యవసాయ యోగ్యమైన భూమి తక్కువగా ఉంది. అమెరికాలో వ్యవసాయ యోగ్యమైన భూమి 19 శాతం, చైనాలో 16 శాతం మాత్రమే ఉంది. మన భారతదేశం భాగ్యవంతమైన దేశం. దేశ పూర్తి వైశాల్యం 83 కోట్ల ఎకరాలుంటే అందులో 41 కోట్ల ఎకరాల భూమి (50 శాతం) వ్యవసాయ యోగ్యమైనది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనదేశం యావత్ ప్రపంచానికి అన్నం పెట్టాల్సింది. మన దేశ రైతు ప్రపంచంలోనే అవ్వల్ దర్జా రైతుగా ఉండాలి. రైతులు పొలాల్లో పండించిన పంటలు నేరుగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు వెళ్లాలి. వీటిలో కోట్ల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభించాలి. ఇక్కడ తయారైన ఆహారోత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావాలి. కానీ ఈ రోజు దేశంలో ఏం జరుగుతున్నది ? మన పిల్లలు పట్టణాల్లో, గ్రామాల్లో కూడా మెక్ డొనాల్డ్ పిజ్జా తింటున్నారు. మన జొన్నరొట్టె ముందు అదెంత ? కానీ మనం పిజ్జాలు తింటున్నాం. బర్గర్లు తింటున్నాం. అసలు కథేంటి అంటూ” కేసీఆర్ నిలదీశారు.
”70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నమన దేశంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైనదైతే భారతదేశంలోని ప్రతీ ఎకరాకు నీటి అందించవచ్చు. మరెందుకు ఇవ్వలేక పోతున్నారు. నీరు ఎటు పోతంది.? మన కళ్ల ముందే నీరు గడ్చిరోలి జిల్లా నుంచి సిరోంచ గుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తున్నది. మన నాయకులందరి ముందు నీరు ప్రవహించుకుంటూ పోతున్నది. ప్రజలతో ఇలాంటి ప్రహసనాలు ఇంకెన్నాళ్ళు చేస్తారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు అందిస్తారా ఇవ్వరా అనేది సవాలు. ఈ నాటకాన్ని సమాప్తం చేసి నీటిని బంధించి, ఆనకట్టలు కట్టి ప్రజలకు తాగునీటిని, పంట పొలాలకు సాగునీటిని అందించి రైతన్నలు బంగారు పంటలు పండించి, వారి ఇండ్లు సిరిసంపదలతో తులతూగేలా చేసే లక్ష్యంతో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఇది వాస్తవ రూపం దాల్చాలా వద్దా మీరు ఆలోచించుకోండి” అని అన్నారు.
తెలంగాణలో ప్రతీ ఇంటిలో తాగునీటి నల్లాలున్నాయని కేసీఆర్ చెప్పారు. ప్రతీ ఇంటికి కావాల్సిన శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. తాగునీటిని అందించే ముందు నాణ్యతా పరీక్షలు కూడా చేస్తున్నామన్నారు. బంజారాహిల్స్ లో ధనికులు తాగే నీటినే ఆదిలాబాద్ జిల్లాలో నివసించే గోండులు కూడా తాగుతున్నారని చెప్పారు. మరి మహారాష్ట్రలో తాగునీటిని ఎందుకు అందించలేకపోతున్నారు అని ప్రశ్నించారు.
”మహారాష్ట్ర పుణ్యభూమిలో ఎన్నో నదులు పుడుతున్నాయి. గోదావరి, కృష్ణా, వెన్ గంగ, పెన్ గంగ, వార్ధా, మూల, ప్రవర, పంచగంగ, మంజీర, భీమా లాంటి ఎన్నో నదులు ఇక్కడ పుడుతున్నాయి. మహరాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఎనిమిది రోజులకోసారి తాగునీరు అందిస్తున్నారని తెలిసింది. అకోలా లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఎందుకూ అగత్యం ? మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు ? తెలంగాణ రాష్ట్రం ఏర్పాడక ముందు ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఉండేవి. తాగేందుక నీళ్ళు ఉండేవి కాదు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది. వ్యవసాయానికి నడిరాత్రిలో ఇచ్చే కరెంటుతో పాములు కుట్టి, షాక్ లు తగిలి రైతులు మరణించేవారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. ప్రజలు వలస పోయేవారు. కానీ పోరాటం చేసి దేవుని దయతో సొంత రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. నేడు రైతుల ఆత్మహత్యలు లేవు. వలస పోయిన వారు తిరిగి తమ సొంతూళ్లకు తిరిగి వచ్చారు. రైతులకు 24 గంటల కరెంటునిస్తున్నాం. మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలడం అనే సమస్యలు లేవు. తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడిగా రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి 10 వేల రూపాయలిస్తున్నాం. పరిమితి లేకుండా ఎన్ని ఎకరాలైతే అన్ని ఎకరాలకు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం 2,601 అగ్రి క్లస్టర్లుగా విభజించి, ఒక్కో క్లస్టర్ కు అగ్రికల్చర్ ఆఫీసర్ ను నియమించాం.
ఐదు వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ చొప్పున బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి వద్ద ప్రతీ రైతుకు సంబంధించిన అడ్రస్, ఆధారకార్డు, ఫోన్ నంబర్ తదితర సమాచారం ఉంటుంది. పంట పెట్టుబడితో పాటు రైతు ఏదైనా కారణాలతో మరణిస్తే రూ. 5 లక్షలు బీమాగా అందిస్తున్నాం. బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. రైతు మరణిస్తే 8 రోజుల్లోగా వారి కుటుంబానికి బీమా మొత్తాన్ని అందించడం జరుగుతుంది. ఇప్పటివరకు మరణించిన లక్ష మంది రైతులకు ఈ బీమా మొత్తాన్ని చెల్లించి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకున్నది. వ్యవసాయ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఈ బీమా మొత్తాన్ని అందించడం జరుగుతుంది. రైతులు పండించిన మొత్తం పంటను తెలంగాణ ప్రభుత్వమే నేరుగా కొంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్య సేకరణ జరుగుతున్నది. 7,100 కు పైగా ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. మూడు నాలుగైదు రోజుల్లోగా వారి ఖాతాల్లో ప్రభుత్వం పైసలు జమ చేస్తుంది. రైతుబంధు, రైతు బీమా పథకాల ప్రయోజనాలను ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. రైతును రాజు చేసే విధానమంటే ఇది” అని కేసీఆర్ అన్నారు.
”భూ రికార్డుల్లో జరిగే అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. భూమ యాజమాన్య హక్కులు ఎవరి నుంచి ఎవరికి సంక్రమిస్తాయో ఎవరికీ తెలియదు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ రైతుల రక్తాన్ని పీల్చివేసింది. మహారాష్ట్రలో భూ క్రయవిక్రయాల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి, పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా ముగిసేటట్లుగా విధానాలు తీసుకొచ్చాం. తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని పుకార్లు పుట్టిస్తున్నారు. మేము ఇక్కడ ఏండ్లుగా అమలు చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉంది. మహారాష్ట్రకంటే చిన్న రాష్ట్రం కావడంతో పాటు ఆర్థికంగా మహారాష్ట్ర తర్వాతే నిలిచే రాష్ట్రమైన తెలంగాణ దివాళా తీయనప్పుడు మహారాష్ట్ర ఎలా దివాళా తీస్తుంది. కానీ అవినీతికి పాల్పడే నాయకులు మాత్రం దివాళా తీస్తారు. నీళ్లు, కరెంటు విషయంలో దేశ ప్రజలను ఎందుకు వంచిస్తున్నారు? ప్రకృతి ఇచ్చిన వరాన్ని ఎందుకు కాలరాస్తున్నారు? ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మన సమస్యలు తీర్చరు. మనమెంత చైతన్యవంగా ఉంటే అంత త్వరగా సమస్యలు తీరుతాయి. మేకిన్ ఇండియా అంటారు. దేశమంతా నిండా చైనా బజార్లే ఉంటాయి. పతంగుల మాంజా నుంచి దేవుళ్ల విగ్రహాల దాకా చైనా నుంచే వస్తాయి. ఫ్లయిట్ నుంచి లైట్ వరకు చైనా నుంచే ఎందుకు తెచ్చుకోవాలి? మన వస్తువులను మనం తయారు చేసుకునే శక్తి, యుక్తులు, సంపద మనకు లేవా?”
భారత్ రాష్ట్ర సమితి ‘భారత్ పరివర్తన్ మిషన్‌గా’ పని చేస్తుంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఏం పని అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేస్తే మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోతామని చెప్పాం. ఫడ్నవీస్ నుండి ఇప్పటి వరకు ఏం సమాధానం రాలేదు. మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్ కావాలి. రైతు ఆత్మహత్యలు లేని మహారాష్ట్రగా తీర్చిదిద్దుకుందాం. తెలంగాణలో సాధ్యమైన పథకాలు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావు అని కేసీఆర్ ప్రశ్నించారు.
మహారాష్ట్రలో వచ్చే జెడ్పీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ”ఓటు వేస్తేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. మహారాష్ట్రలో ప్రతీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలుంటారు. అన్ని కమిటీలు వేసి మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తాం. జిల్లా పరిషత్ ఎన్నికలతో BRS రంగంలోకి దూకుతుంది. ప్రతీ గడపను తట్టండి. ప్రతీ మనిషినీ పలకరించండి. నాగ్‌పూర్, ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. మే 7 నుంచి జూన్ 7 వరకు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కమిటీ వేస్తాం. 10 నుంచి 12లక్షల మందితో మహారాష్ట్రలో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తాం ” అని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. (ఏజెన్సీలు)