BRAOU ORGANIZING AWARENESS PROGRAM ON ‘JOB AND SKILL-ENHANCEMENT’ ORIENTED COURSES

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కోర్సులు – నైపుణ్యాలపై ఆదివారం అన్ని అధ్యయన కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులకు కార్పోరేట్ సంస్థలలో ఉద్యోగాలు పొందడానికి అవసరమైన నైపుణ్యం అందివ్వడానికి TCSiON, WeHUB, RASCI, SRTRI వంటి సంస్థలతో ప్రత్యేక కోర్సులు ప్రారంభించినట్లు తెలిపారు. డిగ్రీతో పాటు వీటిని అదనంగా ఎంచుకోవాలని, వాటికి సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. TCSiON వారితో పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలు, కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లీషు భాషా నైపుణ్యాలు, ఐటీ నైపుణ్యాలు (B.A., B. Com, B. Sc.) మెదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థలకు అవకాశం ఉందన్నారు.

అదేవిధంగా రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ తో ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు, మొబైల్ మరమ్మత్తు, సౌర శక్తి , CC కెమెరాల మానేజ్మెంట్ లాంటి కోర్సులు, మహిళల కోసం బ్యూటీషియన్ కోర్సులు, ఎంబ్రాయిడరీ లాంటి కోర్సులు ఉన్నాయన్నారు. Wehub సహకారంతో విద్యార్థినులను మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ అవగాహణ కార్యక్రమాలు జంట నగరాలతో పాటు అన్ని అధ్యయన కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని, విద్యార్థులు అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. పూర్తి వివరాల కోసం www.braou.ac లో, లేదా సమీపంలోని అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లను సంప్రదించాలని, లేదా 04౦- 23680333 / 555 లో సంప్రదించాలని సూచించారు.

BRAOU ORGANIZING AWARENESS PROGRAM ON “JOB AND SKILL-ENHANCEMENT” ORIENTED COURSES

Hyderabad : Dr. B. R. Ambedkar Open University today conducting Orientation program on “Job, employment, and skill-enhancement courses” for first and second-year degree students at all BRAOU learner services centre across Telangana on Sunday. The university has launched training programs in collaboration with organizations such as TCSiON, WeHUB, RASCI, and SRTRI to equip students with the necessary skills to secure employment in corporate firms. Students urged to opt for these courses as supplements to their regular degree programs, noting that admissions are currently underway with TCSiON, opportunities are available for first and second-year degree students (B.A., B. Com & B.Sc.) to acquire industry-relevant skills, including computer proficiency, English language skills, business management skills and IT skills.

Similarly, Sri Ramananda Tirtha Rural Institute (SRTRI), students can acquire skills in areas such as basic computer operations, mobile repair, solar energy, and CCTV camera management and beautician training and embroidery are available for women. We-Enable program in collaboration with We Hub, efforts are underway with the objective of transforming female students into women entrepreneurs. Students were urged to avail themselves of this opportunity these awareness programs are being conducted across all study centres including twin cities to encouraged the learners. For complete details, students were advised to visit www.braou.ac.in or to contact the coordinators at their nearest study centres, or contact: 04023680333 / 555.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X