Hyderabad: Centre for Staff Training and development (CSTD) of Dr. B. R. Ambedkar Open University (BRAOU), today inaugurated six half days training program on “Tally Accounting Package” for all Non-teaching and technical staff at its campus on Tuesday.
Prof. Ghanta Chakrapani, Director Academic attended as chief guest to the program. He said that the staff working in the public sector should improve their skills in accordance with the modern knowledge coming in their respective fields from time to time. Mastering ICT, having a complete understanding of the working organization.
Dr.Suseela Kanduri, Dean Academics and Vice-President, Avinash Group of Instituitions, Hyderabad attended as guest of honour for the program, she explained how much technical knowledge is necessary for employees and the need to learn.
Prof.I. Anand Pawar, Director CSTD preside over the program, he said that in the coming days, under the auspices of CSTD, training classes will be organized for all Non-teaching and technical staff members of the university to run in a smooth functioning.
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అధ్యపక, అధ్యపకేతర సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ
హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (సి.ఎస్.టి.డీ) ఆధ్వర్యంలో అధ్యాపకేతర సిబ్బందికి ఆరు రోజులపాటు జరగనున్న “ట్యాలీ అకౌంటింగ్ ప్యాకేజీ” శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంట చక్రపాణి, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో పనిచేసే సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయా రంగాల్లో వస్తున్న ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఐ.సి.టి. పై పట్టు సాధించడం అంటే పని చేసే సంస్థపై పూర్తి అవగాహన కలిగి ఉండడం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉప అధ్యక్షురాలు, డీన్ అకడమిక్స్ డా. సుశీల కందూరి హాజరై ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగులకు ఎంతగా అవసరం, నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
కార్యక్రమానికి సి.ఎస్.టి.డి డైరెక్టర్ ప్రొ. ఐ. ఆనంద్ పవార్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో సీ.ఎస్.టి.డి ఆధ్వర్యంలో అధ్యాపకేతర సిబ్బందికి వివిధ అంశాలపై మరిన్ని శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శిక్షణా తగరగతుల్లో అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.