TELANGANA IS A ROLE MODEL FOR COMPREHENSIVE DEVELOPMENT

• BRAOU Organised Panel Discussion on Telangana development • Income of Southern States to Northern States : Prof. Ghanta Chakrapani
• Development is possible only in small states: Prof. Revathi, Director, CESS
• Governance closer to the people with the formation of a new district: Prof. Chenna Basavayya
15 percent Additional land cultivable in separate state: Prof. Ramana Murthy

Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU) today Organized a Panel Discussion on “The Telangana Growth Story” as a part of Telangana Decennial Celebrations at its Campus on Saturday 24, 2023. Prof. K. Seetharama Rao, Vice-Chancellor, Dr. B. R. Ambedkar Open University attended as chief guest for the program.Prof. Rao said that the state of Telangana, which was formed 9 years ago, is at the forefront of development in the country and more than 90 percent of the development awards at the national level are coming to Telangana.

He praised that the reason for this is the good faith of the rulers, even though things like demonetization have become a problem due to the Covid Pandemic, they have not become a major hindrance to the development of Telangana. He also said The Hon’ble Chief Minister of Telangana State KCR, foresight, awareness of resource availability, economic discipline training and provision of welfare schemes to the poor have made Telangana top in the country.

Prof Ghanta Chakrapani, Director Academic, BRAOU presided over the program. Prof. Chakrapani said that development is a continuous process and comprehensive development is possible only when the rulers are along with the development of the society. He expressed concern that only 49 percent of the income from the southern states is returned in the form of taxes and that the income here is being transferred to the northern and northeastern states where there is no financial discipline and family control and this has become a curse for the people of the southern states. He expressed concern that if there is a delimitation of Parliament seats in the coming days, there is a danger of losing the representation of southern states in the Legislative Assembly.

In the Panel Discussion, Prof. Revathi, Director, CESS said that the Telangana state has made possible the argument that the development that does not happen in big states is possible only in small states. Education should be provided to all, health should be made more accessible to the poor, and the rulers should take steps to ensure that the fruits of the government’s welfare are provided equally to all. She also said that the same would be possible in Telangana if the living standards of the people are increased

and the per capita income is increased, which will contribute to the development of the state, the states are bearing 60 percent allocation of the cost of implementation of the welfare programs implemented in those states, the projects like Kaleswaram are widely useful for rural telangana development. It has been revealed that Rythu Bandhu and Rythu Bhima have given assurance to the farmers. Telangana’s industrial policy has attracted investors. Prof. Revathi explained that the creation of infrastructure has changed the face of Telangana.

Prof. Chenna Basavaiah said that policy decisions play a major role in development. Governance should be appealing to the people, that is, people should be involved in the governance. He explained that the division of large districts and the creation of new districts helped to decentralize governance and bring governance closer to the people. The formation of revenue divisions, mandals, formation of Thandas and Gudams as gram panchayats, formation of new municipalities and corporations have brought the governance of the government closer to the people. The workload of officers has reduced and quality services have become available.

The government wants to pay attention to the fact that despite the establishment of integrated district collectors in the districts, the number of staff has not been increased. There has been no transfer of power and decision making. No other state in the country has as many welfare schemes as Telangana. He explained that there is no other place in the world where funds are deposited directly into the accounts of the beneficiaries. He also said revolutionary reforms like Telangana I-Pass and Industrial development have helped the economic development of Telangana.

Prof. R. V. Ramana Murthy,faculty member of Central University of Hyderabad said that innovative developments have taken place in the agricultural sector in Telangana. He said that restoration of Mission Kakatiya ponds and construction of projects have inaugurated a new Telangana. He said that after the formation of a separate state in Telangana, the cultivated land has increased by 15 percent, which has not been possible in any state in recent times.

The crop grown in the state is more than the requirement of the state and the center is not cooperating properly in the matter of purchasing the rest of the grain. There is a lack of coordination between the central and state governments and this will harm the interests of the people of the state. In the coming days, the grain yield may increase further, and ethanol factory is the solution at such a time. He said that some people are against the establishment of such industries and there is a need for industrialization to grow according to our needs. After observing the needs of the people of our country, China is expanding its market and strengthening itself economically.

The central government should provide financial support to the state, but the center is not supporting the state of Telangana. The debt that has already been raised may become a problem for the state, and as luck would have it, the Chief Minister of Telangana, KCR, has raised a loan at low interest. He mentioned that the income from the southern states is already being transferred to the northern and north-eastern states, so that the southern states have to depend more on loans for development and prosperity.

Earlier, a Geography book was Released for rural students who are preparing for competitive exams. Its price is fixed at Rs 250. It is known that four books have already been made available for the students preparing for the competitive examinations and they were unveiled by Hon’ble Minister KTR, a set of five books has become available at the University.

Dr. Banoth Lal, EC Member, Prof. P. Madhusudhana Reddy, Director, CIQA Deans, Prof. Shakeela Khanam, Prof. Vaddanam Srinivas, Directors Prof. Gunti Ravi, Dr. Parankusham Venkataramana, Controller of Examinations, All Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff members and representatives of University Service Associations attended the Telangana State Formation Day Celebrations.

సమగ్ర అభివృద్ధికి రోల్ మోడల్ తెలంగాణ

• అంబేద్కర్ వర్షిటీలో తెలంగాణ అభివృద్ధిపై సామూహిక చర్చ
• దక్షినాది రాష్ట్రాల ఆదాయం ఉత్తరాది రాష్ట్రాలకు : ప్రొ : ఘంటా చక్రపాణి
• చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సుసాధ్యం : సెస్ డైరెక్టర్ ప్రొ. రేవతి
• కొత్త జిల్లా ఏర్పాటుతో ప్రజలకు చేరువగా పాలన : ప్రొ. చెన్న బసవయ్య
• ప్రత్యేక రాష్ట్రంలో అదనంగా 15 శాతం సాగు భూమి : ప్రొ. రమణ మూర్తి

హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా cలో నిర్వహించిన “తెలంగాణ ఎదుగుదల కథ – సామూహిక చర్చ’’ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సీతారామారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాలు క్రితమే ఏర్పడ్డ తెలంగాణ రాష్త్రం అభివృద్ధిలో దేశంలో ముందు వరుసలో ఉందని, జాతీయ స్థాయిలో 90 శాతానికి పైగా అభివృద్ధి అవార్డులు తెలంగాణకే వస్తున్నాయన్నారు.

కోవిడ్ మహమ్మారితో, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలు ఇబ్బందిగా మారినా తెలంగాణ అభివృద్ధికి అవి పెద్దగా ఆటంకంగా మారలేదని దీనికి పాలకుల చిత్తశుద్దే కారణమని ప్రొ. సీతారామారావు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ దూరదృష్టి, వనరుల లభ్యతపై అవగాహన, ఆర్ధిక క్రమ శిక్షణ, పేదలకు సంక్షేమం పథకాలు అందించడం వంటివి తెలంగాణాను దేశంలో అగ్ర స్థానంలో నిలపాయన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చక్రపాణి మాట్లాడుతూ అబివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పాలకులు సమాజాబివృద్ధికి పాటు పడ్డప్పుడే సమగ్ర అబివృద్ధి సాధ్యమవుతోందన్నారు. దక్షణాది రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తిరిగి వచ్చేది కేవలం 49 శాతం మాత్రమేనని ఇక్కడి ఆదాయాన్ని ఏ మాత్రం ఆర్ధిక క్రమశిక్షణ, కుటుంబ నియంత్రణ పాటించని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరగితే చట్ట సభల్లో దక్షణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పడి పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ప్యానెల్ సభ్యులుగా పాల్గొన్న సెస్ డైరెక్టర్ ప్రొ. రేవతి మాట్లాడుతూ పెద్ద రాష్ట్రాల్లో జరగని అభివృద్ధి చిన్న రాష్ట్రాలతోనే సాధ్యం అనే వాదనను తెలంగాణ రాష్ట్రం సుసాధ్యం చేసిందన్నారు. అందరికి విద్యను అందించాలి, ఆరోగ్యాన్ని పేదలకు మరింత అందుబాటులోకి తేవాలని, ప్రభంత్వ సంక్షమే ఫలాలు అందరికి సమానంగా అందించేలా పాలకుల చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా, తలసరి అదాయం పెంచేలా చేస్తే రాష్ట్ర అబివృద్ధికి దోహదపడతారని ఇదే తెలంగాణాలో సాధ్యపడుతుందన్నారు.

ఆయ రాష్ట్రాల్లో అమలయ్యే సంక్షేమ కార్యక్రమాల అమలుకు అయ్యే ఖర్చులో 60 శాతం కేటాయింపులు రాష్ట్రాలే భరిస్తున్నాయన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లు గ్రామీణ అబివృద్ధికి విరివిగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. రైతుబంధు, రైతు భీమా లాంటివి రైతన్నలకు భరోసా కలిగించాయని వెల్లడించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం పెట్టుబడుదారులను ఆకట్టుకుంది. మౌలిక వసతుల కల్పన తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేసిందని ప్రొ. రేవతి వివరించారు.

మరో ప్యానెల్ సభ్యులు ప్రొ. చెన్న బసవయ్య మాట్లాడుతూ అబివృద్ధిలో విధాన పరమైన నిర్ణాయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. పాలన అనేది ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలని, అంటే పాలనలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. పెద్ద జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు అనేది పాలనను వికేంద్రీకరణ చేయడానికి, పాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లడానికి దోహద పడిందని వివరించారు. రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, తండాలను, గూడాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయడం, కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఏర్పాటు, అనేది ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసిందన్నారు.

అధికారులకు పని భారం తగ్గి, నాణ్యమైన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. జిల్లాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్ల ఏర్పాటు జరుగుతున్నా సిబ్బంది సంఖ్య అంతగా పెంచలేదని దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. అధికార బదిలీ, నిర్ణయాధికారం కింద స్థాయికి బదలాయింపు జరగలేదన్నారు. తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రాల్లో లేవని. పెద్ద మొత్తంలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నిధుల జమ ప్రపంచంలో మరెక్కడా లేదని వివరించారు. ధరణిని ఇంకా అబివృద్ధి చేయాలని, అందులోని సమస్యలను అధిగమించాలన్నారు. ధరణిని రద్దు చేయడం సమంజసం కాదన్నారు. రైతు బంధు, రైతు భీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి అవినీతి లేకుండా ముందుకెల్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఐ – పాస్, పారిశ్రామిక అభివృద్ధి వంటి విప్లవాత్మక సంస్కరణలు తెలంగాణ ఆర్ధిక అభివృద్ధికి సహాయకారిగా నిలిచాయన్నారు.

కార్యక్రమంలో మరో ప్యానెల్ సభ్యులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొ. ఆర్. వి. రమణ మూర్తి మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయ రంగంలో వినూత్న పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్ట్ ల నిర్మాణం వంటివి సరికొత్త తెలంగాణాను ఆవిష్కరించాయన్నారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగు భూమి 15 శాతం పెరిగిందని ఇటీవల కాలంలో ఇది ఏ రాష్ట్రంలో సాధ్య పడలేదన్నారు. రాష్ట్రంలో పండే పంట రాష్ట్ర అవసరాల కంటే ఎక్కువగా పండుతోందని, మిగిలిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సరిగా సహకరించడం లేదన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడిందని ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. రానున్న రోజుల్లో ధాన్యం దిగుబడి మరింత పెరగొచ్చు ఇలాంటి సమయంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వంటివి పరిష్కారం అని పేర్కొన్నారు. ఇలాంటి పరిశ్రమల ఏర్పాటును కొందరు వ్యతిరేకాస్తున్నారని, పారిశ్రామికీకరణ మన అవసరాలకు తగ్గట్లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశ ప్రజల అవసరాలను గమనించి చైనా విరివిరిగా మార్కెట్ చేసుకుంటూ ఆర్ధికంగా బలపడుతోంధన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్ధిక సహకారం అందించాలని, కానీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో ఇప్పటికే తెచ్చిన అప్పు రాష్ట్రానికి ఇబ్బందిగా మారొచ్చని, అదృష్టం కొద్దీ తెలంగాణలో ముఖ్యమంత్రి కీసీఅర్ తక్కవ వడ్డీ కే అప్పు తెచ్చారని వివరించారు. ఇప్పటికే దక్షణాది రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఉత్తరాది – ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నారని, తద్వారా దక్షణాది రాష్ట్రాలు అబివృద్ధికి, సక్షేమానికి రుణాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందన్నారు.

అంతకు ముందు వేదికపై పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండేలా జాగ్రఫీ పుస్తకాన్ని సభలో ఆవిష్కరించారు. దీని ధర రూ. 250 గా నిర్ణయించారు. కాగా ఇప్పటికే విశ్వవిద్యాలయం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం నాలుగు పుస్తకాలు అందుబాటులోకి తీసుకురాగా వాటిని గౌరవ రాష్ట్ర మంత్రి కే.టి.ఆర్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం అయిదు పుస్తకాల సెట్ అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది.

కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు డా. బానోత్ లాల్, సికా డైరెక్టర్ ప్రొ. పీ. మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ ప్రొ. గుంటి రవి, డీన్ లు ప్రొ షకీలా ఖానం, ప్రొ. వడ్డానం శ్రీనివాస్, పరీక్షల నియంత్రన అధికారి డా. పరాంకుశం వెంకటరమణ, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ డా.ఎల్వీకే రెడ్డి, విశ్వవిద్యాలయ అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X