Hyderabad: Dr B R Ambedkar Open University today observed “Anti Corruption Integrity Pledge” as a part of “Vigilance Awareness week” from October 27 to November 2, 2025 at its campus on Friday.

The university employees taken a oath on “Anti Corruption Integrity Pledge”. Prof. Ghanta Chakrapani, Vice-Chancellor; Dr. L. Vijay Krishna Reddy, Registrar; All Directors, Deans, Teaching and Non-Teaching Staff Members and representatives of various Service Associations office bearers were present.
Also Read-
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వరత్రిక విశ్వవిద్యాలయంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ
విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వరత్రిక విశ్వవిద్యాలయంలో “విజిలెన్స్ అవగాహన” వారోత్సవాలు కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు అక్టోబర్ 27 నుండి నవంబర్ 2, 2025 నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా అవినీతి కి వ్యతిరేకంగాపై శుక్రవారం క్యాంపస్ లో ఉద్యోగులంతా ప్రతిజ్ఞ చేశారు. తమ కార్యాలయంలో లంచానికి, అవినీతికి తావు లేదని, తాము లంచం తీసుకోమని, ఇతరులకు లంచం ఇవ్వమని ప్రతిజ్ఞ చేశారు.
ఇటు కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు అటు ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా పని చేయాల్సిన అవసరం ఉందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. అనంతరం యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ్ కృష్ణారెడ్డి, ఉద్యోగులతో అవినీతికి వ్యతిరేకంగా, కార్యాలయంలో తమ విధులను పారదర్శకతతో నిబద్ధతగా నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన మరియు బోధనేతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
