Telangana JAC and Telangana Universities Non-Teaching Employees Association
Hyderabad: Dr. B. R. Ambedkar Open University employees observed “Pension Rebellion Day” as called by the Telangana Joint Action Committee on Monday. Dr. B. R. Ambedkar Open University employees, teachers and Non Teachers, Association members participated in a protest during the lunch hour demonstration in front of the administration building wearing black badges. Employees are demanded that the state government immediate to implement the old pension policy as given the promise before the elections and mentioned in the elections manifesto too.

Prof. Pallavi Kabde; Prof. P. Venkataramana; Dr. K. Krishna Reddy; Prof. Chandrakala; K. Prem Kumar, Dr. Yakesh Daida; Dr. Narayana Rao and others explained their views and doubts. Joint Action Committee Members Vishwanath; Miyajani; Pandu; Ashok various association and university employees were participated in the protest.
Also Read-
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అంబేద్కర్ వర్షీటీలో ఉద్యోగుల నిరసన
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సీపీఎస్ ను రద్దు చేయాలి
ఒపీఎస్ అమలు చేయాలంటూ ఉద్యోగుల జేఏసీ ఆందోళన
హైదరాబాద్: “పెన్షన్ విద్రోహ దినం” ను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉద్యోగులు పాటించారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు సోమవారం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల సభ్యలు మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 5 డీఏ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రొ. పల్లవీ కాబ్డే; డా.యకేష్ దైదా; ప్రొ.పి.వెంకటరమణ, డా. నారాయణ రావు తదితరులు మాట్లాడారు. ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు కె. ప్రేమ్ కుమార్; అంబేద్కర్ విశ్వవిద్యాలయ అన్ని గుర్తింపు పొందిన సంఘాల సభ్యులు; అధ్యాపకేతర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్; మియజాని; పాండు; అశోక్ తదితరులు పాల్గొన్నారు.
