Hyderabad : ఆంధ్రప్రదేశలోని గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో సోమవారం రాత్రి ఎంబీబీఎస్ విద్యార్థిని హత్యకు గురైంది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఈ ఘటన చోటు చేసుకున్నది. సర్జికల్ బ్లేడ్‌తో ప్రేమోన్మాది విద్యార్థిని మెడపై కోసి హత్య చేశాడు. నిందితుడిని విజయవాడకు చెందిన ఐటీ ఉద్యోగి జ్ఞానేశ్వర్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతి కేకలు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాడి చేశాక జ్ఞానేశ్వర్ సైతం చేయి కేసుకోగా.. అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే.. నిందితుడు జ్ఞానేశ్వర్, మృతురాలికి రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. పుట్టిన కొన్నిరోజులకే తపస్విని వృత్తిరిత్యా తల్లిదండ్రులు తన తాత-నానమ్మల దగ్గర వదిలేశారు వెళ్లారు. అలా పెరిగి ఐదో తరగతి దాకా కృష్ణాపురంలోనే చదువుకుంది తపస్వి. అనంతరం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇక్కడే ఇంటర్మీడియెట్ దాకా చదువుకుంది ఆమె. నాలుగేళ్ల కిందట సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన ఆమె తల్లిదండ్రులకు ముంబైకి బదిలీ అయ్యింది. దీంతో.. బీడీఎస్ చదివేందుకు విజయవాడ వచ్చి హాస్టల్‌లో ఉంటోంది తపస్వి.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన జ్ఞానేశ్వర్.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తపస్వితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ, పెళ్లి అంటూ వేధింపులు మొదలుపెట్టాడు. సోమవారం సాయంత్రం ఇంట్లోకి ప్రవేశించి.. సర్జికల్ బ్లేడ్‌తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె స్నేహితురాలి అరిచి.. సాయం కోసం పరిగెత్తగా తలుపులు వేసి మరీ తపస్విని ఘోరంగా చంపాడు. ఇక తపస్వి ఘోర హత్యోదంతాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తపస్వి చాలా ధైర్యవంతురాలని.. తనకు ఎలాంటి సమస్యలు ఉన్నట్లు తమకేం చెప్పలేదని బంధువులు అంటున్నారు. ప్రేమ-వేధింపులు, తక్కెళ్లపాడులో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన విషయం కూడా తమకేమీ తెలియదని చెప్పారు.
ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు విద్యార్థిని స్నేహితురాలు తన వద్దకు పిలిచింది. దీంతో వారం రోజులుగా మృతురాలు స్నేహితురాలి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలోనే మృతురాలి స్నేహితురాలు జ్ఞానేశ్వర్, మృతురాలి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సోమవారం పిలిచింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడ్‌తో యువతి మెడపై దాడి చేసి మరో గదిలోకి ఈడ్చుకు వెళ్లి తలుపులు బిగించాడు. యువతితో పాటు ఆమె స్నేహితురాలు కేకలు వేయడంతో స్థానికులు గది తలుపులు పగులగొట్టి యువతి ఆసుప్రతికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే.. ఇలాంటివి ఇంకెక్కడా జరగకుండా చూడాలని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తపస్వి బంధువులు ఆవేదనగా కోరుతున్నారు. ఈ ఉదంతంతో కృష్ణా జిల్లా పామిడిముక్కల మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.(Agencies)