तेलंगाना में बढ़े बीयर के दाम, जानें नई कीमतें, पीने वाले परेशान, ఏ బీరు ఎంత పెరిగిందో తెలుసా?

हैदराबाद: तेलंगाना सरकार बीयर प्रेमियों के लिए बुरी खबर लेकर आई है। सोमवार को घोषणा की गई कि पूरे राज्य में बीयर की कीमतें बढ़ाई जाएंगी। बढ़ी हुई कीमतें मंगलवार से लागू हो गई है। स्पष्ट किया गया है कि हर बीयर पर 15 प्रतिशत की वृद्धि की गई है। इस खबर से बीयर प्रेमी स्तब्ध रह गए। गर्मियों, शादी के मौसम और आईपीएल से ठीक पहले बीयर की कीमतों में बढ़ोतरी के कारण बीयर प्रेमी अत्यधिक बेचैनी व्यक्त कर रहे हैं।

तेलंगाना में बीयर की कीमतें बढ़ाने के राज्य सरकार के हालिया फैसले से राजकोष में भारी मात्रा में राजस्व उत्पन्न होगा। तेलंगाना आबकारी विभाग के अधिकारियों का अनुमान है कि बीयर की कीमत में 15 प्रतिशत की बढ़ोतरी से प्रति माह 300 करोड़ रुपये से अधिक का अतिरिक्त राजस्व प्राप्त होगा।

बीयर की नई कीमतें इस प्रकार हैं

केएफ लाइट बीयर की कीमत पहले 150 रुपये थी, लेकिन नवीनतम वृद्धि के साथ यह 172.5 रुपये हो गई है।
केएफ स्ट्रांग बीयर की कीमत पहले 160 रुपये थी जो अब बढ़कर 184 रुपये हो गई है।
केएफ अल्ट्रा मैक्स बीयर की कीमत अब 220 रुपये से बढ़कर 253 रुपये हो गई है।
बडवाइजर लाइट बीयर की कीमत 210 रुपये से बढ़कर 241.5 रुपये हो गई है।
बडवाइजर मैग्नम बीयर की कीमत 220 रुपये से बढ़कर 253 रुपये हो गई है।
टुबॉर्ग स्ट्रांग बीयर की कीमत 240 रुपये से बढ़कर 276 रुपये हो गई है।

मालूम हो कि शराब कंपनियां पिछले कुछ समय से सरकार से तेलंगाना में शराब की कीमतें बढ़ाने की मांग कर रहे थे। तेलंगाना के शराब बाजार में लगभग 60 प्रतिशत की हिस्सेदारी रखने वाली एक बहुराष्ट्रीय बीयर कंपनी ने सरकार से वर्तमान में भुगतान की जा रही मूल कीमत में कम से कम 30.1 प्रतिशत की वृद्धि करने को सुझाव दिया।

दूसरी ओर, बीयर की कीमतों में बढ़ोतरी पर सेवानिवृत्त न्यायाधीश जायसवाल की अध्यक्षता वाली तीन सदस्यीय समिति ने भी 15 प्रतिशत से 19 प्रतिशत की वृद्धि करने का रिपोर्ट सौंपा। इसके साथ ही रेवंत रेड्डी सरकार बीयर की मूल कीमतों में 15 प्रतिशत की वृद्धि करने पर सहमत हो गई है। अनुमान है कि इस वृद्धि से सरकार को प्रति माह 300 करोड़ रुपये तक का अतिरिक्त राजस्व प्राप्त होगा।

Also Read-

ఏ బీరు ఎంత పెరిగిందో తెలుసా?

హైదరాబాద్ : బీరు ప్రియులకు తెలంగాణ సర్కార్ చేదువార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా బీరు ధరలు పెంచుతున్నట్లు సోమవారం(ఫిబ్రవరి 10) రోజున ప్రకటించింది. పెంచిన ధరలు మంగళవారం(ఫిబ్రవరి 11) నుంచి అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. ఒక్కో బీరుపై 15 శాతం ధరలు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ వార్తతో బీర్ లవర్స్‌కు కిక్కు దిగిపోయింది. సరిగ్గా వేసవికి ముందు, పెళ్లిళ్ల సీజన్ పైగా ఐపీఎల్ రానున్న వేళ బీర్ల ధరలు పెరగడంతో బీరు ప్రియులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తాజాగా తెలంగాణలో బీర్ల ధరల పెంచూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు భారీగా ఆదాయం రానున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బీర్లపై 15 శాతం ధరలు పెంచడంతో నెలకు రూ.300 కోట్లకుపైగా అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

బీర్ల కొత్త ధరల వివరాలు

కేఎఫ్ లైట్ బీరు గతంలో రూ.150 ఉండగా తాజా పెంపుతో అది రూ.172.5కి పెరిగింది.
కేఎఫ్ స్ట్రాంగ్ బీరు గతంలో రూ.160 ఉండగా ఇప్పుడు రూ.184కి పెరిగింది.
కేఎఫ్ అల్ట్రా మ్యాక్స్ బీరు ఇప్పటివరకు రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.253కి పెరిగింది.
బడ్వైజర్ లైట్ బీరు రూ.210 ఉండగా రూ.241.5 కి పెరిగింది.
బడ్వైజర్ మ్యాగ్నం బీరు రూ.220 నుంచి రూ.253కి పెరిగింది.
టూబర్గ్ స్ట్రాంగ్ బీరు రూ.240 నుంచి రూ.276కి పెరిగింది.

తెలంగాణలో మద్యం ధరలను పెంచాలని గత కొంతకాలంగా లిక్కర్ కంపెనీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని మద్యం మార్కెట్‌‌లో దాదాపు 60 శాతం వాటా కలిగి ఉన్న మల్టీనేషనల్‌‌ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్‌‌ ధర మీద కనీసం 30.1 శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది.

మరోవైపు బీర్ల ధరల పెంపుపై రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా 15 శాతం నుంచి 19 శాతం పెంచాలని నివేదిక ఇచ్చింది. దీంతో బీర్‌‌ బేసిక్‌‌ ధరలు 15 శాతం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇక ఈ పెంపుతో ప్రతినెలా రూ.300 కోట్ల వరకు ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X