కర్నూలు: కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మరియు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నిర్వహించిన నేషనల్ కన్స్యూమర్స్ డే వారోత్సవాలలో భాగంగా సోమవారం స్థానిక కె. వి. ఆర్ ప్రభుత్వం మహిళా కళాశాలలో కామర్స్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన అవగాహనా సదస్సుకు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి దేవికారాణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుడికి నష్టం జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి మరియు వినియోగదారుడు హక్కులు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ నజీమా కౌసర్ మెంబర్ డిస్టిక్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ అండ్ డ్రెస్సెల్ కమిషన్ కర్నూల్ మాట్లాడుతూ మార్కెట్లో మరియు ఆన్లైన్లో క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ వినియోగదారులను డిస్కౌంట్ అనే పేరుతో ఏ విధంగా ఆకట్టుకుంటున్నాయో మరియు ఎలా మోసం చేస్తున్నాయో వివరించారు. మార్కెట్లో ఏదైనా వస్తువును కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్ తీసుకోవాలని వినియోగదారుని హక్కులకు భద్రత కల్పించడంలో ఈ బిల్ చాలా ముఖ్యమైనదని తెలియజేశారు.
ఎం నారాయణరెడ్డి ( మెంబర్, కన్స్యూమర్ కమిషన్ ) మాట్లాడుతూ వినియోగదారుని హక్కుల చట్టం అక్టోబర్ 1986లో అసెంబ్లీలో ఆమోదించబడింది మరియు 24 డిసెంబర్ 1986 నుండి అమల్లోకి వచ్చింది మరియు 2019లో సరళీకరించబడి సామాన్య ప్రజలకు మరింత చేరువైందని తెలియజేశారు. ఈ చెట్టును ద్వారా మార్కెట్లో అమ్మకం- కొనుగోలు జరిగి వస్తువుల నాణ్యత ధరలు మరియు వస్తువు కొనుగోలుతో పాటు వినియోగదారుడు పొందే హక్కులు, వీటికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే కన్స్యూమర్ ఫోరం ద్వారా 90 రోజుల్లో సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు అని తెలియజేశారు, అంతేకాకుండా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని మరియు డిజిటల్ హియరింగ్ ద్వారా ఆన్లైన్లో వీడియో కాల్ రూపంలో సొంతంగా మరియు సులభంగా తమ కామే ఫిర్యాదు నమోదు చేసి పరిష్కారాన్ని పొందవచ్చు అని తెలియజేశారు.
ఏ శివ మోహన్ రెడ్డి ( నెంబర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్) మాట్లాడుతూ వినియోగదారుని హక్కులపై అవగాహన కల్పిస్తూ డిసెంబర్ 18 నుండి 24వ తేదీ వరకు కర్నూలు జిల్లాలోని వివిధ కళాశాలల నుండి ర్యాలీలు, ఎస్సే రైటింగ్ మరియు వకృత్వ పోటీలు నిర్వహించారని. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు డిసెంబర్ 24వ తేదీన సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ఇవ్వబోతున్నారని తెలియజేశారు. పరమేష్ కుమార్, ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రోలజీ డిపార్ట్మెంట్, మాట్లాడుతూ వివిధ రకాల కొలతలు, తూనికలు లో జరిగే మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Also Read-
పర్వీన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు జనరిక్ మెడిసిన్, బ్రాండెడ్ మెడిసిన్ మరియు నార్కోటిక్స్ సంబంధిత మెడిసిన్స్ ని ఎలా గుర్తించాలి. డాక్టర్ ప్రెస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి మెడిసిన్స్ కూడా కొనకూడదని. నార్కోటిక్స్ సంబంధిత మెడిసిన్స్ ను తప్పకుండా డాక్టర్ సూచనల మేరకే వాడాలని, తీవ్రమైన ఒత్తిడి భారీ నొప్పి కీమో మరియు క్యాన్సర్ మందులను ఎలా గుర్తించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు అలాగే విద్యార్థులు తమ కుటుంబీకులకు ఇచ్చే మందులపై సరైన అవగాహన పెంచుకోవాలని అవగాహన లేకుండా mbbs డాక్టర్ ను సంప్రదించకుండా ఎటువంటి మందులను కూడా అసలు వాడకూడదని తెలియజేశారు.
కామర్స్ విభాగ ఇన్చార్జ్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కెవిఆర్ కళాశాలలో నిర్వహించడం వల్ల వల్ల విద్యార్థులకు వినియోగదారుని హక్కుల పట్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ లభించిందని జిల్లా అధికారులకు మరియు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా ఇర్ఫానా బేగం, డా శేషగిరి, కుమారి కీర్తి కుమారి, కుమారి నికిత, కుమారి సుస్మిత మరియు మణికంఠ, కళాశాల అధ్యాపక బృందం, లీగల్ మెట్రాలజీ విభాగం బృందం, మరియు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.