హైదరాబాద్ : ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలను ప్రజలు గమనిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా బెంజ్ సర్కిల్‌ను బ్లాక్ చేసేవారు. ఇప్పడు చంద్రబాబు నాయడు, పవన్ కల్యాణ రోడ్‌షోలు చేస్తూనే ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు.
“భారత్ రాష్ట్ర సమితికు మద్దతు ఇవ్వాలని అడిగితే ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తాం. దీనిపై అందరితో చర్చించి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కర్ణాటక, తమిళనాడులో పోటీ చేసే ఉద్దేశం మాకు లేదు. ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధి తప్ప సీఎం జగన్‌కు వేరే ఆలోచన లేదు” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
“భూ సర్వేతో రెవెన్యూ శాఖలో ముఖ్యమంత్రి జగన్ సంస్కరణలు చేస్తున్నారు. భూముల రీసర్వేపై ప్రతిపక్షాలు విమర్శలు సరికావు. చంద్రబాబు సైకో అని ప్రజలు భావిస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. సమైక్యం కోసం నిలబడ్డ ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస పార్టీ. 8 ఏళ్లైన విభజనపై విచారణ జరుగుతూనే ఉంది. నా వ్యాఖ్యలను రాజకీయం చేయాల్సిన అవసరం లేదు” అని సజ్జల అన్నారు. (Agencies)