हैदराबाद : आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू ज़िले के चिंतूर मंडल में तुलसीपाकालू घाट रोड पर शुक्रवार सुबह बस एक्सीडेंट हुआ। इस दुर्घटना में 10 लोगों की मौत हो गई और 20 लोग गंभीर रूप से घायल हो गए।
अधिकारियों ने दुर्घटना में मृतकों की जानकारी दी है। अधिकारियों के अनुसार मृतकों में- श्रीकला, सुनंदा, शिवशंकर रेड्डी, उमा रेड्डी, कृष्णा कुमारी, राघारा मधु, पोंगुला प्रसाद, और दो और शवों की पहचान होना बाकी है।
दूसरी ओर, प्रधानमंत्री नरेंद्र मोदी ने अल्लूरी ज़िले में हुए बस दुर्घटना पर दुख जताया। उन्होंने कहा कि इस बस दुर्घटना में लोगों की मौत होना दर्दनाक है। उन्होंने इस मुश्किल समय में पीड़ितों और उनके परिवारों के प्रति गहरी सहानुभूति जताई। उन्होंने कहा कि वह घायलों के जल्दी ठीक होने की प्रार्थना करते हैं।
साथ ही पीएम ने दुर्घटना में मरने वालों के परिवारों के लिए 2 लाख रुपये और घायलों के लिए 50 हजार रुपये की मदद दी जा रही है। उन्होंने बताया कि उन्हें यह जानकर दुख हुआ कि इस हादसे में 10 लोगों की मौत हो गई है। उन्होंने कहा कि यह दुर्भाग्यपूर्ण है कि यह हादसा हुआ। प्रधानमंत्री मोदी ने आंध्र प्रदेश सरकार से इस घटना में घायल हुए लोगों को बेहतर इलाज देने के लिए कदम उठाने का सुझाव दिया है।
Also Read-
మృతుల వివరాలు వెల్లడించిన అధికారులు, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో శుక్రవారం తెల్లవారు జామున బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలను అధికారులు వెల్లడించారు. మృతుల వివరాలు- శ్రీ కళా, సునందా, శివశంకర్ రెడ్డి, ఉమారెడ్డి, కృష్ణ కుమారి, రఘరా మధు, పొంగుల ప్రసాద్, ఇంకా 2 మృతదేహాలు గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు
మరోవైపు అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఇస్తున్నామని తెలిపారు. ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నానని వివరించారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ప్రధాని మోదీ.
ఇదే క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బస్సు లోయలోపడి ప్రయాణికులు దుర్మరణం చెందడం బాధాకరమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నానని తెలిపారు పవన్ కల్యాణ్.
అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సు లోయలో పడి పలువురు యాత్రికులు మృతిచెందడం చాలా బాధాకరమని తెలిపారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన వారి ఆత్మ శాంతించాలని భగవంతుడును ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు కిషన్‌రెడ్డి.
యాత్రికులతో కూడిన బస్సు చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా తెలుసుకున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మారేడుమిల్లి బస్సు ప్రమాద ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు హోం మంత్రి. ప్రైవేటు బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు హోం మంత్రి అనిత.
అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రైవేటు బస్సు లోయలో పడి యాత్రికులు మృతిచెందిన వార్త తన మనసును తీవ్రంగా కలిచి వేసిందని తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు డోలా బాల వీరాంజనేయస్వామి. (ఏజెన్సీలు)
