आ गए AP दसवीं के रिजल्ट, ऐसे चेक कर सकते हैं नतीजे

हैदराबाद: आंध्र प्रदेश 10वीं कक्षा के नतीजे जारी हो गए हैं। परिणाम विजयवाड़ा में शिक्षा मंत्री बोत्सा सत्यनारायण द्वारा जारी किए गए। इन परीक्षाओं में कुल 6,05,052 छात्र शामिल हुए थे। 2,95,807 लड़कियां और 3,09,245 लड़के परीक्षा में शामिल हुए। परीक्षाएं 3 अप्रैल से 18 अप्रैल तक हुई थीं। और ये रिजल्ट ऑफिशियल वेबसाइट www.results.bse.ap.gov.in पर उपलब्ध करा दिए गए हैं। शिक्षा विभाग ने रिकॉर्ड समय में 18 दिन के अंदर दस नतीजे जारी कर दिए हैं

कुल 72.26 फीसदी पास हुए। इस बार भी रिजल्ट में लड़कियों का पलड़ा भारी रहा। 6.11 फीसदी लड़कियां लड़कों से ज्यादा पास हुई हैं। पार्वतीपुरम जिले ने पहला स्थान और नंद्याला जिले ने अंतिम स्थान हासिल किया। मंत्री बोत्सा ने कहा कि दो जून से 10वीं की पूरक परीक्षाएं होंगी। साथ ही, पुनर्मतगणना और पुनर्सत्यापन की समय सीमा इस महीने की 13 तारीख तक होगी। मंत्री ने खुलासा किया कि पूरे राज्य में 933 स्कूलों ने 100 प्रतिशत पास दर्ज किया है। शिक्षा विभाग ने इस मौके पर विद्यार्थियों को सुझाव दिया कि कोई भी गलत कदम न उठाये।

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చూసుకోవచ్చు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 6,05,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది పరీక్ష రాశారు. ఏప్రిల్ 3 నుంచీ 18 వరకు పరీక్షలు జరిగాయి. ఇక ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచారు. రికార్డు సమయంలో 18 రోజుల్లోనే పది ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది.

మొత్తం 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలురు కంటే అధికంగా 6.11 శాతం బాలికలు పాస్ అయ్యారు. మొదటి స్థానంలో పార్వతీపురం జిల్లా.. చివరి స్థానంలో నంద్యాల జిల్లా నిలిచింది. ఇక జూన్‌ 2 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి బొత్స తెలిపారు. అలాగే రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఈనెల 13వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 933 పాఠశాలల్లో మాత్రం వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి వెల్లడించారు. ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడొద్దని విద్యాశాఖ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X