दुनिया का सबसे ताकतवर परमाणु बम बनाने को अमेरिका तैयार, जानिए उसकी शक्ति

हैदराबाद: अमेरिका साम्राज्यवाद देश एक बार फिर से ‘तबाही की तैयारी’ कर रहा है। दुनिया का सबसे ताकतवर देश अमेरिका एक नया परमाणु बम बनाने जा रहा है। यह जापान के हिरोशिमा पर गिराए गए बम से भी 24 गुना ज्यादा शक्तिशाली होगा। अमेरिकी रक्षा विभाग से मिली जानकारी के अनुसार, नए परमाणु बम को बनाने के लिए पेंटागन ने मंजूरी और फंडिंग का काम शुरू कर दिया है। यह नया परमाणु बम बी61 न्यूक्लियर ग्रैविटी बम का आधुनिक संस्करण होगा। इस नये परमाणु बम को बी61-13 नाम दिया गया है।

इस नये परमाणु बम को बनाने को लेकर अमेरिकी अंतरिक्ष रक्षा नीति के उपसचिव जॉन प्लम्ब ने कहा- “बदलते सुरक्षा माहौल और विरोधियों के बढ़ते खतरे को देखते हुए घोषणा की गई है। अमेरिका के पास जिम्मेदारी है कि हम हालात की समीक्षा करते रहें और संभावित खतरे को रोकें। वहीं अगर जरूरत पड़े तो जवाबी कार्रवाई में हमला कर अपने सहयोगियों को आश्वस्त करें।”

नय् परमाणु बम का वजन 360 किलो टन होगा, जो द्वितीय विश्व युद्ध के दौरान जापान के हिरोशिमा पर गिराए गए परमाणु बम से 24 गुना ज्यादा शक्तिशाली होगा। आपको बता दें कि अमेरिका ने जापान के हिरोशिमा में जो बम गिराया था, उसका वजन 15 किलो टन था। वहीं जापान के नागासाकी में गिराए गए बम से नया बम 14 गुना बड़ा होगा। क्योंकि नागासाकी पर गिराया गया बम 25 किलो टन का था। कहा जा रहा है कि नए बम में आधुनिक सुरक्षा, सटीकता भी पहले से बेहतर होगी।

गौरतलब है कि अमेरिका ने नए परमाणु बम को बनाने की घोषणा ऐसे वक्त में की है जब हाल ही में अमेरिका ने नेवादा की न्यूक्लियर साइट पर एक बड़े बम विस्फोट का परीक्षण किया। इसके साथ ही रूस भी 1966 की उस संधि से बाहर आ गया है, जिसके तहत दुनियाभर में परमाणु बम के परीक्षण पर प्रतिबंध लगा दिया गया था। ऐसा माना जा रहा है कि अमेरिका का यह नया बम पुराने बी61-7 बम की जगह लेगा। इस वजह से अमेरिका के परमाणु हथियारों की संख्या में कोई इजाफा नहीं होगा। इससे स्पष्ट होता है कि अमेरिका का परमाणु जखीरा पहले से ज्यादा घातक हो जाएगा। (एजेंसियां)

అమెరికా భారీ అణుబాంబు తయారీకి సిద్ధం, ఎంత పెద్దది అంటే...

హైదరాబాద్: అమెరికా భారీ న్యూక్లియర్ బాంబ్‌ను తయారు చేయనున్నట్లు అమెరికా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను కూడా పెంటగాన్ పేర్కొంది. ఆ బాంబు అత్యంత శక్తివంతమైందని రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమాపై ప్రయోగించిన అణు బాంబు కంటే 24 రెట్లు అధిక విస్ఫోటనం కలిగి ఉంటుందని పెంటగాన్ తెలిపింది.

అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ బీ 61 రకం కొత్త వేరియంట్‌ న్యూక్లియర్‌ గ్రావిటీ బాంబును తయారు చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. బీ 61-13 పేరుతో ఈ అణు బాంబును రూపొందిస్తున్నట్లు పేర్కొంది. నేషనల్‌ న్యూక్లియర్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ సహకారంతో ఈ అణు బాంబును తయారు చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ బీ 61-13 అణు బాంబును తయారు చేయాలనే నిర్ణయం ఏదో అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని వివరించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ అణు బాంబును తయారు చేయడం అవసరమని గుర్తు చేసింది. అయితే ఈ అణు బాంబు తయారీకి సంబంధించిన అనుమతులు, కేటాయింపులు వంటివి అమెరికా చట్టసభ ముందు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

పెంటగాన్ ప్రపంచంలో మరింత శక్తివంతంగా, సురక్షితంగా అమెరికా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ అణు బాంబు సిద్ధమై తమ దేశ ఆయుధ శక్తిలో ఉంటే ప్రపంచంలోని ఏ దేశమైనా సవాలు చేయాలనుకునే వారికి కష్టం అవుతుందని పేర్కొంది. ఒకవైపు ప్రపంచంలో పెరుగుతున్న రష్యా దూకుడు మరోవైపు 2030 నాటికి వెయ్యికిపైగా అణ్వాయుధాలను చైనా సిద్ధం చేసుకుంటోందనే వార్తలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ భారీ అణు బాంబును తయారు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించడం సంచలనంగా మారింది.

1945 ఆగస్టులో జపాన్‌లోని హిరోషిమాపై రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబును ప్రయోగించింది. ఆ అణు బాంబు సుమారు 15 కిలో టన్నుల శక్తిని విడుదల చేసింది. ఇక నాగసాకిపై పడిన బాంబు సామర్థ్యం 25 కిలో టన్నులు. కానీ ప్రస్తుతం అమెరికా తయారు చేస్తామని ప్రకటించిన బీ 61-13 అణు బాంబు ఏకంగా 360 కిలో టన్నుల శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే హిరోషిమాపై ప్రయోగించిన దానికంటే 24 రెట్లు అధికమని నిపుణులు చెబుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X