हैदराबाद : आत्महत्या के प्रयास में हुई मौत हो चुकी वरंगल केएमसी की मेडिकल छात्रा प्रीति के शव को पोस्टमॉर्टम के बाद एंबुलेंस में हैदराबाद से सीधे जनगांव जिले के गिरनीतांडा ले जाया गया। इससे गांव में मातम छा गया। रिश्तेदार, परिजन और दोस्तों के रोने पूरे गांव में मातम छा गया। प्रीति के शव के पास परिजनों के रोने से भावुक माहौल हो गया। प्रीति को श्रद्धांजलि देने के लिए ग्रामीणों का तांता लगा हुआ है।
इसी क्रम में पुलिस ने प्रीति के पिता को हैदराबाद से उनके गृहनगर ले जाने से पहले बोडुप्पल में उनके घर ले गई। प्रीति के पिता नरेंद्र ने पुलिस से गुहार लगाई कि प्रीति इसी घर में पैदा हुई और पली-बढ़ी है। उसके शव को कुछ देर के लिए यहीं रख दिया जाए तो बेहतर होगा। लेकिन पुलिस ने यह कहते हुए मना कर दिया कि ऊपर से ऐसा कोई आदेश नहीं है और यहां लाने की अनुमति नहीं है। प्रीती के पिता, मां, बहन, भाई व परिवार के अन्य सदस्य बोडुप्पल स्थित घर में गये और कपड़े लेकर सुबह 5 बजे के बाद अपने गृहनगर चले गए।
प्रीति के पिता नरेंद्र ने पुलिस के व्यवहार पर प्रतिक्रिया दी। उन्होंने कहा कि पुलिस प्रीती के शव को जबरदस्ती गिरनीतांडा ले गई और पुलिस ने उसे बोडुप्पल में उसके घर ले जाने के अनुरोध को अनसुना कर दिया। उन्होंने कहा कि उन्हें जबरन उनके गृहनगर ले जाया गया और वे एंबुलेंस के पीछे आ गए। उन्होंने आरोप लगाया कि प्रीती ने आत्महत्या नहीं की है, बल्कि उसकी हत्या की गई है। प्रीति ने क्या लिया इसकी पुष्टि अब तक नहीं हो पाई है। उन्होंने मांग की कि इस तरह की घटनाओं को रोकने के लिए कड़ी कार्रवाई की जानी चाहिए। प्रीति को प्रताड़ित करने वाले सैफ को फांसी दी जानी चाहिए।
संबंधित खबर :
नरेंदर ने यह भी मांग की कि लापरवाही बरतने वाले केएमसी के प्रिंसिपल और एचओडी को निलंबित किया जाना चाहिए और सख्त कार्रवाई की जानी चाहिए। प्रीती शव लेकर आने पर गांव में मातम छा गया। लोग विलाप कर रहे है कि वह डॉक्टर बनकर लोगों की सेवा के लिए आएगी, लेकिन उसका शव ही गां आ गया है। प्रीति के घर दूर-दूर से रिश्तेदार भी पहुंच रहे हैं। परिजन दोपहर में परिजनों व ग्रामीणों की मौजूदगी में प्रीति का अंतिम संस्कार कराने की तैयारी कर रहे हैं।
आज मेडिकल कॉलेज बंद
मेडिकल छात्रा प्रीति की मौत को लेकर छात्र संघों ने केएमसी पर किया विरोध प्रदर्शन। उन्होंने मोमबत्ती जलाकर प्रीति को श्रद्धांजलि दी। उन्होंने मांग की कि प्रीति की आत्महत्या करने वाले वरिष्ठ मेडिकल छात्र सैफ को फांसी दी जाए। छात्र संघों द्वारा सीएम केसीआर का पुतला फूंकने का प्रयास किया गया, लेकिन पुलिस ने इसे रोक दिया। तनावपूर्ण स्थिति के मद्देनजर छात्र संघों के नेताओं को गिरफ्तार कर लिया गया। छात्र संघों ने चेतावनी दी है कि प्रीति की मौत के लिए जिम्मेदार लोगों के खिलाफ कार्रवाई की जाएगी और प्रीति के परिवार को न्याय मिलने तक वे अपना आंदोलन जारी रखेंगे। प्रीति की मौत के विरोध में ओयू जेएसी और एबीवीपी ने आज मेडिकल कॉलेज बंद का आह्वान किया है।
పోస్టుమార్టం అనంతరం మెడికో విద్యార్థిని ప్రీతి మృతదేహం స్వగ్రామమైన గిర్నితండాకు
హైదరాబాద్ : ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందిన వరంగల్ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా స్వగ్రామమైన జనగాం జిల్లాలోని గిర్నీతండాకు అంబులెన్స్‌లో తరలించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రీతి మృతదేహాం వద్ద బంధువుల రోదనలతో భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. ప్రీతికి నివాళులు అర్పించేందుకు గ్రామస్తులు భారీగా తరలివస్తున్నారు.
హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించకముందు ప్రీతి తండ్రిని బొడుప్పల్‌లోని ఇంటికి పోలీసులు తీసుకెళ్లారు. ప్రీతి ఈ ఇంట్లో పుట్టి పెరిగిందని, మృతదేహాన్ని కొద్దిసేపు ఇక్కడ ఉంచితే బాగుంటుందని పోలీసులను ప్రీతి తండ్రి నరేంద్ర వేడుకున్నాడు. కానీ పై నుండి ఆర్డర్స్ లేవని, ఇక్కడికి తీసుకురావడానికి అనుమతి లేదంటూ పోలీసుల నిరాకరించారు. ప్రీతి తండ్రి, తల్లి, సిస్టర్, బ్రదర్,ఇతర కుటుంబసభ్యులు బొడుప్పల్‌లోని ఇంటికి వచ్చి బట్టలు తీసుకుని ఉదయం 5 గంటల తర్వాత స్వగ్రామానికి వెళ్లారు.
పోలీసుల తీరుపై ప్రీతి తండ్రి నరేంద్ర స్పందించాడు. బలవంతంగా పోలీసులు ప్రీతి మృతదేహాన్ని గిర్నితండాకు తరలించారని, బోడుప్పల్‌లోని ఇంటికి తీసుకెళ్తామన్న విజ్ఞప్తిని పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. బలవంతంగా స్వగ్రామానికి తరలించారని, తాము అంబులెన్స్ వెనుక వచ్చామన్నారు. ప్రీతిది ఆత్మహత్య కాదుని హత్యేనని, ఆమె ఏం తీసుకుందో ఇప్పటివరకు నిర్థారణ కాలేదన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేపట్టాలని, మరొకరు ప్రీతిలా మారకుండా ఉండాలంటే వేధింపుపులకు పాల్పడిన సైఫ్ను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ఓడీలను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బంధుమిత్రులు వచ్చాక మద్యాహ్నం అంతిమయాత్ర చేపడుతామని నరేంద్ర క్లారిటీ ఇచ్చారు. ప్రీతి డెడ్ బాడీని తీసుకురావడంతో గ్రామంలో విషాదయఛాయలు అలుముకున్నాయి. వైద్యురాలుగా ప్రజలకు సేవ చేసేందుకు వస్తుందనుకుంటే.. విగతజీవిగా రావడంతో గ్రామస్తులు బోరున విలపిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు కూడా ప్రీతి ఇంటికి చేరుకుంటున్నారు. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మధ్యాహ్నం ప్రీతి అంత్యక్రియలను నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తోన్నారు.
వైద్య విద్యార్థిని ప్రీతి మృతితో కేఎంసీ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కొవ్వొత్తులతో ప్రీతికి నివాళులర్పించారు. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. ప్రీతి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రీతి కుటుంబానికి న్యాయం చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రీతి మృతికి నిరసనగా నేడు మెడికల్ కాలేజీ బంద్‌కు ఓయూ జేఏసీ, ఏబీవీపీ పిలుపునిచ్చింది. (ఏజెన్సీలు)