टीजीएसआरटीसी बस में महिला ने दिया बच्चे को जन्म, मंत्री पोन्नम प्रभाकर ने कंडक्टर को दी बधाई

हैदराबाद: राखी त्योहार के दिन एक महिला कंडक्टर ने टीजीएसआरटीसी बस में एक गर्भवती महिला की डिलीवरी कराई और मानवता दिखाई। जब एक गर्भवती महिला को बस में प्रसव पीड़ा हुई, जहां वह अपनी ड्यूटी कर रही थी, तो वह तुरंत हरकत में आई और बस में यात्रा कर रही एक नर्स के प्रसव प्रक्रिया पूरी की। बाद में मां और बच्चे को स्थानीय अस्पताल में पहंचाया।

19 अगस्त को सुबह संध्या नाम की एक गर्भवती महिला गदवाला-वनपर्ती रूट की पल्ले वेलुगु बस में रक्षाबंधन के अवसर पर अपने भाइयों को राखी बांधने के लिए वनपर्ती जा रही थी। जैसे ही बस नाचहल्ली पहुंची, गर्भवती महिला को अचानक प्रसव पीड़ा शुरू हो गई। महिला कंडक्टर जी भारती ने तुरंत सतर्क होकर बस रोक दी और उसी बस में यात्रा कर रही एक नर्स की मदद से गर्भवती महिला का प्रसव पार किया। महिला ने एक कन्या को शिशु को जन्म दिया। बाद में 108 की मदद से जच्चा-बच्चा को स्थानीय अस्पताल ले गये। फिलहाल जच्चा-बच्चा सुरक्षित हैं।

इसी क्रम में मंत्री पोन्नम प्रभाकर ने वनपर्ती डिपो की महिला कंडक्टर जी भारती को बधाई दी, जिन्होंने टीजीएसआरटीसी बस में एक गर्भवती महिला का प्रसव किया। बस में सफर कर रही नर्स की मदद से समय पर डिलीवरी होने से जच्चा-बच्चा सुरक्षित हैं। एक ओर, आरटीसी कर्मचारी इस बात की सराहना कर रहे हैं कि वे सेवा दक्षता दिखाते हुए अपने कर्तव्यों का प्रभावी ढंग से पालन कर रहे हैं।

उधर, टीजीएसआरटीसी प्रबंधन ने भी कंडक्टर भारती को बधाई दी। नर्स की मदद से समय पर प्रसव होने से जच्चा-बच्चा सुरक्षित हैं। टीजीएसआरटीसी ने ट्वीट किया कि यह बहुत अच्छी बात है कि आरटीसी कर्मचारी यात्रियों को सुरक्षित उनके गंतव्य तक पहुंचाने में सामाजिक जिम्मेदारी के रूप में सेवा की भावना दिखा रहे हैं।

यह भी पढ़ें-

TGSRTC: బస్సులో మహిళ ప్రసవం, కండక్టర్కు మంత్రి పొన్నం అభినందనలు

హైదరాబాద్ : రాఖీ పండుగ రోజు టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) బస్సులో గర్భిణికి డెలివరీ చేసి మానవత్వం చాటుకున్నారు మహిళా కండక్టర్‌. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగానే వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

గద్వాల డిపోకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో ఆగస్టు 19న ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడ‌బిడ్డకు మ‌హిళ జ‌న్మనిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

టీజీఎస్ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడు పోసిన వనపర్తి డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ జి.భారతికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. సమయస్పూర్తితో వ్యవహారించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూనే సేవాతర్పరతను చాటుతుండటం అభినందనీయన్నారు.

మరో వైపు కండక్టర్‌ భారతికి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా అభినందనలు తెలిపింది. సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయని ట్వీట్ చేసింది టీజీఎస్ఆర్టీసీ. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X