AP: రైళ్లు ప్రమాదంలో మృతుల సంఖ14కు చేరింది, పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

हैदराबाद: आंध्र प्रदेश के विजयनगरम जिले में रविवार रात एक ट्रेन दुर्घटना में 14 लोगों की मौत हो गई और 50 से अधिक घायल हो गए> इस दुर्घटना के कारण कई ट्रेनों के यातायात में भारी व्यवधान उत्पन्न हुआ। विशाखा रूट पर कई ट्रेनें रद्द कर दी गईं> कुछ ट्रेनों को बीच में ही रोक दिया गया और अन्य का मार्ग बदल दिया गया।

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింన ఘటనలో 14మంది వరకు చనిపోగా 50మందికిపైగా గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు కొన్నింటిని మార్గమధ్యలో నిలిపివేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు.

సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (నంబరు 17016)ను సత్తెనపల్లిలో నిలిపేశారు. సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (నంబరు 12704)ను నల్లపాడు రైల్వేస్టేషన్‌లో ఆగిపోయింది. ఈ రూట్‌ ఎప్పటికి క్లియర్‌ అవుతుందో స్పష్టమైన సమాచారం తెలియకపోవడంతో నల్లపాడు, సత్తెనపల్లి స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు డివిజనల్‌ రైల్వే అధికారులు హుటాహుటిన ఈ రెండు స్టేషన్లకు సిబ్బందిని పంపి ప్రయాణికులకు అవసరమైన ఆహార పదార్థాలు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు.

విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు మీదుగా భువనేశ్వర్‌, హౌరా వైపు వెళ్లాల్సిన రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. హిరాకండ్‌, భువనేశ్వర్‌, నాగావళి, పూరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. హౌరా, భువనేశ్వర్‌ వైపు నుంచి విశాఖ మీదుగా నడిచే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020), ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (12703), టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ (18189), హౌరా-బెంగళూరు దురంతో ఎక్స్‌ప్రెస్‌ (12245)లను మళ్లింపు మార్గంలో నడిపిస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. రాయపూర్-విశాఖపట్నం (08527) ప్యాసింజర్‌ను రద్దు చేశారు. విశాఖపట్నం-రాయపూర్ (08528) ప్యాసింజర్ కూడా రద్దైంది.

అలాగే కోర్బా-విశాఖపట్నం, పారదీప్‌-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్‌, గుణుపూర్‌-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి. విశాఖ-రాయపూర్‌-విశాఖ మధ్య రాకపోకలు సాగించే 08527, 08528 రైళ్లను సోమవారం రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖ-రాయగడ, విశాఖ-భువనేశ్వర్‌, హౌరా వైపు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి రాయగడకు బయలుదేరి వెళ్లాల్సిన రాయగడ ఎక్స్‌ప్రె్‌సను రీషెడ్యూల్‌ చేశారు. బరుని-కోయంబత్తూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ (03357)‌ను దారిమళ్లించారు. మరికొన్ని రైళ్లను రద్దు చేయగా కొన్నింటిని దారి మళ్లించారు.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బోగీలు నుజ్జు-నుజ్జయ్యాయి. ఇప్పటి వరకు 14 మంది దుర్మరణం చెందారు. 50మందికిపైగా గాయాలయ్యాయని అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య వంద మందికిపైనే ఉంటుందని భావిస్తున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగేలా పరిస్థితులు ఉన్నాయి.

విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి. అక్కడే మరో ట్రాక్‌పైనున్న గూడ్సు రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లాయి. దీంతో ఇక్కడ భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కంటకాపల్లి-అలమండ వద్దకు రాగానే సిగ్నల్‌ కోసం పలాస ప్యాసింజర్‌ పట్టాలపై నెమ్మదిగా వెళుతూ 848 కి.మీ. వద్ద ట్రాక్‌పై నిలిచింది. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్‌ రైలు ప్రమాద సంఘటన మాదిరిగానే ఈ ప్యాసింజర్‌ రైళ్ల ప్రమాదం జరిగింది. పలాస, రాయగడ ప్యాసింజర్‌ రైళ్లలో సుమారు 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రైళ్ల ప్రమాదం ఘటన పైప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయినవారికి సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితోనూ ప్రధాని మాట్లాడారు.

రైలు ప్రమాదంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఘటన గురించి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X