हैदराबाद : एफएसएल डीजी शिखा गोयल ने बताया कि नामपल्ली में फोरेंसिक लैब में लगी आग मामले की जांच जारी है। अधिकारी हादसे में प्रॉपर्टी के नुकसान का अंदाज़ा लगा रहे हैं और नुकसान का अंदाज़ा पूरा होने के बाद पूरी जानकारी मीडिया को बताई जाएगी। शिखा गोयल ने रविवार को फोरेंसिक लैब का इंस्पेक्शन किया गया।
इसके बाद मीडिया को संबोधित किया। उन्होंने बताया कि एफएसएल में शनिवर को सुबह 10.08 बजे आग लगी। आग का पता सबसे पहले एफएसएल के एक कर्मचारी को चला। आग लैब और ट्रेनिंग हॉल तक फैल गई और आग बुझाने की कोशिशें नाकाम रहीं। उन्होंने कहा कि धुआं और आग सबसे पहले प्रॉपर्टी रूम में लगी और फिर लाइब्रेरी और एचआरडी रूम तक फैल गई। घटना के बारे में पुलिस में शिकायत दर्ज कराई गई है। इस बात की जांच की जा रही है कि आग लगने के समय कौन-कौन मौजूद थे।
शिखा गोयल ने साफ़ किया कि आग लगने के कारण दो ज़रूरी केस से जुड़े सबूत जल जाने का दुष्पप्रचार हो रहा है। इन मामले से जुड़ी सामग्री पहले ही कोर्ट को सौंप दिया गया। एसीबी ने 2015 में जो केस रजिस्टर किया था, उसके बारे में गलत जानकारी फैलाई जा रही है और उस केस का एफएसएल सामग्री लैब में नहीं है। उन्होंने कहा कि इस केस में, एफएसएल को 2015 में दो किश्तों में 16 सामग्री मिले थे और एसीबी ने उसी साल कोर्ट को अपनी रिपोर्ट सौंप दी।

डीजी गोयल ने कहा कि इस केस से जुड़े 16 सामग्री पहले ही कोर्ट को सौंप दिए गए हैं। पंजागुट्टा पुलिस स्टेशन के क्राइम नंबर 243 के केस में मार्च 2024 से जनवरी 2026 तक एफएसएल को कुल 136 सामग्री मिले थे। इनमें से 7 सामग्री को छोड़कर, बाकी सभी की जांच पहले ही हो चुकी है और अलग-अलग स्टेज पर संबंधित अधिकारियों को रिपोर्ट भेज दी गई है। उन्होंने कहा कि एफएसएल के पास बाकी 7 आइटम भी जांच के दायरे में हैं और उनकी रिपोर्ट तैयार की जा रही है। उन्होंने साफ किया कि कुल 136 आइटम में से ज़्यादातर पहले ही संबंधित अधिकारियों को वापस भेज दिए गए हैं।
Also Read-
ఆ కేసు ఆధారాలపై అధికారిక ప్రకటన
హైదరాబాద్ : నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోందని ఎఫ్‌ఎస్‌ఎల్ డీజీ శిఖాగోయల్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తినష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని, నష్టం అంచనాకు వచ్చాక వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇవాళ ఫోరెన్సిక్ లాబొరేటరీస్‍ను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిన్న ఉదయం 10.08 గంటలకు ఎఫ్ఎస్ఎల్‌లో అగ్నిప్రమాదం జరిగిందని, మంటలను మొదట ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి ఒకరు గుర్తించారని చెప్పారు. ల్యాబ్, ట్రైనింగ్ హాల్‌కు మంటలు వ్యాపించాయని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తే సాధ్యపడలేదన్నారు. మొదట ప్రాపర్టీ రూమ్‌లో పొగ, మంటలు చెలరేగాయని ఆ తర్వాత లైబ్రరీ, హెచ్ఆర్ డీ రూమ్‌కు వ్యాపించాయని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అగ్నిప్రమాదం సమయంలో ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.
అగ్నిప్రమాదం నేపథ్యంలో రెండు ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ కేసులకు సంబంధించిన సామగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని శిఖాగోయల్ స్పష్టం చేశారు. 2015లో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి దుష్ప్రచారం జరుగుతోందని, ఆ కేసు మెటీరియల్ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో లేదన్నారు. ఈ కేసులో 2015లో రెండు విడతల్లో 16 మెటీరియల్ ఆబ్జెక్టులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అందాయని అదే సంవత్సరం వాటి నివేదికలను ఏసీబీ కోర్టుకు సమర్పించినట్టు చెప్పారు.
ఈ కేసుకు సంబంధించిన 16 వస్తువులు ఇప్పటికే కోర్టుకు తిరిగి అప్పగించినట్టు తెలిపారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చెందిన క్రైమ్ నంబర్ 243 కేసులో మార్చి 2024 నుంచి జనవరి 2026 వరకు మొత్తం 136 మెటీరియల్ ఆబ్జెక్టులు ఎఫ్ఎస్ఎల్‌కు అందాయన్నారు. వీటిలో 7 వస్తువులు మినహా మిగతావన్నీ ఇప్పటికే పరిశీలించి వివిధ దశల్లో సంబంధిత అధికారులకు నివేదికలు పంపించబడ్డాయని చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఎల్ వద్ద మిగిలి ఉన్న ఆ 7 వస్తువులు సైతం పరిశీలనలో ఉన్నాయని, వాటి నివేదికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మొత్తం 136 వస్తువుల్లో చాలా వరకు ఇప్పటికే సంబంధిత అధికారులకు తిరిగి పంపించినట్టు స్పష్టం చేశారు. (ఏజెన్సీలు)
