मेडारम सम्मक्का-सारलम्मा जातरा का आगाज, होने वाले हैं ये खास कार्यक्रम సమ్మక్క – సారలమ్మ మహాజాతర

हैदराबाद : एशिया के सबसे बड़े आदिवासी कुंभ मेला मेडारम सम्मक्का – सारलम्मा महा जातरा का पहला अहम इवेंट बुधवार को शुरू हो रहा है। यह मेला आदिवासी परंपराओं के मुताबिक ‘मंडमेलिगे’ त्योहार के साथ आधिकारिक रूप से शुरू होगा।

इस मेले के शुरू होने से पहले मेडारम के आदिवासी पुजारी की ओर से संचालित करने वाला यह बहुत ही पवित्र कार्यक्रम है। मेडारम गांव स्थित सम्मक्का के मुख्य मंदिर के साथ-साथ कन्नेपल्ली में सारलम्मा मंदिर को आदिवासी पूजारी पवित्र जल से शुद्ध करते हैं। इस दिन पुजारी बहुत ही रहस्य तरीके से खास परंपरा पूजा करते हैं। इस दौरान आम लोगों को अंदर जाने की इजाज़त नहीं होती। ढोल की संगीत आवाज़ के बीच पुजारी मेडारम की गलियों पर और मंदिरों के चारों ओर हरे रंग के तोरण बनाते हैं। इससे एक त्योहार माहौल बनाते है।

21 जनवरी से लेकर मेले के खत्म होने तक कोया पुजारी कड़े नियमों और खास रस्मों का पालन करते हैं। महा जातरा के ज़ोर पकड़ने से पहले ही बड़ी संख्या में भक्त मेडारम पहुंच रहे हैं। जम्पन्ना नदी में पवित्र स्नान करने के लिए भक्त उमड़ पड़े हैं। भक्त अपनी मन्नतें पूरी करने के लिए सोने (गुड़) के साथ तैयार हैं।

भक्तों की सुविधा के लिए तेलंगाना आरटीसी ने बड़े पैमाने पर इंतज़ाम किए हैं। यात्रियों की भीड़ को ध्यान में रखते हुए खास सर्विस चला रहा है। 25 जनवरी से 31 जनवरी तक 3,495 स्पेशल बसें चलाए जाएंगे। किराया नॉर्मल किराए से 50 फीसदी ज़्यादा वसूल किये जाएंगे। हनमाकोंडा, वरंगल, करीमनगर, खम्मम और हैदराबाद जैसे बड़े डिपो से स्पेशल बसें चल रही हैं।

मुलुगु-मेडारम मार्ग पर ट्रैफिक पर प्रतिबंध है। मेडारम पुलिस ने कहा कि उनके निर्देशों का पालन किया जाना चाहिए। भीड़ वाली जगहों पर छोटे बच्चों से सावधान रहने की सलाह दी है। पुलिस ने सभी से पवित्र जम्पन्ना नदी और मेडारम के आस-पास की जगह को साफ़ रखने में सहयोग करने की अपील की है।

Also Read-

సమ్మక్క – సారలమ్మ మహాజాతర

హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో బుధవారం అత్యంత కీలకమైన తొలి ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ‘మండమెలిగే’ పండుగతో జాతర అధికారికంగా ప్రారంభం కానుంది.

ఈ జాతర ప్రారంభానికి ముందు మేడారంలోని గిరిజన పూజారులు నిర్వహించే అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఇది. మేడారం గ్రామంలోని సమ్మక్క ప్రధాన ఆలయాన్ని, అలాగే కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని ఆదివాసీ పూజారులు పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. ఈ రోజు పూజారులు అత్యంత రహస్యంగా ప్రత్యేక ఆచారాలతో పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో సామాన్యులకు ప్రవేశం ఉండదు. డోలు వాయిద్యాల మధ్య పూజారులు మేడారం వీధుల్లో, ఆలయ పరిసరాల్లో పచ్చని తోరణాలు కట్టి పండుగ వాతావరణాన్ని తీసుకువస్తారు.

నేటి నుంచి జాతర ముగిసే వరకు కోయ పూజారులు కఠినమైన నియమాలను, ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. మహాజాతర ఇంకా ఊపందుకోకముందే భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. తమ మొక్కులు చెల్లించుకోవడానికి బంగారం (బెల్లం)తో భక్తులు సిద్ధమయ్యారు.

భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. జనవరి 25వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు 3,495 ప్రత్యేక బస్సులు నడపనుంది. సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనంగా ఛార్జీలు ఉన్నాయి. ప్రధాన కేంద్రాలైన హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

ములుగు – మేడారం దారిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తమ సూచనలను తప్పనిసరిగా పాటించాలని మేడారం పోలీసులు తెలిపారు. రద్దీ ప్రదేశాల్లో చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పవిత్రమైన జంపన్న వాగును, మేడారం పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో సహకరించాలని మేడారం పోలీసులు కోరారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X