హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సటీలో “లైబ్రరీ డిజిటలైజేషన్” అంశంపై ఉపన్యాస కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన్నం వెంకట రాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని “లైబ్రరీ డిజిటలైజేషన్” అనే అంశంపై ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ లైబ్రరీ డిజిటలైజేషన్ లో సంప్రదాయ లైబ్రరీలలోని పుస్తకాలు, పత్రికలు, దస్తావేజులు, మాన్యుస్క్రిప్ట్‌లు మొదలైన భౌతిక మెటీరియల్‌ను డిజిటల్ ఫార్మాట్‌కు మార్చడంతో కావాల్సిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలోని ఎవరికైనా సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచేలా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పెద్ద బుక్ షెల్ఫ్‌లు లేకుండా ఎక్కువ మొత్తంలో పుస్తకాలు నిల్వ చేయకుండా, తక్కువ నిర్వహణ ఖర్చుతో అందరూ ఉపయోగించడానికి సులభం అవుతుందన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ మారిన ఆధునిక ప్రపంచంలో డిజిటల్ లైబ్రరీలు పరిశోధకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విశ్వవిద్యాలయంలో ఉన్న లైబ్రరీ లో గత నాలుగు దశాబ్దాలుగా సేకరించిన పుస్తకాలు, సమాచారం విద్యార్థులతో పాటు ఇతరులకు కూడా డిజిటల్ ఫార్మాట్లో అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిలుగా విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; రిజిస్ట్రార్ డా. ఎల్. విజయా కృష్ణా రెడ్డి పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయ లైబ్రరీ ఇంచార్జ్ ప్రొ. ఎన్. రజని కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
BRAOU MBA (HHCM) POSTER RELEASED
Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU) Released M.B.A Hospital & Healthcare Management (HHCM) Program Posters in which will run in collaboration with Apollo Institute of Health Care Management (AIHCM), KIMS Education Society (KIMS) and Darussalam Educational Trust, (DET) at its campus on Monday. The Program was attended by Prof.Ghanta Chakrapani, Vice-Chancellor and released the posters. He spoke on the occasion Prof Chakrapaani was mentioned that BRAOU MBA (HHCM) Course one of the prestigious course in India.

In this program Prof G. Pushpa Chakrapani, Director Academic, Dr.L.Vijaya Krishna Reddy, Registrar; Prof. Anad Pawar, Dean faculty of Commerce and Management, Prof. Rabindranath Solomon, Professor of Commerce, Dr. Venkateshwarlu, Director LSSB, Prof Vaddanam Sreenivas, Prof. Pallavi Kabde, Prof.Vijaya Rudra Raju, Director (AIHCM); Dr.Ravi Kumar Tati, Principal KIMS School of Healthcare Management and Amjad Khan, Vice-Principal, Deccan School of Healthcare Management, Darussalam Educational Trust. All the Director, Deans, other Faculty members, officials from three institutions were present.
ఎం.బి.ఏ. హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ పోస్టర్ విడుదల
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, కిమ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు దారుస్సలాం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహకారంతో ఎం.బి.ఏ. హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్ష పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ MBA (HHCM) కోర్సు దేశంలో విశేష గుర్తింపు పొందిన మానేజ్మెంట్ కోర్సుగా అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; రిజిస్ట్రార్, డా. ఎల్. విజయా కృష్ణా రెడ్డి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగ డీన్ ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవీ కాబడే, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వెంకటేశ్వర్లు అపోలో డైరెక్టర్ ప్రొ.విజయ రుద్రరాజు; కిమ్స్ స్కూల్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ డా. రవి కుమార్ తాటి మరియు డెక్కన్ స్కూల్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, దారుస్సలాం ఎడ్యుకేషనల్ ట్రస్ట్, వైస్ ప్రిన్సిపాల్ అమ్జాద్ ఖాన్; ఇతర అధికారులు పాల్గొన్నారు.
