“అందాల పోటీలపై ఉన్న ఆసక్తి… విద్యార్థుల భవిష్యత్తుపై లేదా…?”

విద్యాశాఖ మంత్రి ఎక్కడ..?

లక్షమంది డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తు గాలికేనా..?

ప్రభుత్వం వద్ద రూ. 650 కోట్లు లేవా..?

మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టి, రాహుల్ గాంధీతో చెప్పించి, ప్రైవేటు కాలేజీలను నిండా ముంచి విద్యార్థులను ఆగం చేస్తరా..?

హైదరాబాద్ : తెలంగాణ లో గత 15 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన విద్యాశాఖ, హోంశాఖలను స్వయంగా తన దగ్గర ఉంచుకున్నారు. అయితే ఈ వ్యవధిలో ఒక్కసారి అయినా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యానికి నిదర్శనమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మీడియా సమావేశంలో అన్నారు.

రాణి రుద్రమ మాట్లాడూతూ రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ పరీక్షలు ఇప్పటిదాకా నిర్వహించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళానికి గురైంది. ముఖ్యమంత్రి దీనిపై సమాధానం చెప్పాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 15 నెలలుగా ఒక్కసారైన విద్యాశాఖపై ఎందుకు రివ్యూ చేయలేదు..? రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ పరీక్షలు ఇప్పటివరకు ఎందుకు నిర్వహించబడలేదు? లక్షమంది విద్యార్థుల భవిష్యత్తును ఎందుకు గాలికి వదిలివేసిన్రు? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

లక్ష మంది విద్యార్థుల భవిష్యత్తు ఎందుకు ప్రభుత్వం దృష్టిలో లెక్కలేనిదిగా అయిపోయింది? వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందాల పోటీలను నిర్వహించే ఆసక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది డిగ్రీ విద్యార్థుల కోసం పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యతను నిర్లక్ష్యం చేయడం అత్యంత దౌర్భాగ్యకరం. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. విద్యా సంవత్సరం అయిపోతున్నా పరీక్షలు జరపకపోవడం, కనీస పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు? పీజీ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

Also Read-

ఇలాంటి పరిస్థితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కూడా చోటుచేసుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతోనే విద్యావ్యవస్థ క్షీణించగా, ఇప్పుడు కాంగ్రెస్ పాలన వలన లక్షల మంది డిగ్రీ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం పుణ్యమా అని దాదాపు లక్ష మంది డిగ్రీ విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని కోల్పోతున్నరు. ముఖ్యమంత్రేమో దేశాల పర్యటనలు చేస్తూ, మంత్రులు హెలికాప్టర్లలో జిల్లాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ విద్యార్థుల పరీక్షల నిర్వహణపై మాత్రం సరైన శ్రద్ధ లేదు. ఇదేనా ప్రజాపాలనా? ఇదేనా మీరు చెప్పిన మార్పు..?

విశ్వవిద్యాలయాలు విద్యార్థుల భవిష్యత్తుకు పట్టుగొమ్మలు. బీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మొత్తం విద్యావ్యస్థను సర్వనాశనం చేసి, కనీసం టీచర్ రిక్రూట్ మెంట్ కూడా చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రేవంత్ రెడ్డి ఒక్క విద్యాశాఖ మంత్రిగా 15 నెలలైనా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు డిగ్రీ కాలేజీలకు చెల్లించలేదు. విద్యార్థుల పరీక్షలు నిర్వహించకపోవడం అంటే మీకు ఏం బాధ్యత ఉన్నట్లు? ప్రజలు, తెలంగాణ పట్ల మీ నైతికత ఏంటి?

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మూడేళ్ల పాటు పీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదు.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదేలా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ – పాత బకాయిలన్నీ చెల్లిస్తామని, మూడు నెలలకొకసారి కాలేజీలకు ఫీజు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని తెలంగాణకు తీసుకొచ్చి, పెద్ద అంబర్ పేటలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి — ఫీజు రీయింబర్స్‌మెంట్ పైసలన్నీ చెల్లిస్తామని, కళాశాలలన్నీ అభివృద్ధి మార్గంలోకి తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చింది.

ఇంతకంటే ముందే, పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి — అదే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలను ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్ గాంధీని కలిపి, బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీకి అవకాశమివ్వాలని వేడుకున్న సందర్భం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన వల్ల ఇయ్యాల తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పులపాలైందని చెబుతూ పాలన చేతగాదనే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం లేకపోతే, విద్యావ్యవస్థను గాడిలో పెట్టే కృషి చేయలేకపోతే, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలి.

కొత్తగా ముద్రించిన పాఠ్యపుస్తకాలపై పాత ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉంటే… తెలంగాణ అంతటా వాటిని పంపిణీ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకునే సోయిలో లేదు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐదుసార్లు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నాలుగుసార్లు, పాలమూరు విశ్వవిద్యాలయంలో మూడుసార్లు, శాతవాహన, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో నాలుగుసార్లు డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు జరగుతాయో లేదో అన్న అనిశ్చితి విద్యార్థులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కాలేజీలకు మొత్తం రూ. 650 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ అందాల పోటీలకు ఖర్చు పెట్టడానికి మాత్రం నిధులు దొరుకుతున్నాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల ఖర్చులు, మంత్రుల హెలికాప్టర్ల హంగు, ఆర్భాటాల పర్యటనల కోసం ఖర్చు చేసే కోట్లాది రూపాయలను డిగ్రీ కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించండి. బాధ్యత లేని రెవంత్ రెడ్డి తన వద్ద ఉన్న విద్యాశాఖ ను వెంటనే సమర్థుడైన వ్యక్తికి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే డిగ్రీ పరీక్షలు తక్షణమే నిర్వహించాలని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను కాలేజీలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.

విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు చెల్లించినప్పటికీ, కాలేజీలు వాటిని యూనివర్సిటీ ఖాతాల్లో జమ చేయకపోవడం వల్ల పరీక్షలు జరుగడం లేదు. దీనిపై రేవంత్ ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు? ఫీజు రీయింబర్స్ మెంట్ పైసలు అందక గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోతున్నరు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. పరీక్షలు తక్షణమే నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X