हैदराबाद/नई दिल्ली: सोने की कीमत बढ़ोत्तरी जारी है। 10 ग्राम सोना एक लाख रुपये के करीब पहुंच गया है। कमजोर डॉलर और अमेरिका-चीन के बीच व्यापार को लेकर अनिश्चितता ने सोने की कीमतों को हवा दी है। सोमवार को दिल्ली में सोने का भाव 1,650 रुपये प्रति 10 ग्राम बढ़ा था। इससे अब सोना 99,800 रुपये प्रति 10 ग्राम का हो गया है।
सराफा बाजार में यह चर्चा जोरों पर है कि आज या कल दस ग्राम सोना एक लाख रुपये पार कर सकता है। चांदी की कीमतों में भी बढ़ोत्तरी देखी गई। चांदी अब 98,500 रुपये प्रति किलोग्राम तक पहुंच गई है। वेंचुरा के कमोडिटीज चीफ एन.एस. रामस्वामी के अनुसार, लंबी अवधि में सोने की कीमतें 3500 डॉलर प्रति औंस को पार कर सकती हैं। ये अप्रत्याशित ऊंचाइयों तक पहुंच सकती हैं।
कमजोर डॉलर के कारण सोना विदेशी निवेशकों के लिए सस्ता हो गया है। इसलिए, सोने की मांग बढ़ी है। अमेरिकी राष्ट्रपति ट्रंप की टैरिफ नीतियों के कारण फेडरल रिजर्व की स्वतंत्रता पर सवाल उठने लगे हैं। इससे निवेशकों में डर का माहौल है। रूस और यूक्रेन के बीच तनाव बढ़ रहा है। वहीं, दुनियाभर के केंद्रीय बैंक सोना खरीद रहे हैं। महंगाई लगातार बढ़ रही है। इन सभी कारणों से सोने की कीमतें बढ़ी हैं।
Also Read-
राजधानी दिल्ली के अखिल भारतीय सराफा संघ के अनुसार, 99.9 फीसदी शुद्धता वाले सोने की कीमत 99,800 रुपये प्रति 10 ग्राम पर पहुंच गई है। 99.5 फीसदी शुद्धता वाले सोने का भाव 99,300 रुपये प्रति 10 ग्राम के नए शिखर पर पहुंच गया है। पिछले साल 31 दिसंबर से अब तक सोने की कीमत में 20,850 रुपये यानी 26.41 फीसदी प्रति 10 ग्राम की बढ़ोतरी हुई है। इसका मतलब है कि सोने ने निवेशकों को शानदार रिटर्न दिया है। चांदी की कीमतें भी बढ़ी हैं। यह 98,500 रुपये प्रति किलोग्राम हो गई है। इससे पता चलता है कि चांदी में भी निवेशकों की दिलचस्पी बढ़ रही है। (एजेंसियां)
प्रति वर्ष औसत दर (रुपये में)
2000 – 4,300
2005 – 7,000
2010 – 8,500
2011 – 26,400
2015 – 25,000
2020 – 48,000
2023 – 60,110
2024 – 81,500
2025 – 99,800 (21 अप्रैल)
బంగారం ఆల్ టైమ్ రికార్డ్ ధర
న్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాములు గోల్డ్ రేటు దేశ రాజధాని ఢిల్లీలో రూ. లక్ష మార్కుకు చేరువైంది. కేవలం రూ. 200 దూరంలో ఉంది. డాలర్ విలువ పడుతుండడంతో పాటు, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండడంతో డాలర్‌కు డిమాండ్ పడిపోతోంది. ఇన్వెస్టర్లు డాలర్ కంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మరోవైపు యూఎస్-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండడంతో బంగారం ధరలు వెనుతిరిగి చూడడం లేదు. 10 గ్రాముల గోల్డ్ (24 క్యారెట్లు) ధర ఢిల్లీలో సోమవారం రూ. 1,650 పెరిగి రూ.99,800కి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, ఈ రేటు శుక్రవారం రూ. 98,150 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ. 1,600 పెరిగి కొత్త గరిష్ఠ స్థాయి అయిన రూ. 99,300కి చేరింది. కిందటేడాది డిసెంబర్ 31 నుంచి ఇప్పటివరకు చూస్తే బంగారం ధర 10 గ్రాములకు రూ. 21 వేలు లేదా 26.41 శాతం పెరిగింది. వెండి ధరలు కూడా చుక్కలంటుతున్నాయి. కేజీకి రూ. 500 పెరిగి రూ. 98,500కు చేరాయి. వెండి ధరలు శుక్రవారం రూ. 98,000 వద్ద ఉన్నాయి.
హైదరాబాద్‌లో10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర సోమవారం రూ.770 పెరిగి రూ.98,350 కి, 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 పెరిగి రూ.90,150 కి చేరుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో బంగారం ఫ్యూచర్స్ ( జూన్ డెలివరీ ) రూ. 1,621 లేదా 1.7 శాతం పెరిగి కొత్త గరిష్ఠ స్థాయి రూ. 96,875కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ బంగారం సోమవారం ఔన్స్‌కు 3,397.18 డాలర్ల వద్ద కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఈ లెవెల్ నుంచి కొద్దిగా తగ్గి 3,393.49 డాలర్ల (రూ.2.90 లక్షల) వద్ద సెటిలయ్యింది. గ్లోబల్‌గా, బంగారం ఫ్యూచర్స్ మొదటిసారిగా 3,400 డాలర్ల మార్కును దాటాయి.
“వాణిజ్య ఉద్రిక్తతలు, రేట్ల తగ్గింపు అంచనాలు, గ్లోబల్‌గా రాజకీయ అనిశ్చితులు, డాలర్ విలువ పడడం వంటి కారణాలతో ఈ ఏడాది బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. ఇప్పటివరకు గోల్డ్ రేటు 25 శాతానికి పైగా ఎగసింది. ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించిన రోజు అంటే ఏప్రిల్ 2 W 6 శాతం లాభపడింది” అని కోటక్ మహీంద్రా ఏఎంసీ ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి తెలిపారు. “టారిఫ్ వార్‌పై అనిశ్చితి, యూఎస్ డాలర్ బలహీనత, పెరుగుతున్న ట్రెజరీ ఈల్డ్స్ కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్‌కు 3,400 డాలర్లను టచ్ చేశాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇండియాలో అయితే డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది. పండుగ సీజన్ మొదలైతే గిరాకీ ఇంకా పెరుగుతుంది” అని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ వివరించారు.
యూఎస్ డాలర్ విలువ తాజాగా మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిందని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కైనత్ చైన్‌వాలా అన్నారు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్‌ను తొలగిస్తామని అనడంతో సేఫ్ అసెట్లలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్‌లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థలపై ట్రంప్ టారిఫ్ పాలసీ ప్రభావం, ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై బంగారం ధరలు ఆధారపడతాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఏడాది సగటు రేటు (రూ.లలో)
2000 – 4,300
2005 – 7,000
2010 – 8,500
2011 – 26,400
2015 – 25,000
2020 – 48,000
2023 – 60,110
2024 – 81,500
2025 – 99,800
