हैदराबाद: आइकॉन स्टार अल्लू अर्जुन को संध्या थिएटर की भगदड़ घटना के मद्देनजर गिरफ्तार किया गया और शनिवार को चंचलगुडा जेल से रिहा कर दिया गया। इसके साथ ही उन्होंने एक प्रेस कॉन्फ्रेंस को संबोधित किया। उन्होंने कहा कि संध्या थियेटर की घटना दुर्घटनावश हुई। किसी को भी ऐसी घटना की उम्मीद नहीं थी। उन्होंने कहा कि यह सचमुच दुर्भाग्यपूर्ण है कि ऐसी घटना घटी।
अल्लू अर्जुन ने कहा कि जब यह घटना घटी तब वे सिनेमाघर में थे, लेकिन महिला की मौत की खबर सुनकर उन्हें गहरा दुख हुआ। उन्होंने मृतक के परिवार के प्रति अपनी गहरी संवेदना व्यक्त की तथा उन्हें हर संभव सहायता का आश्वासन दिया। उन्होंने कहा कि वे इस संबंध में हर संभव सहायता उपलब्ध कराने का प्रयास करेंगे। उन्होंने कहा कि वह जल्द ही रेवती के परिवार से मिलेंगे। उन्होंने इस कठिन समय में उनके साथ खड़े रहने और उनका समर्थन करने के लिए अपने प्रशंसकों को धन्यवाद दिया।
अल्लू अरविंद ने भी उसी प्रेस वार्ता को संबोधित किया। उन्होंने मीडिया को धन्यवाद दिया। इस अवसर पर उन्होंने राष्ट्रीय मीडिया का भी विशेष आभार व्यक्त किया जो कल से ही अल्लू अर्जुन के साथ खड़ा है। उन्होंने कहा कि वह केवल बन्नी की फिल्मों और उनकी सफलता का समर्थन करने के लिए क्षेत्रीय और राष्ट्रीय मीडिया को धन्यवाद देने आए हैं।
दूसरी ओर, पुष्पा 2 के प्रीमियर के अवसर पर, अल्लू अर्जुन बुधवार (04 दिसंबर) को रात 9:30 बजे हैदराबाद के आरटीसी क्रॉस रोड्स स्थित संध्या थिएटर गए। उसी समय रेवती नाम की एक महिला अपने पति और बच्चों के साथ फिल्म देखने आई। हालांकि, अल्लू अर्जुन के आने से प्रशंसक अचानक उछल पड़े। इससे भगदड़ मच गई और रेवती की मौके पर ही मौत हो गई। रेवती के बेटे श्री तेजा का अस्पताल में इलाज चल रहा है।
इसके चलते अल्लू अर्जुन की टीम ने मृतक के परिवार को 25 लाख रुपये का मुआवजा देने की घोषणा की। हालांकि, इस घटना को लेकर संध्या थिएटर प्रबंधन और अल्लू अर्जुन की टीम के खिलाफ विभिन्न धाराओं के तहत मामला दर्ज कर लिया गया है और जांच शुरू कर दी गई है।
సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ కామెంట్స్, రేవతి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటాం
Also Read-
హైదరాబాద్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలో అరెస్ట్ అయ్యి శనివారం చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. దీంతో పత్రికా విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఇందులోభాగంగా సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగిందని అన్నాడు. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు. నిజంగా అలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ సంఘటన జరిగిన సమయంలో మేం సినిమా థియేటర్లో ఉన్నామని కానీ మహిళ మృతి చెందిన విషయం తెలిసి చాలా బాధేసిందని తెలిపాడు. అలాగే మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అండగా ఉంటామని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఎటువంటి సహాయం అవసరమైనా తమకి సాధ్యమైనంతవరకూ చెయ్యడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు. ఇక త్వరలోనే రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ కష్టకాలంలో తనకి అండగా ఉంటూ సపోర్ట్ గా నిలిచినా ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలిపాడు.
ఇదే ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ కూడా మాట్లాడారు. ఇందులోభాగంగా మీడియా వారికి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఈక్రమంలో నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియాకు కూడా స్పెషల్ థాంక్స్ తెలిపాడు. ఇక బన్నీ సినిమాలను, ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకు థాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చానని అన్నారు.
ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా అల్లు అర్జున్ బుధవారం (డిసెంబర్ 04) రాత్రి 9:30 గంటలకి హైదరాబద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కి వెళ్ళాడు. ఇదే సమయంలో రేవతి అనే మహిళ తన భర్త పిల్లలతో కలసి సినిమా చూసేందుకు వచ్చింది. అయితే అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి రేవతి అక్కడిక్కడే మృతి చెందింది. రేవతి కుమారుడు శ్రీ తేజ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
దీంతో అల్లు అర్జున్ టీమ్ స్పందిస్తూ మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షలు నష్ట పరిహారం ప్రకటించారు. అయితే ఈ ఇన్సిడెంట్ పై సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ టీమ్ పై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. (ఏజెన్సీలు)