हैदराबाद : अभिनेता अल्लू अर्जुन की ‘पुष्पा-2’ दर्शकों के सामने आ चुकी है। इसी पृष्ठभूमि में पुष्प राज-अल्लू अर्जुन के फैंस को बड़ा सरप्राइज दिया है। आरटीसी एक्स रोड स्थित संध्या 70एमएम थिएटर में प्रशंसकों के एक साथ फिल्म देखी। इसी क्रम में प्रीमियर शो देखने के लिए प्रशंसकों ने पहले से ही बड़ी संख्या में टिकट बुक कर लिए हैं। इसके चलते फैंस भारी संख्या में संध्या थिएटर पहुंचे।
इस दौरान भगदड़ में दिलसुखनगर निवासी महिला रेवती (39) की मौत हो गई, जबकि उसका बेटा श्रीतेज (9) गंभीर रूप से घायल हो गया। गंभीर रूप से घायल युवक को सीपीआर किया गया। बाद में उसे किम्स हॉस्पिटल में भर्ती किया गया।
घायल युवक का वेंटीलेटर से इलाज किया जा रहा है। इससे जुड़े वीडियो सोशल मीडिया पर वायरल हो गए हैं। रेवती का पति भास्कर परिवार के साथ फिल्म देखने आया था। इनकी बेटी सन्विका (7) को कोई चोट नहीं है। रेवती की मौत से परिवार में मातम छा गया है।
प्रशंसकों को नियंत्रित करने के लिए पुलिस ने लाठीचार्ज किया। उधर, हैदराबाद के बालानगर थिएटर में एक्ट्रेस श्रीलीला ने धमाल मचाया। परिजनों के साथ पुष्पा-2 देखने आई। मालूम हो कि श्रीलीला ने इस फिल्म में किसिक गीत पर अभिनय किया।
यह भी पढ़ें-
इसी क्रम में पुष्पा 2 ने एडवांस बुकिंग में 100 करोड़ से ज्यादा का कलेक्शन कर ट्रेड सर्किल को चौंका दिया। अकेले भारत में 70 करोड़ एडवांस बुकिंग हुई है। इसके अलावा, बुक माई शो ने सबसे तेजी से बिकने वाली मिलियन टिकट वाली फिल्म का रिकॉर्ड बनाया है। तो आइए जानते हैं कि यह फिल्म पहले दिन किस तरह का कलेक्शन करेगी और ट्रेड सर्किल ने कितने करोड़ का अनुमान लगाया है।
पुष्पा 2 लगभग 12,000 स्क्रीन्स के साथ रिलीज़ हुई और इसे सकारात्मक चर्चा मिल रही है। 4 दिसंबर को प्रीमियर शो की 7 करोड़ रुपये की बिक्री हुई है। इसके साथ, अग्रिम बुकिंग और प्रीमियर संग्रह सहित 77 करोड़ रुपये प्री-सेल्स हो चुकी है। इसमें से अकेले हिंदी वर्जन ने 27.12 करोड़ रुपये और तेलुगु वर्जन ने 38.37 करोड़ रुपये का कलेक्शन किया है। एक मशहूर ट्रेड रिपोर्ट के मुताबिक, गुरुवार को सिर्फ प्रीमियर से ही भारत में करीब 16.03 करोड़ रुपये की नेट कमाई हुई है।
ट्रेड सूत्र अनुमान लगा रहे हैं कि बड़े पैमाने पर रिलीज हुई पुष्पा 2 फिल्म अकेले तेलुगु राज्यों में 80 करोड़ रुपये का ग्रॉस कलेक्शन हासिल कर सकती है। साथ ही वो ये राय भी जता रहे हैं कि तमिलनाडु में 9 करोड़, कर्नाटक में 15 करोड़ और केरल में 8 करोड़ रुपये का आंकड़ा पार कर सकती है। अनुमान है कि ओवरसीज कलेक्शन 62 से 72 करोड़ रुपये तक पहुंचने की संभावना है। ट्रेड सूत्रों का कहना है कि पुष्पा 2 का पहले दिन का कलेक्शन 250-300 करोड़ रुपये होने की संभावना है। आरआरआर (2022) ने 223 करोड़ के साथ सबसे ज्यादा ओपनिंग का रिकॉर्ड बनाया है। यह दुनिया भर में किसी भारतीय फिल्म का सबसे ज्यादा कलेक्शन है। और देखते हैं पुष्पा 2 का पहला दिन क्या-क्या धमाल मचाता है।
హైదరాబాద్ : అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే పుష్ప రాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్య 70 ఎమ్ ఎమ్ థియేటర్ లో ఫ్యాన్స్ కలిసి సినిమా చూశారు. అప్పటికే ప్రీమియర్ షో చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో టికెట్స్ బుక్ చేసుకున్నారు.
దీంతో ఫ్యాన్స్ సంధ్య థియేటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతో ఉద్రిక్తత ఏర్పడి తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా మరో బాలుడు పరిస్థితి విషమంగా మారింది. బాలుడికి సీపీఆర్ చేశారు. అనంతరం కిమ్స్ హస్పిట ల్ కు తరలించారు. బాలుడిని వెంటిలెటర్ చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.
మరోవైపు హైదరాబాద్‌లోని బాలానగర్ థియేటర్‌లో నటి శ్రీలీల సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పుష్ప-2 వీక్షించేందుకు వచ్చారు. ఈ సినిమాలో శ్రీలీల కిస్సిక్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.
ఇదే క్రమంలో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్లో 100 కోట్లకి పైగా వసూళ్లు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. కేవలం ఇండియాలోనే 70 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అంతేకాకుండా బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడైన మూవీగా రికార్డ్స్ నెలకొల్పింది. దాంతో ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి వసూళ్లు చేయనుందో, ట్రేడ్ వర్గాల అంచనా ఎన్ని కోట్ల మేరకు ఉందో తెలుసుకుందాం.
పుష్ప 2 దాదాపు 12,000 స్క్రీన్లతో నేడు డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 4న ప్రీమియర్ షోస్ కోసం 7 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ కలెక్షన్స్ మొత్తం కలుపుకుని రూ. 77 కోట్ల ప్రీ-సేల్స్ సాధించినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో ఒక్క హిందీ వెర్షన్ లోనే 27.12 కోట్లు, తెలుగు వెర్షన్ 38.37 కోట్లు వసూలు చేసింది. ప్రముఖ ట్రేడ్ రిపోర్ట్ Sacnilk ప్రకారం.. గురువారం ప్రీమియర్స్ తోనే దాదాపు 16.03 కోట్ల ఇండియా నికర సంపాదించినట్టు తెలిపింది.
భారీ స్థాయిలో రిలీజైన పుష్ప 2 మూవీకి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి. అలాగే తమిళనాడులో 9 కోట్లు,కర్ణాటకలో 15 కోట్లు, కేరళలో 8 కోట్ల మేరకు సాధించేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో 62 నుండి 72 కోట్లు వరకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇకపోతే పుష్ప 2 ఫస్ట్ డే 250-300కోట్ల మేరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో RRR (2022) 223 కోట్లతో అత్యధిక ఓపెనింగ్ సాధించిన రికార్డును కలిగి ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియన్ సినిమాకి ఇవే హయ్యెస్ట్ కలెక్షన్స్. మరి పుష్ప 2 ఫస్ట్ డే ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.(ఏజెన్సీలు)