హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించొద్దని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. పది ఎకరాల స్థలం కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ, ఆ లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆందోళనను కొనసాగించారు.
జేఎసీ ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ డా. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం NAAC- ‘A’ గ్రేడ్‌ను సాధించింది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ – రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ నుండి నిధుల పొందే అవకాశం ఉందన్నారు. విశ్వవిద్యాలయం ఆంగ్ల భాషా అధ్యయనంతో పాటు అంతర్జాతీయ భాషలకు కూడా కోచింగ్ అందించాలని ప్రయత్నం చేపడుతున్నది వారికీ సమంధిత కోర్సులు కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు, భాషా ప్రయోగశాలలను ప్రత్యేకంగా నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Also Read-
ఈ ప్రతిపాదిత భవనాల నిర్మాణానికి తగిన యూనివర్సిటీ స్థలం అందుబాటులో లేదన్నారు. విద్యార్థులకు కొత్తగా కంప్యూటర్ ల్యాబ్స్ నిర్మించే అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేఖను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా కొనసాగతున్న ఈ నిరసనను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తన ఆలోచనా విధానాన్ని మార్చుకోకుంటే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జేఎసీ నేతలు డా.యాకేష్ దైద; కాంతం ప్రేంకుమార్; డా. రవీంద్రనాథ్ సోలమన్; ఎండి హబీబుద్దిన్; రజనికాంత్; షబ్బీర్; రాములు డా. ఎ. నారాయణరావు; రుషేంద్ర మణి; డా. అవినాష్; డా. కిషోర్; డా. రాఘవేందేర్, డా. జి. అంబేద్కర్ అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.