“హైడ్రా పేరుతో ప్రభుత్వం సెలెక్టెడ్ దాడులు చేస్తున్నది”

హైదరాబాద్ : హైడ్రా పేరుతో ప్రభుత్వం సెలెక్టెడ్ దాడులు చేస్తున్నది. పాలమూరులో పేదల ఇండ్లు కూల్చివేత, హైడ్రా పేరుతో ప్రభుత్వ చర్యలపై ఒక ప్రకటనలో విమర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బయటకు అక్రమ నిర్మాణాలన్నీ కూల్చుతాం అని చెబుతున్నా తీసుకుంటున్న చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి

హైడ్రా కార్యాలయమే అలుగులో ఉందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ పార్క్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్నాయి. ఏవి సరిదిద్దగలం? ఏవి సరిదిద్దలేం? అన్న విచక్షణ లేకుండా తీసుకుంటున్న ప్రభుత్వ చర్యల మూలంగా ప్రజలు బాధితులు అవుతున్నారు. పాలమూరులో 75 మంది దివ్యాంగులు, దళితులైన పేదల ఇండ్లు కూల్చడం దుర్మార్గం. ఇండ్ల కూల్చివేతలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాను ప్రభుత్వం పాటించలేదు.

రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి హామీ ఇచ్చారు. 9 నెలలైనా రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు .. పాలమూరులో పేదల ఇండ్లు కూల్చేశారు. ఆ నిర్మాణాలు అక్రమం అయితే వారికి ప్రత్యామ్నాయం చూయించకుండా ఎలా కూలుస్తారు? కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నదానికి పూర్తి విరుద్దంగా ఉంది.

Also Read-

రైతుభరోసా రూ.15 వేలు అన్నారు .. రైతుబంధు రూ.10 వేలకే దిక్కులేదు. రూ. 4 వేల ఆసరా ఫించన్ అన్నారు. రూ.2 వేల ఫించన్లకే దిక్కులేదు. గురుకులాల విద్యార్థులే కాదు.. గురుకులాల ఉపాధ్యాయులు కూడా నేడు రోడ్డెక్కారు. రాష్ట్రంలో 9 ఏండ్లుగా లేని ఉద్యోగుల జేఏసీ కాంగ్రెస్ 9 నెలల పాలనలో ఏర్పడింది. అందరికీ రుణమాఫీ అని కొందరికే చేయడంతో రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కారు.

ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని ఓట్లు దండకుని నిరుద్యోగులు, విద్యార్థులకు టోకరా పెట్టారు. రేవంత్ ప్రభుత్వ 9 నెలల పాలన చూస్తుంటే పనిగట్టుకుని సొంత పార్టీని ముంచే ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎవరికి ఏ కారణం చేత వచ్చినా దానిని నిలబెట్టుకోవడానికి నానా ప్రయత్నాలు, అధ్యయనాలు చేసి తెలుసుకుంటారు.

కానీ 9 నెలల పాలనలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే దేనికి సంకేతమో అర్ధం కావడం లేదు. ప్రజలను బాధితులను చేయడానికి పాలకులు ఉండరు కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల మూలంగా ప్రజల విశ్వాసం కోల్పోవడమే కాకుండా త్వరలోనే ఈ ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. పాలమూరులో పేదల ఇండ్లు కూల్చివేత, హైడ్రా పేరుతో ప్రభుత్వ చర్యలపై విమర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X