हैदराबाद: आंध्र प्रदेश के दिवंगत मुख्यमंत्री वाईएस राजशेखर रेड्डी की 75वीं जयंती विजयवाड़ा में भव्य रूप से मनाई गई। एपी कांग्रेस अध्यक्ष शर्मिला के तत्वावधान में आयोजित इस समारोह में तेलंगाना के सीएम रेवंत रेड्डी और डिप्टी सीएम भट्टी विक्रमार्क ने मुख्य अतिथि के रूप में भाग लिया। इस पृष्ठभूमि में, सीएम रेवंत रेड्डी ने शर्मिला के बारे में दिलचस्प टिप्पणी की। उन्होंने कहा कि शर्मिला 2029 में एपी की सीएम बनेंगी और राहुल गांधी प्रधानमंत्री बनेंगे।
रेवंत रेड्डी ने आगे कहा कि आंध्र प्रदेश में इस वक्त बीजेपी सत्ता में है और बीजेपी का मतलब बाबू, जगन और पवन। उन्होंने कहा कि चंद्रबाबू, जगन, पवन ये तीनों मोदी के पक्ष में हैं और शर्मिला अकेली हैं जो लोगों के लिए लड़ेंगी। रेवंत रेड्डी ने कहा कि कडपा में उपचुनाव आ रहे हैं और मैं कडपा में घूमने की जिम्मेदारी लूंगा। रेवंत रेड्डी ने कहा कि जो लोग वाईएस के नाम पर व्यापार करते हैं वे उत्तराधिकारी नहीं हैं, बल्कि जो लोग लोगों के लिए लड़ते हैं वे वाईएस के उत्तराधिकारी हैं।
यह भी पढ़ें-
2029లో షర్మిల ఏపీ సీఎం అవుతుంది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి విజయవాడలో ఘనంగా జరిగాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ షర్మిలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.2029లో షర్మిల ఏపీ సీఎం అవుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అన్నారు.
ఏపీలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉందని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు. చంద్రబాబు, జగన్, పవన్.. మోదీ పక్షమే అని, ప్రజల పక్షాన పోరాడబోయేది షర్మిల మాత్రమే అని అన్నారు. కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని వార్తలొస్తున్నాయి, కడపలో ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు రేవంత్ రెడ్డి. వైఎస్ పేరుతో వ్యాపారం చేసేవాళ్లు వారసులు కాదు, ప్రజల కోసం పోరాడేవాళ్లే వైఎస్ వారసులని అన్నారు రేవంత్ రెడ్డి. (ఏజెన్సీలు)