हार गये तो हमें क्या, वादा तो पूरा करना ही होगा, एक लाख रुपये योजना के लिए कांग्रेस दफ्तर के सामने महिलाओं की कतार

हैदराबाद : मालूम हो कि कांग्रेस ने भारत गठबंधन के जीतने पर गरीबी रेखा से नीचे रहने वाले हर परिवार की एक महिला के खाते में हर साल 1 लाख रुपये जमा करने का वादा किया। हालाँकि, उत्तर प्रदेश में महिला मतदाताओं की मांग है कि भले ही इंडिया गठबंधन हार जाए, लेकिन चुनावी वादे के मुताबिक उन्हें हर साल एक लाख रुपये दिए जाने चाहिए।

मंगलवार को जारी नतीजों में उत्तर प्रदेश में सहयोगी समाजवादी पार्टी ने 37 सीटें और कांग्रेस ने 6 सीटें जीतीं है। यूपी में बीजेपी को भारत गठबंधन से कम सीटें मिलीं, हालांकि केंद्र में एनडीए को 293 सीटें मिलीं और बीजेपी दोबारा सत्ता संभालेगी।

इसी क्रम में बुधवार को सुबह कई महिलाएं लखनऊ में कांग्रेस पार्टी कार्यालय के सामने कतार में खड़ी हो गईं और चुनाव प्रचार के दौरान किए गए वादे ‘गारंटी कार्ड’ दिए जाने की मांग करने लगीं। जिन लोगों को पहले से ही गारंटी कार्ड मिल गया है, वे अपने खाते में एक लाख रुपये जमा करने के लिए पार्टी कार्यालय में फॉर्म जमा कर रहे हैं। साथ ही कह रहे है कि हमने तो हमारे उम्मीदवार को विजयी किये हैं।

यह भी पढ़ें-

इससे जुड़ी तस्वीरें और वीडियो सोशल मीडिया पर वायरल हो गए हैं। यह जानकार लोग इस बात पर चर्चा कर रहे हैं कि भले ही भारत गठबंधन सत्ता में नहीं आता है, फिर भी उनसे अपने वादे पूरे करने के लिए कहने का क्या मतलब है?

ఓడితే మాకేం, హామీ నెరవేర్చాల్సిందే, లక్ష స్కీమ్ కోసం కాంగ్రెస్ ఆఫీస్ వద్ద మహిళల క్యూ

హైదరాబాద్ : ఇండియా కూటమి గెలిస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబంలోని ఒక మహిళ ఖాతాలో ఏడాదికి 1లక్ష చొప్పున నగదు జమ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇండియా కూటమి ఓడినా ఎన్నికల హామీ మేరకు ఏడాదికి లక్ష ఇవ్వాల్సిందేనని యూపీలో మహిళా ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.

నిన్న వెలువడిన ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షాలైన సమాజ్‌వాది పార్టీ 37, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచాయి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఇండియా కూటమి కంటే తక్కువ సీట్లు వచ్చినా కేంద్రంలో ఎన్డీయేకు 293 సీట్లు రావడంతో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టునుంది.

ఈ క్రమంలో ఇవాళ ఉదయం పలువురు మహిళలు లక్నోలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు క్యూలో నిలబడి ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన ‘గ్యారంటీ కార్డులు’ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్యారెంటీ కార్డులు పొందిన కొంతమంది తమ ఖాతాల్లో లక్ష జమ చేయాలని ఆ ఫామ్‌లను పార్టీ కార్యాలయంలో సమర్పిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఇండియా కూటమి అధికారంలోకి రాకపోయినా హామీలు నెరవేర్చాలని అడగటం ఏంటని ఈ సంగతి తెలిసిన వారు చర్చించుకుంటున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X