हैदराबाद : आपको हैदराबाद महानगर की सड़कों पर जहां भी नजर दौड़ाएंगे तो आपको बड़े-बड़े शॉपिंग मॉल, चमचमाती दुकानें, आकर्षक रेस्तरां और होटल दिखाई देते हैं। इन सब से प्रतिस्पर्धा करते हुए, फुटपाथ पर, गलियों में, फ्लाईओवर के नीचे, जहां कहीं भी छोटी सी जगह मिलती है, सड़क के किनारों पर दुकानें भी दिखाई देती हैं। इस तरह फुटपाथ पर दुकानें लगाने वालों को किराया देने की जरूरत नहीं होती है। रखरखाव की आवश्यकता जिम्मेदारी नहीं होती है।
इस तरह की गई कमाई का पैसा सीधे उनकी जेब में चला जाता है। हालांकि, सड़कों के किनारे स्थापित इन फुटपाथी दुकानों के कारण वाहन चालकों और पैदल चलने वालों को परेशानी होती है। इसके चलते ट्रैफिक पुलिस और जीएचएमसी अधिकारी समय-समय पर उन पर चाबुक चलाते रहते हैं। फिर भी उनकी आजीविका वहीं है, इसलिए वे वापस वहीं आ जाते हैं और व्यापार करते रहते हैं।
इन सड़कों के किनारों पर स्थापित दुकानों में मुख्य रूप से फलों की गाड़ियां, पान की दुकानें, खाद्य स्टाल, गप चुप गाड़ियां और कुछ क्षेत्रों में सस्ते कपड़े, गहने और बैग बेचने वाली विभिन्न दुकानें शामिल हैं। जीएचएमसी अधिकारी उन दुकानों को बेरहमी से हटा देते हैं यदि उन्हें लगता है कि वे मोटर चालकों और पैदल चलने वालों के लिए परेशानी पैदा कर रहे हैं।
वे सामान को उठा लेते हैं और जीएचएमसी की गाड़ियों में रखकर ले जाते हैं। लेकिन वे फिर अधिकारियों के पास जाते और आग्रह करते है आगे किसी को परेशानी नहीं करेंगे और अपना सामान लेकर आ जाते है। लेकिन इस समय एक स्ट्रीट व्यापारी द्वारा जीएचएमसी स्टाफ पर लाठी-डंडों और पत्थरों से किया गयाअंधाधुंध हमला चर्चा का विषय बन गया है।
स्थानीय लोगों ने जीएचएमसी को ऑनलाइन शिकायत की है कि कुछ लोग राजेंद्रनगर सर्कल के सुलेमान नगर डिवीजन के मुख्य सड़क के पिलर नंबर 207 के पास फुटपाथ पर नारियल बोंडा का व्यापार कर रहे हैं। इससे उन्हें परेशानी हो रही है। मिली शिकायत के बाद मैदान में उतरे नगर निगम के टाउन प्लानिंग ऑफिसर और इंफोर्समेंट ऑफिसर ने फुटपाथ से अतिक्रमण हटाने का आदेश दिया है।
मैदान में आए कर्मचारियों ने नारियल बोंडा को जीएचएमसी की गाड़ी में नारियल बोंडा डाल दी। इससे गुस्साए दुकानदारों ने नगर निगम कर्मियों पर पत्थरों और लाठियों से हमला कर दिया। इसके चलते जीएचएमसी स्टाफ ने राजेंद्र नगर थाने में हमलावरों के खिलाफ शिकायत दर्ज कराई। उनकी शिकायत पर पुलिस ने तीन हमलावरों के खिलाफ मामला दर्ज कर उन्हें गिरफ्तार कर लिया है। आगे की कार्रवाई की जा रही है।
కొబ్బరి బోండాలను తీసుకెళ్లింది జీహెచ్ఎంసీ సిబ్బంది, కర్రలు-రాళ్లతో వ్యాపారుల దాడి , కేసు నమోదు, ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్ : మహానగరం రోడ్ల వెంట వెళ్తుంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మిరుమిట్లుగొలిపే దుకాణాలు, ఆకర్షించేలా రెస్టారెంట్లు, హోటళ్లు దర్శనమిస్తాయి. వీటన్నింటితో పోటీ పడుతూ రోడ్డు పక్కన ఫుట్ పాత్లపై, గల్లీల్లో రోడ్ల పక్కన, ఫైఓవర్ల కింద ఇలా ఎక్కడ చిన్న స్థలం ఉన్నా అక్కడ స్ట్రీట్ షాపులు కూడా కన్పిస్తుంటాయి.
ఇలా ఫుట్ షాత్ల మీద దుకాణాలు పెట్టటం వల్ల కిరాయిలు కట్టటం కానీ వాటికి మెయిన్టెనెన్స్ ఉండకపోవటంతో వచ్చిన పదో పరకో డైరెక్టుగా తమ జేబులోకి చేరుతుంది. అయితే రోడ్ల వెంట పెట్టే ఈ స్ట్రీట్ షాపుల వల్ల వాహనదారులకు గానీ, నడకదారులకు గానీ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇందుకు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు వాళ్లపై ఎప్పటికప్పుడు కొరఢా ఝళిపిస్తూనే ఉంటారు. కానీ వాళ్ల బతుకుదెరువు అక్కడే కావటంతో మళ్లీ అక్కడికే వచ్చి వ్యాపారం సాగిస్తుంటారు.
ఈ రోడ్లపై పెట్టే దుకాణాల్లో ప్రధానంగా పండ్ల బండ్లు, పాన్ షాపులు, భోజనం స్టాల్స్, గప్ చుప్ బండ్లతో పాటు కొన్ని ప్రాంతాల్లో చవకగా అమ్మే బట్టలు, నగలు, బ్యాగులు ఇలా రకరకాల షాపులు వెలుస్తుంటాయి. కాగా వాహనదారులకు, నడకదారులకు ఇబ్బంది కలుగుతుందని భావిస్తే ఆ దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు నిర్ధాక్షిణ్యంగా తొలిగిస్తుంటారు. సరుకును తీసి జీహెచ్ఎంసీకి సంబంధించిన బండ్లలో వేసుకుని తీసుకెళ్లిపోతుంటారు.
అయితే అధికారులను బతిమాలో బామాలో, ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని చెప్పో మళ్లీ తెచ్చుకుంటారు. కానీ ఓ చిరువ్యాపారి మాత్రం జీహెచ్ఎంసీ సిబ్బందిపైకి కర్రలు రాళ్లతో విచక్షణారహితంగా దాడికి తెగబడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రాజేంద్రనగర్ సర్కిల్ సులేమాన్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి పిల్లర్ నెంబర్ 207 దగ్గర ఫుట్ పాత్ మీద కొందరు కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నారని స్థానికులు జీహెచ్ఎంసీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఫుట్ ఫాత్ మీద ఆక్రమణలు తొలగింపజేయాలని ఆదేశాలు ఇచ్చారు.
రంగంలోకి దిగిన సిబ్బంది కొబ్బరి బోండాలను రోడ్డుపై నిలిపిన బండిని జీహెచ్ఎంసీ వాహనంలో వేస్తూండగా కోపోద్రిక్తులైన చిరువ్యాపారులు మున్సిపల్ కార్మికులపై రాళ్లతో కర్రలతో దాడికి దిగారు. దీంతో దాడి చేసిన వారిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో దాడి చేసిన ముగురుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (ఏజెన్సీలు)