हैदराबाद : सोना प्रेमियों के लिए यह एक बड़ा झटका है। सोने की कीमतें फिर बढ़ रही हैं। अभी हालात सोने की कीमत कम होते नहीं दिख रहे हैं। सोने की कीमतें पहले से ही सर्वकालिक उच्चतम स्तर पर कारोबार कर रही हैं। मालूम हो कि हाल ही में अमेरिकी फेडरल रिजर्व ने लगातार पांचवीं बार ब्याज दरों को अपरिवर्तित रखने का फैसला किया है। फेड चेयरमैन जेरोम पॉवेल ने संकेत दिया है कि इस साल ब्याज दरों में कम से कम 3 बार कटौती की जाएगी। इस एक वजह से सोने का रेट बढ़ रहा है।
निवेशक डॉलर और बॉन्ड यील्ड को छोड़कर सोने में निवेश करने के इच्छुक हैं। यह अब एक सुरक्षित निवेश उपकरण बन गया है। देखा जा सकता है कि फेड की घोषणा के साथ ही एक दिन में सोने के दाम रिकॉर्ड स्तर पर 1000 रुपये से ज्यादा बढ़ गए है। इसके बाद लगातार 5 दिनों तक सोने का रेट नहीं बढ़ा और घट गया है। इसके साथ ही सोने की कीमत में लगातार दूसरे दिन फिर तेजी आई। आइए अब देखते हैं कि सोने और चांदी के रेट कहां पर कैसे हैं।
अंतरराष्ट्रीय बाजार में सोने के दाम एक बार फिर बढ़ गए हैं। एक दिन में यह रिकॉर्ड स्तर पर पहुंच गया है। फिलहाल स्पॉट सोने का भाव 22234 डॉलर प्रति औंस के स्तर पर जारी है। वहीं चांदी का स्पॉट भाव 24.99 डॉलर पर है। डॉलर के मुकाबले रुपये की विनिमय दर फिलहाल 83.378 पर है।
अंतरराष्ट्रीय स्तर पर दरें बढ़ने के साथ ही घरेलू स्तर पर भी यही रुख देखने को मिला। फिलहाल, हैदराबाद शहर में सोने की कीमत में तेजी आई है। 22 कैरेट सोने का रेट 350 बढ़कर अब 61,700 रुपये पर पहुंच गया है। यहां तक कि पिछले दिन भी 200 रुपये की वृद्धि हुई है। वहीं 24 कैरेट सोने का रेट 380 प्रति 10 ग्राम बढ़कर 67,310 रुपये पर पहुंच गया है। हैदराबाद की तुलना में दिल्ली में सोने का रेट थोड़ा ज्यादा है। यहां 22 कैरेट पर 10 ग्राम सोने का रेट 350 रुपये बढ़कर 61,850 रुपये हो गया है, जबकि दूसरी ओर 24 कैरेट सर्राफा की कीमत में 380 की बढ़ोतरी हुई और यह फिलहाल 67,460 रुपये जारी है।
सोने की कीमतों के अनुरूप चांदी की दरें भी बढ़ीं हैं। फिलहाल दिल्ली में चांदी का रेट 300 बढ़कर 77,500 रुपये के स्तर पर है। वहीं, हैदराबाद में देखा जाए तो यहां भी यह 300 रुपये तक बढ़ गया है और फिलहाल 80,500 रुपये प्रति किलोग्राम पर है।
చుక్కలు చూపిస్తున్న బంగారం ధర
హైదరాబాద్ : పసిడి ప్రియులకు షాక్. బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాల స్థాయిల్లో బంగారం ధరలు ట్రేడవుతున్నాయి. ఇటీవల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా ఐదోసారి సమీక్షలో కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ ఏడాదిలో కనీసం 3 సార్లు అయినావడ్డీ రేట్లు తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చారు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్. ఈ ఒక్క కారణంతో బంగారం రేటు పెరుగుతూ వస్తోంది.
పెట్టుబడిదారులు డాలర్, బాండ్ ఈల్డ్స్‌ను వదిలి బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే ఇప్పుడు సురక్షిత పెట్టుబడి సాధనంగా మారింది. ఫెడ్ ప్రకటనతో ఒక్కరోజే రికార్డు స్థాయిలో బంగారం రేటు 1000 కి పైగా పెరగడం గమనించొచ్చు. తర్వాత మాత్రం వరుసగా 5 రోజుల వరకు బంగారం రేటు పెరగకపోగా తగ్గింది. దీంతో ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ వరుసగా రెండో రోజు బంగారం రేటు పుంజుకుంది. ఇప్పుడు ఎక్కడ బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇంటర్నేషనల్ మార్కెట్లో తాజాగా గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. ప్రస్తుతం స్పాట్ బంగారం ధర ఔన్సుకు అక్కడ 22234 డాలర్ల లెవెల్స్‌లో కొనసాగుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ ధర చూస్తే 24.99 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 83.378 వద్ద ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో రేట్లు పెరిగిన తరుణంలోనే దేశీయంగా కూడా ఇదే ధోరణి కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో బంగారం ధర పుంజుకుంది. 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు తాజాగా 350 పెరిగి తులానికి ప్రస్తుతం 61,700 వద్ద ఉంది. అంతకుముందు రోజు కూడా. 200 చొప్పున పెరిగింది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములపై 380 ఎగబాకి 67,310 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే ఢిల్లీలో బంగారం రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 10 గ్రాముల పసిడి రేటు 22 క్యారెట్లపై 350 పెరిగి రూ. 61,850 వద్ద ఉండగా మరోవైపు 24 క్యారెట్స్ పుత్తడి ధర 380 పెరిగి ప్రస్తుతం 67,460 మార్కు వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పుంజుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు 300 పెరిగి ప్రస్తుతం 77,500 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో చూసినట్లయితే ఇక్కడ కూడా 300 పెరిగి ప్రస్తుతం కేజీకి 80,500 వద్ద ఉంది. (ఏజెన్సీలు)