हैदराबाद: दिल्ली शराब घोटाला मामले में दिलचस्प तथ्य सामने आ रहे हैं। ईडी के अधिकारियों ने पहले ही इस मामले की जांच तेज कर दी है और कविता को गिरफ्तार कर लिया है। इसके बाद में कविता को दिल्ली ले गये और शनिवार को अदालत में पेश किया। दोनों पक्षों की दलीलें सुनने के बाद कोर्ट ने कविता को एक हफ्ते के लिए ईडी की हिरासत में भेज दिया। कविता की हिरासत की मांग को लेकर ईडी की ओर से दायर याचिका में कई प्रमुख बिंदुओं का जिक्र किया है। अधिकारियों ने आरोप लगाया कि दिल्ली शराब घोटाले में कविता की अहम भूमिका रही है। कविता ने शराब घोटाला मामले में फंस जाने के डर से मुख्य सबूत नष्ट कर दिये। इससे संबंधित साक्ष्य\सबूत न्यायालय को सौंप दिये।
ईडी ने अपनी हिरासत याचिका में इस बात का जिक्र किया है कि कविता ने इस पूरे घोटाले में अन्य लोगों के साथ मिलकर 100 करोड़ रुपये का भ्रष्टाचार करने की साजिश रची है। सभी बैंक लेनदेन कविता ने खुद की है। इंडो स्पिरिट्स को अपने झांसे में रखकर 192.8 करोड़ रुपये अवैध कमाई की है। 2021-22 शराब नीति के कार्यान्वयन में अवैध लाभ प्राप्त करने के लिए सरकारी कर्मचारियों को रिश्वत दी गई। अरुण पिल्लई नामक बेनामी के माध्यम से इंडो स्पिरिट्स में उसकी भागीदार है। ईडी अधिकारियों ने अदालत को बताया कि उसने निवेश के आधार पर अवैध रूप से आय अर्जित करने की कोशिश की है।
संबंधित खबर:
ईडी ने बताया कि वास्तव में कविता ने 100 करोड़ पीओसी बदली में अपने कर्मचारियों और सहयोगियों अभिषेक बोइनपल्ली और बुच्चीबाबू के साथ मिलकर आम आदमी पार्टी के नेताओं को भुगतान किया। इसी तरह, अधिकारियों ने उल्लेख किया कि कविता ने शराब नीति के निर्माण में आंतरिक रूप से भाग लिया। एमएलसी कविता के साथ साउथ ग्रुप के सदस्य शरत रेड्डी और मागुंटा राघव श्रीनिवासुल रेड्डी ने आप के शीर्ष नेताओं के साथ मिलकर साजिश रची है। अपनी हिरासत याचिका में ईडी ने खुलासा किया कि अवैध रूप से 100 करोड़ रुपये तक का भुगतान करने के बदले में उन्हें दिल्ली उत्पाद शुल्क नीति के कार्यान्वयन से अवैध लाभ मिला है।
Delhi Liquor Scam : లిక్కర్ స్కాంలో కవితే ప్రధాన సూత్రధారి, ఈడీ కస్టడీ పిటిషన్లో ఆసక్తికర విషయాలు
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కేసులో కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించి శనివారం కోర్టులో ప్రవేశపెట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు వారం రోజుల రిమాండ్ విధించింది. కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితదే కీలక పాత్ర అని అధికారులు అభియోగం మోపారు. కేసులో ఎక్కడ తాను దొరికిపోతానోనని కీలక ఆధారాలను సైతం నాశనం చేసినట్లుగా గుర్తించామని తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందజేశారు
ఈ మొత్తం స్కాంలో కవిత ఇతర వ్యక్తులతో కలిసి 100 కోట్ల అవినీతికి కుట్ర పన్నినట్లు ఈడీ తన కస్టడీ పిటిషన్లో ప్రస్తావించింది. బ్యాంకు లావాదేవీల్లో కవిత అన్ని తానై వ్యవహరించిందని పేర్కొ్న్నారు. ఇండో స్పిరిట్స్‌ని తన గుప్పిట్లో పెట్టుకుని తద్వారా 192.8 కోట్ల అక్రమంగా డబ్బు ఆర్జించిందని అభియోగం మోపింది. 2021-22 మద్యం పాలసీ అమలులో చట్టవిరుద్ధంగా ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు లంచం కూడా ఇచ్చినట్లుగా తేలింది. అరుణ్ పిళ్లై అనే బినామీ ద్వారా ఇండో స్పిరిట్స్‌లో ఆమె భాగస్వామిగా ఉన్నారు. పెట్టిన పెట్టుబడిని ఆధారంగా చేసుకుని అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించేందకు ఆమె ప్రయత్నించిందంటూ ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.
వాస్తవానికి కవిత 100 కోట్ల పీవోసి బదిలీలో ఆమె సిబ్బంది, సహచరులు అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబుతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు చెల్లించిందని ఈడీ వివరించింది. అదేవిధంగా లిక్కర్ పాలసీ రూపకల్పనలో అంతర్గతంగా కవిత పాల్గొందని అధికారులు ప్రస్తావించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు సౌత్ గ్రూప్‌లోని సభ్యులు శరత్‌రెడ్డి, మాగుంట రాఘవ్ శ్రీనివాసుల రెడ్డి ఆప్ అగ్ర నేతలతో కలిసి కుట్ర పన్నారని పేర్కొంది. అందుకు 100 కోట్లు వరకు అక్రంగా చెల్లించి ప్రతిఫలంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అక్రమంగా లబ్ధి పొందారని ఈడీ తమ కస్టడీ పిటిషన్లో వెల్లడించింది. (ఏజెన్సీలు)