हैदराबाद: पंजागुट्टा ड्रग मामले में सनसनीखेज बातें सामने आ रही हैं। जैसे-जैसे नारकोटिक्स ब्यूरो ड्रग्स के मामले में जांच तेज कर दी है, वैसे-वैसे इसके तार खुलते जा रहे हैं। नारकोटिक्स ब्यूरो की जांच के दौरान ड्रग संदिग्ध स्टैन ली ने महत्वपूर्ण तथ्य बताया है।
टीएस एनएबी अधिकारियों ने जांच में पाया कि ओकरा गिरोह ने गोवा की कोलवेल जेल से स्टेन ली को ड्रग्स की आपूर्ति की थी। कोर्ट की अनुमति से नारकोटिक्स टीम गोवा गयी और जेल में बंद ओकरा समेत फैजल से पूछताछ की है। नारकोटिक्स ब्यूरो ने पाया कि ओकरा और फैज़ल गोवा जेल में बंद रहते हुए सेल फोन के जरिए यूरोपीय देशों से विभिन्न प्रकार का ड्रग्स मुंबई लेकर आते थे और देश भर में आपूर्ति कर रहे थे।
नारकोटिक्स अधिकारियों ने गोवा पुलिस को बताया कि ओकरा और फैजल जेल में सेलफोन का इस्तेमाल कर रहे थे। गोवा की कोलवले जेल में तहकीकात के दौरान पुलिस को 16 सेलफोन मिले हैं। नारकोटिक्स ब्यूरो का मानना है कि अगर ओकरा और फैजल को हैदराबाद लाकर पूछताछ की जाए तो और भी जानकारी सामने आ सकती है।
జైలు నుంచే డ్రగ్స్ దందా, పంజాగుట్ట డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు
హైదరాబాద్ : పంజాగుట్ట డ్రగ్స్ కేసులో ఒక్కోటిగా సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో తీగ లాగే కొద్దీ డొంక కదులుతుంది. నార్కోటిక్ విచారణలో డ్రగ్స్ నిందితుడు స్టాన్ లీ కీలక విషయాలు చెప్పాడు.
గోవా కోల్వలే జైలు నుంచే ఓక్రా ముఠా స్టాన్ లీ కి డ్రగ్స్ సరఫరా చేసినట్టు టిఎస్ న్యాబ్ అధికారులు గుర్తించారు. కోర్టు అనుమతితో గోవాకి వెళ్ళిన నార్కోటిక్స్ బృందం జైలులో ఉన్న ఓక్రాతో పాటు ఫైజల్ ను విచారించింది. ఓక్రా , ఫైజల్ గోవా జైలులో ఉండి సెల్ ఫోన్స్ ద్వారా యూరప్ దేశాల నుంచి వివిధ రకాల డ్రగ్స్ ను ముంబైకి తెచ్చి దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నట్టు నార్కోటిక్స్ బ్యూరో గుర్తించింది.
ఓక్రా, ఫైజల్ ఇద్దరు జైల్లో సెల్ ఫోన్ వాడుతున్నట్టు నార్కోటిక్ అధికారులు గోవా పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోవా కొల్వాలే జైల్లో తనిఖీలు చేసిన పోలీసులు 16 సెల్ ఫోన్లను గుర్తించారు. ఓక్రా , ఫైజల్ ను హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తే మరింత సమాచారం వస్తుందని నార్కోటిక్స్ బ్యూరో భావిస్తుంది. (ఏజెన్సీలు)