हैदराबाद: विश्व हिंदू परिषद और बजरंग दल ने चेतावनी दी है कि वैलेंटाइन डे को हर हाल में रोका जाएगा। विश्व हिंदू परिषद के राष्ट्रीय प्रचारक पगुडाकुला बालास्वामी ने एक बयान में कहा कि विदेशी जहरीली संस्कृति को हटा दिया जाना चाहिए और भारतीय मूल्यों और सांस्कृतिक परंपराओं को संरक्षित किया जाना चाहिए। उन्होंने 14 फरवरी को वैलेंटाइन डे के बहिष्कार करने की लोगों से अपील की है। साथ ही युवाओं को सलाह दी कि वे कॉरपोरेट ताकतों की साजिशों का शिकार न बनें जो अश्लीलता को बढ़ावा दे रही हैं और प्यार के नाम पर विदेशी संस्कृति थोप रही हैं।
प्रत्येक व्यक्ति को राष्ट्रीय भावना अपनाकर देश और धर्म के लिये प्रयत्न करना चाहिये। खासकर 14 फरवरी 2019 को पुलवामा में हुई घटना को आधार बनाते हुए उस दिन वीरतापूर्वक शहीद हुए जवानों की आत्मा की शांति के लिए रैलियां निकाली जाएंगी। उन्होंने कहा, “14 फरवरी वैलेंटाइन डे नहीं है। यह शहीद सुधार दिवस है।” शिव सेना के प्रदेश अध्यक्ष सिंकारू शिवाजी ने कहा कि 14 फरवरी को वैलेंटाइन डे का इस देश से कोई लेना-देना नहीं है। प्रेम के नाम पर गलत कार्य को किसी भी हाल में बर्दाश्त नहीं किया जाएगा।
Valentine’s Day: ప్రేమికులకు బిగ్ అలర్ట్, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బజరంగ్ దళ్, శివసేన
హైదరాబాద్: వాలెంటైన్స్ డేను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ హెచ్చరించింది. విదేశీ విష సంస్కృతిని విడనాడి భారతీయ విలువలు, సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షిద్దామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రేమ పేరుతో అశ్లీలతను పెంపొందించి, విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్న కార్పొరేట్ శక్తుల కుట్రలకు బలికావద్దని యువతకు సూచించారు.
బాలస్వామి మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం పరితపించేలా ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు అలవర్చుకోవాలన్నారు. ముఖ్యంగా 2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఘటన ఆధారంగా ఆ రోజు వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. “ఫిబ్రవరి 14 అనేది ప్రేమికుల రోజు కాదని.. అమరవీరుల సంస్కరణ దినం” అని అభివర్ణించారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమ దోమ అంటే ఒప్పుకోమనీ వాలెంటైన్‌కి ఈ దేశానికి ఎలాంటి సంబంధం లేదని శివసేన రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ అన్నారు. (ఏజెన్సీలు)