हैदराबाद: मालूम हो कि सीएम रेवंत रेड्डी ने शपथ लेने के बाद एक अहम घोषणा की है। उन्होंने कहा कि प्रगति भवन की लोहे की बाड़ तोड़ दी गई है और शुक्रवार सुबह वहां प्रजा दरबार लगाया जाएगा। ज्योति राव फुले ने घोषणा की कि प्रगति भवन का नाम बदलकर प्रजा भवन रखा जाएगा। हाल ही में सीएम प्रजा दरबार में बड़ी संख्या में लोग अपनी समस्याएं बताने पहुंचे। शुक्रवार को सुबह से ही भारी कतार लग गयी। थोड़ी देर पहले सीएम रेवंत रेड्डी वहां पहुंचे। इस अवसर पर लोगों की समस्याएं सुन रहे हैं। लोगों के अनुरोध प्राप्त कर रहे हैं और उनके समाधान का प्रयास कर रहे हैं।
सीएम रेवंत रेड्डी प्रजा भवन पहुंचे। रेवंत रेड्डी अपने वाहन से प्रजादरबार आये। सीएम प्रजा भवन में आयोजित प्रजा दरबार में शामिल होकर एक-एक की समस्याएं सुन रहे हैं और लोगों कीअपीलें स्वीकार कर रहे हैं। प्रजा दरबार में डिप्टी सीएम भट्टी विक्रमार्क शामिल हुए। प्रजा भवन में बड़ी संख्या में लोग शिकायत दर्ज कराने पहुंच रहे हैं। प्रजा दरबार की समाप्ति के बाद 12 बजे सीएम रेवंत रेड्डी सचिवालय जाएंगे। मुख्यमंत्री बिजली क्षेत्र की समीक्षा करेंगे।
సీఎం ప్రజా దర్బార్‌కు పోటెత్తిన ప్రజలు
హైదరాబాద్: ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని శుక్రవారం ఉదయం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా సీఎం ప్రజా దర్బార్‌లో సమస్యలు చెప్పుకునేందుకు భారీగా అక్కడకు ప్రజలు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే నుంచి భారీగా క్యూ కట్టారు. కొద్ది సేపటి క్రితమే అక్కడకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు విని, వినతులు స్వీకరించి, పరిష్కారానికి కృషి చేయనున్నారు.
సొంత వాహనంలోనే రేవంత్ రెడ్డి
ప్రజాభవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సొంత వాహనంలోనే ప్రజాదర్బార్‌కు రేవంత్ రెడ్డి వచ్చారు. ప్రజా భవన్లో నిర్వహించే ప్రజాదర్బార్‌లో సీఎం పాల్గొని ఒక్కొక్కరి సమస్యలు వింటూ విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. ప్రజాదర్బార్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజాభవన్‌కు భారీగా ప్రజలు వచ్చారు. ప్రజాదర్బార్ ముగిసిన తర్వాత 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంకు వెళ్లనున్నారు. విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. (ఏజెన్సీలు)