हैदराबाद: मालूम हो कि तेलंगाना में विधानसभा चुनाव का शेड्यूल जारी हो गया है। शेड्यूल 9 अक्टूबर को जारी किया गया और उसी दिन से चुनाव संहिता लागू हो गई। राज्य में चुनाव के दौरान धन के भारी प्रवाह को देखते हुए पुलिस सख्त कदम उठा रही है।
जगह-जगह चेक पोस्ट बनाए जा रहे हैं और सभी वाहनों की सघन जांच की जा रही है। जो लोग 50 हजार से अधिक नकदी लेकर चल रहे हैं, उनके पास उचित सबूत नहीं होने पर वे पैसा जब्त कर रहे हैं। कहा जा रहा है कि राज्य भर में अब तक करीब 75 करोड़ रुपये की नकदी जब्त की जा चुकी है। इसके अलावा अवैध शराब, सोना और चांदी भी जब्त करने में पुलिस काफी सख्ती बरत रही है।
लेकिन इस प्रक्रिया में अगर कुछ लोग अनजाने में भी पैसे ले रहे हैं, तो कई बार उनके पास सारे दस्तावेज होने के बाद भी अगर कोई संदेह होता है, तो पुलिस ऐसे लोगों के खिलाफ भी कार्रवाई कर रही है। मालूम हो कि हैदराबाद शहर में बड़े पैमाने पर पैसा पकड़ा जा रहा है।
इसी बीच वाइन शॉप एसोसिएशन के प्रतिनिधि नागुला प्रभाकर ने कहा कि इसमें शराब की बिक्री और वाइन दुकानों से जुड़ा पैसा भी शामिल है। प्रभाकर ने बताया कि शराब की दुकानों और बार के बिक्री काउंटरों को बैंकों में जमा करने के लिए ले जाते समय पुलिस अनुचित तरीके से जब्त कर रही है।
प्रभाकर का आरोप है कि 12 से 16 अक्टूबर के बीच महज 5 दिनों के अंतराल में 56 शराब दुकानों का पैसा पुलिस ने गलत तरीके से जब्त कर लिया। आरोप है कि दुकान के लाइसेंस के कागजात और कर्मचारियों की डिटेल दिखाने के बाद भी पुलिस कैश जब्त कर रही है। प्रभाकर ने कहा कि उन्होंने राज्य के मुख्य निर्वाचन अधिकारी से भी शिकायत दर्ज करायी है।
इतना ही नहीं, प्रभाकर ने आरोप लगाया कि कुछ पुलिसकर्मी मुफ्ती में आते हैं और शराब की दुकानों के पास हंगामा कर रहे हैं। उन्होंने चेतावनी दी कि अगर पुलिस इसी तरह अन्यायपूर्वक रकम जब्त करती रही तो वे तेलंगाना में चुनाव होने तक शराब की दुकानें बंद कर देंगे।
प्रभाकर ने चेतावनी दी कि यदि कर्मचारियों का विवरण और दुकान के लाइसेंस के कागजात दिखाए जाएं तो भी पैसा जब्त होने पर दुकानें बंद कर देना ही बेहतर है। उन्होंने चिंता व्यक्त की कि उन्हें चोरों के रूप में देखा जाता है जो सरकार को हजारों करोड़ का टर्नओवर देते हैं।
మద్యం విక్రయాలు నిలిపివేయాలని వైన్ షాపుల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 9న షెడ్యూల్ విడుదల కాగా ఆరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల వేళ ధన ప్రవాహం ఎక్కువగా ఉండనుందన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 50 వేల కంటే ఎక్కువ నగదు క్యారీ చేస్తున్న వారి దగ్గర సరైన ఆధారాలు లేని పక్షంలో డబ్బును సీచ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75 కోట్ల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అక్రమ మద్యం, బంగారం, వెండి ఇలా దేన్నీ వదలకుండా పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ క్రమంలో కొందరు తెలియక డబ్బులు తీసుకెళ్తున్న వారు కూడా నష్టపోతుంటే ఇంకొన్ని సార్లు అన్ని పత్రాలు ఉన్నా అనుమానం వస్తే చాలు అలాంటి వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతున్న విషయం తెలిసిందే.
అయితే అందులో లిక్కర్ సేల్స్, వైన్ షాపులకు సంబంధించిన డబ్బు కూడా ఉంటుందని వైన్స్ షాప్ అసోసియేషన్ ప్రతినిధి నాగుల ప్రభాకర్ వాపోతున్నారు. మద్యం దుకాణాలు, బార్లలోని సేల్స్ కౌంటర్‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్న క్రమంలో పోలీసులు అన్యాయంగా సీజ్ చేస్తున్నట్లు ప్రభాకర్ వివరించారు.
అక్టోబర్ 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కేవలం 5 రోజుల గ్యాప్‌లోనే 56 వైన్ షాపులకు సంబంధించిన డబ్బును పోలీసులు అన్యాయంగా సీజ్ చేసినట్లు ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. ఉద్యోగి వివరాలతో పాటు దుకాణానికి సంబంధించిన లైసెన్స్ పేపర్లు చూపించినా కూడా పోలీసులు వదలిపెట్టకుండా నగదు సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు కూడా చేసినట్టు ప్రభాకర్ తెలిపారు.
అంతే కాదు కొందరు పోలీసులు మఫ్టీల్లో వచ్చి మద్యం దుకాణాల దగ్గర దౌర్జన్యం చేస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. పోలీసులు ఇలాగే దౌర్జన్యం చేస్తూ అన్యాయంగా డబ్బులు సీజ్ చేస్తుంటే తెలంగాణలో ఎన్నికలు అయ్యే వరకు మద్యం దుకాణాలని మూసేస్తామని హెచ్చరించారు.
ఉద్యోగి డిటేయిల్స్, దుకాణానికి చెందిన లైసెన్స్ పేపర్లు చూపించినా డబ్బులు సీజ్ చేస్తామంటే దుకాణాలు మూసేసుకోవటమే మంచిదని ప్రభాకర్ హెచ్చరించారు. ప్రభుత్వానికి వేల కోట్ల టర్నోవర్ ఇచ్చే తమను దొంగలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (ఏజెన్సీలు)