MLC Kalvakuntla Kavitha To Address The Central Hall, Westminster

MLC Kavitha to address 200+ gender equality advocates, UK policy makers, civil society organisations and Indian Diaspora in London on her journey with the Women’s Reservation Bill

Hyderabad: MLC and Former Member of Parliament Kalvakuntla Kavitha will be in London as a keynote speaker at the Bridge India Think tank event on October 6,2023. The event will be held in Central Hall, Westminister in presence of 200+ gender equality advocates, UK policy makers, community organisations and the Indian diaspora.

MLC Kavitha will be speaking about her journey with the Women’s Reservation Bill. Bridge India Think tank invites MLC Kavitha, as one of the leading advocates for greater female participation in the democratic and political process in India.

Former Member of Parliament will be in London addressing massive audience after the success of her advocacy towards the Women’s Reservation Bill.

——————————–

కల్వకుంట్ల కవితకు లండన్ కు చెందిన బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం

రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, మహిళా రిజర్వేషన్లపై కీలకోపన్యాసం చేయడానికి ఆహ్వానం

హైదరాబాద్ : రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పై లండన్ లో ఏర్పాటు చెయ్యబోయే సమావేశంలో కీలకోపన్యాసం చేయవలసిందిగా పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది.

పార్లమెంటు పాస్ చేసిన మహిళ రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసిన సందర్భంగా లండన్ లో అక్టోబర్ 6న ఒక సమావేశాన్ని ఏర్పటు చేస్తున్నామని ఆహ్వాన పత్రంలో పేర్కొంది.

రాజకీయాల్లో, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి కవిత విశేషంగా కృషి చేశారని ఆ సంస్థ ప్రశంసించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అనేక ఆందోళన కార్యక్రమాలను చేపట్టారని, వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారని వివరించింది. ఇలా పలు రకాల కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా మహిళా బిల్లు పై చర్చను రేకెత్తించారని పేర్కొంది.

జంతర్ మంతర్ లో దాదాపు 6000 మందితో ధర్నా నిర్వహించారని, ఈ ధర్నా కార్యక్రమానికి 18 పార్టీల నేతలు హాజరైన మద్దతు ప్రకటించారని తెలిపింది. మహిళా రిజర్వేషన్ల ఆవశ్యకతపై ఢిల్లీలో భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 13 రాజకీయ పార్టీలతో పాటు మహిళా, విద్యార్థి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారని గుర్తు చేసింది.

——————————-

సిద్దిపేట్ జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫామ్ కర్మగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ:

తెలంగాణ రాకపోతే ఈరోజు సిద్దిపేట జిల్లాకి ఆయిల్ ఫామ్ కర్మాగారం వచ్చేదా. ఈ ప్రాంత రైతులకు శుభదినం. 300 కోట్ల రూపాయలతో ప్రారంభించబోతున్న ఈ కర్మాగారం ఇక్కడి ప్రాంత రైతుల ఆర్థిక పరిస్థితిని మార్చబోతుంది. హరిత విప్లవ సృష్టికర్త డాక్టర్ స్వామినాథన్ గారి అంత్యక్రియలకి ఈరోజు చెన్నైలో హాజరైనందుకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రాలేకపోయారు. వారి తరఫున మనందరికీ శుభాకాంక్షలు తెలియజేయమన్నారు.

ఆయిల్ పామ్ సాగు కోసం ప్రభుత్వం రైతులను మరింత చైతన్యపరిచే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి ఆయిల్ ఫెడ్ వారి ఆధ్వర్యంలో సాగుకు సంబంధించి ఒక డైరీ ప్రతి రైతుకు అందిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి రైతులతో శిక్షణ కార్యక్రమాలు రైతుల తోటలోనే నిర్వహించాలి. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కష్టపడి కాలేశ్వరం కట్టుకున్నాం. 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం. కానీ సాంప్రదాయ పంటల వల్ల రైతులు నష్టపోతున్నారు.

ఆయిల్ పామ్ సాగుబడి ప్రభుత్వ ఉద్యోగం లాగా నెలనెలా ఆదాయం. రైతుకు లాభసాటిగా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలోచన చేశారు. ఒక సంవత్సరం లక్షా 56 వేల కోట్ల రూపాయల విలువైన మంచి నూనెను ఇతర దేశాల నుంచి భారత దేశం దిగుమతి చేసుకుంటుంది. ఒక మనిషి ఏడాదికి 19 కిలోల మంచి నూనెను వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. 40 శాతం మాత్రమే మన భారతదేశంలో సాగవుతే 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

బ్రెజిల్ నుంచో మలేషియా నుంచో ఇండోనేషియా నుంచో మంచి నూనె వస్తే తప్ప మన దగ్గర వంట చేసుకుని పరిస్థితి లేదు. మనల్ని పరిపాలించిన పాలకులకు దూరదృష్టి, ముందుచూపు లేక దేశం ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. దేశంలో 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతే తప్ప ఈ పరిస్థితిని అధిగమించలేము. కాబట్టి 20 లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ తోటలు వేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆయిల్ పామ్ తో పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చు.

ఆయిల్ పామ్ సాగు అన్నదాతలకు అభయహస్తం. రైతులందరూ పెద్ద ఎత్తున సాగు చేయాలని కోరుకుంటున్నాం. ఇగ కొందరు అంటారు తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని. తెలంగాణ వచ్చింది కాబట్టే కాలేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం కాలేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాము కాబట్టి గాలిలో తేమశాతం పెరిగి ఈరోజు ఇక్కడ పామాయిల్ సాగు చేయగలుగుతున్నాం. చుట్టూ రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్, పోచమ్మ రిజర్వాయర్, చెక్ డ్యాములు, చెరువులు నిండుగా ఉండడం వల్ల ఇది సాధ్యం అయింది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు ఇచ్చి రైతులను ఆత్మహత్యలపాలు చేశారు గత పాలకులు.

కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల గౌరవం పెంచిండు రైతుల ఆదాయం పెంచిండు రైతుల భూమి విలువ కూడా పెరిగేలా చేశారు. ఉమ్మడి పరిపాలనలో వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతంలోనే అత్యధిక భూమి రేట్లు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబును ఈ వయసులో అరెస్ట్ చేయడం మంచి విషయం కాదు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులకు కనబడదు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంటు తెలంగాణలో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత కరంట్ అని ఉత్త కరెంటుగా మార్చారు.

ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో గాలిలో దీపం లాగా కరెంటు ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు కడుపునిండా కరెంటు ఇచ్చిండు. రాష్ట్రంలో 24 లక్షల పంప్ సెట్లు నడుస్తున్నాయి. కరెంటు కోసం పైరవీల్లేవు పంచాయితీలు లెవు. దేశంలో కాంగ్రెస్ బిజెపి పాలిస్తున్న రాష్ట్రాల్లో 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారా చెప్పండి. రైతులకు ఉచిత కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు. కరెంటు లేక నీళ్లు లేక తెలంగాణలో ఏ మూలకైనా ఒక గుంటనైనా ఎండిందా చూపీయండి.

గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో రాజశేఖర్ రెడ్డి పాలనలో తీవ్రమైన కరువు ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 9 ఏళ్ళ పాలనలో కరువు లేదు. దేవుని నమ్మి యాగాలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అందుకే తెలంగాణలో 9 సంవత్సరాలు కరువు రాలేదు. పుష్కలంగా వర్షాలు కడుపునిండా నీళ్లు రైతులకు ఉన్నాయి.

వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు చాలన్న కాంగ్రెస్ నాయకులు కావాలా మూడు పంటలకు 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా. ఆత్మహత్యలు లేకుండా రైతులు ఆత్మవిశ్వాసంతో బ్రతికేలా చేసింది కేసీఆర్. ఈ కర్మాగారంలో గంటకు 120 మెట్రిక్ పనుల ఫ్రూట్స్ను ప్రెస్సింగ్ చేసే కెపాసిటీతో లేట్ అయినా లేటెస్ట్ గా నిర్మించుకోబోతున్నాం.

ఆయిల్ ఫామ్ తో ప్రెస్సింగ్ చేసినంక మిగిలిన పొట్టుని కోళ్లకు, పశువులకు దాణాగా తయారు చేసే కర్మాగారం కూడా అంతర్భాగంగా నిర్మించబోతున్నాం. మిగిలిన పిప్పితో కరెంటు తయారు చేసే కేంద్రాన్ని కూడా నిర్మించబోతున్నాం. రీసైకిల్ చేసే వ్యవస్థతో జీరో వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద రీసైకిల్ చేసుకొని ప్రతి చుక్కను తిరిగి ఉపయోగించుకునే విధంగా టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తున్నాం.

ఇంత మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి, ఆయిల్ ఫెడ్ సంస్థకు మా రైతుల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

—————————-

కేరళ రాష్ట్ర ప్రభుత్వ పోర్ట్స్ ,మ్యూజియమ్స్, అర్కి యాలజీ శాఖల మంత్రి అహ్మద్ దేవర కోవిల్ గారు నేడు తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలిని సందర్శించారు.ఈ సందర్భంగా తెలంగాణ శాసన పరిషత్ ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ,శాలువా కప్పి , చార్మినార్ మెమెంటోతో సత్కరించారు.

కేరళమంత్రి గారికి శాసన సభ ,శాసన మండలి సమావేశ మందిరాలను చూపించి తెలంగాణ రాష్ట్రంలో సమావేశాలు జరిగే తీరు,నియమ,నిబంధనలు అన్నింటినీ చైర్మన్ గారు వివరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి కూడా కేరళ మంత్రి గారికి వివరించారు.

ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి పథంలో నడుస్తున్నదని కేరళ మంత్రి అహ్మద్ దేవరకోవిల్ ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ శ్రీ నరసింహా చార్యులు, శాసన మండలి సచివాలయ అధికారులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

————————————

పారదర్శకత, అక్రమాల నివారణకు ఈ – మైనింగ్ మొబైల్ యాప్ : మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

గనులు భూగర్భ వనరుల శాఖలో మరింత పారదర్శకతను పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ మైనింగ్ మొబైల్ యాప్ దోహదం చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవనంలో సిఎస్ శాంతి కుమారి, గనుల శాఖ డీఎం జి పి. కాత్యాయని దేవి లతో కలిసి తెలంగాణ ఈ – మైనింగ్ మొబైల్ యాప్ ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గనులు, భూగర్భ వనరుల శాఖ మరియు హైదరాబాద్ లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసి) సంయుక్తంగా ఈ మొబైల్ యాప్ను అభివృద్ధి పరిచినట్లు చెప్పారు. ఈ మైనింగ్ ఆప్ తో గనులు, ఇటుక, ఇసుక రవాణా జరిగినప్పుడు రవాణా వాహనాలను తనిఖీ చేసి ట్రాన్సిస్ట్ ఫామ్ మరియు ట్రాన్సిస్టర్ అనుమతులు ఉన్నాయా లేవా అని అంశాలను ఆన్లైన్లో వెంటనే సిబ్బంది తెలుసుకోవచ్చని తెలిపారు.

అక్రమ రవాణా, అనుమతులు లేకుండా కానీ, అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో రవాణాకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకొని, పెనాల్టీ విధించి ఆ సమాచారాన్ని వాహన యజమానికి ఆన్లైన్ పద్ధతిలో లింక్ ద్వారా పంపించి వెంటనే పెనాల్టీ వసూలు చేసేందుకు సిబ్బందికి, అలాగే చెల్లించేందుకు వాహన యజమానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు.

డీలర్లు మరియు లీజు హోల్డర్లు ఖనిజ రవాణాలో ఆన్లైన్ ద్వారా తమ రవాణా చేసుకునేందుకు శాఖా పరమైన అనుమతుల నిర్ధారణ సైతం తెలుసుకోవచ్చని అన్నారు. అలాగే తనిఖీలు నిర్వహించే గనుల శాఖ ఏడీలు, అసిస్టెంట్ జువాలజిస్టులు, టెక్నీషియన్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్లకు వాహనాల తనిఖీ చాలా సులభం అవుతుందని వెల్లడించారు.

ఈ మైనింగ్ మొబైల్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు వెంటనే తీసుకోవడంతో పాటు పారదర్శకత మరింత పెరుగుతుందని చెప్పారు. ఇసుకతో పాటు ఇటుక, ఖనిజాల అక్రమ రవాణాలో పారదర్శకతకు ఎంతో తోడ్పడుతుందని, దేశంలోనే ఎక్కడలేని విధంగా అభివృద్ధిపరిచే దశలో ఉందని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X