हैदराबाद: मौसम विभाग के मुताबिक अगले एक घंटे में राजधानी हैदराबाद में भारी से बहुत भारी बारिश होने की संभावना है। कहा गया कि अगले तीन घंटे तक भारी बारिश होगी। इसी पृष्ठभूमि में हैदराबाद में रेड अलर्ट जारी किया गया है। लोगों को सलाह दी कि जब तक जरूरी न हो बाहर न निकलें। इसी क्रम में सरकार ने मंगलवार को स्कूलों को छुट्टी घोषित किया है।
इस बीच, जीएचएमसी ने भारी बारिश के मद्देनजर अधिकारियों को सतर्क कर दिया है। अधिकारियों को हर समय उपलब्ध रहने का आदेश दिया गया। डीआरएफ स्टाफ को फील्ड स्तर पर रहने की सलाह दी गई है। हुसैनसागर में भारी बाढ़ आने की आशंका है क्योंकि रात से ही भारी बारिश हो रही है।
इसके साथ ही जीएचएमसी ने अधिकारियों को टैंकबंड में जल स्तर की नियमित निगरानी करने का आदेश दिया है। इसी तरह उस्मानसागर और हिमायत सागर के गेट भी हटाने के आदेश जारी किए गए। मुसी जलग्रहण क्षेत्र और निचले इलाकों के लोगों को सतर्क रहने की सलाह दी। मौसम विभाग ने यह बताया कि अगले पांच दिन तक भारी बारिश होने की संभावना है।
हैदराबाद में सबसे ज्यादा 14 सेमी बारिश मियापुर में दर्ज की गई। शेखपेट में 11.9 सेमी बारिश हुई। बोराबंडा में 11.6 सेमी, माधापुर में 10.7 सेमी और रायदुर्गम में 10.1 सेमी बारिश हुई। खैरताबाद में 10.1 सेमी, राजेंद्रनगर में 10 सेमी, गच्चीबावली में 9.6 सेमी, बहादुरपुरा में 8.2 सेमी और चिलकलागुडा और आसिफीनगर क्षेत्रों में 8.1 सेमी बारिश हुई है।
హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్, అతిభారీ వర్షాలు
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీచేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది. ఈ క్రమంలో మంగళవారం పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించింది. డీఆర్‌ఎఫ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించింది. ఇక రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నది.
దీంతో ట్యాంక్‌బండ్‌లో వాటర్ లెవల్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. అదేవిధంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌ను కూడా పర్యవేక్షిస్తూ గేట్లు ఎత్తివేయాలని ఆదేశాలు జారీచేసింది. మూసీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ లో అత్యధికంగా మియాపూర్‌లో 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. షేక్‌పేట11.9 సెం.మీల వాన కొట్టింది. బోరబండలో 11.6 సెం.మీ, మాదాపూర్‌లో 10.7 సెం.మీ, రాయదుర్గంలో 10.1 సెంటీ మీటర్ల వాన పడింది. ఇటు ఖైరతాబాద్ లో 10.1 సెంమీ, రాజేంద్రనగర్ లో 10 సెం.మీ, గచ్చిబౌలిలో 9.6, సెం.మీ, బహదూర్‌పురాలో 8.2, చిలకలగూడ, ఆసిఫినగర్ ప్రాంతాల్లో 8.1 సెం.మీ వర్షపాతం నమోదైంది.