हैदराबाद: एसआईटी अधिकारियों ने टीएसपीएससी पेपर लीक मामले में तीन और आरोपियों को गिरफ्तार किया है। रवि से एई पेपर खरीदने के मामले में भरत, रोहित और साई को हिरासत में ले लिया है। तीनों को मिलाकर इस मामले में अबतक गिरफ्तार आरोपियों की संख्या 43 हो गई हैं।
एसआईटी अधिकारियों ने इस मामले में 24 मई को तीन आरोपियों को गिरफ्तार किया। एसआईटी अधिकारियों ने बुधवार को एई परीक्षा में टॉप स्कोर करने वाले दिव्या, रवि और किशोर को रायपुर से गिरफ्तार किया। अधिकारियों ने पाया कि उन्होंने पेपर खरीदा और परीक्षा लिखी। इसी के साथ एसआईटी ने इनसे पूछताछ की। पुलिस द्वारा दी गई जानकारी के आधार पर इन्हें गिरफ्तार किया गया।
पेपर लीक मामले में प्रवीण, राजशेखर और रेणुका मुख्य आरोपी हैं। कोर्ट इस मामले में अब तक 13 लोगों को जमानत दे चुकी है। इनमें से 11 पहले ही जेल से रिहा हो चुके हैं। हालांकि, इस मामले के मुख्य आरोपी प्रवीण और राजशेखर अभी भी जेल में हैं, क्योंकि उन्हें जमानत नहीं मिली थी। कोर्ट ने रेणुका को सशर्त जमानत दे दी। हालांकि, कोर्ट ने रेणुका को एसआईटी की जांच में शामिल होने का आदेश दिया है।
एसआईटी के अधिकारी पेपर मामले में गोपनीय कक्ष के प्रभारी के रूप में उशंकर लक्ष्मी की भूमिका पर संदेह व्यक्त कर रहे हैं। उसके कॉल डेटा विवरण पहले ही एकत्र किए जा चुके हैं। वह 2017 से TSPSC में ड्यूटी कर रही हैं। इसके अलावा, एसआईटी अधिकारियों ने पाया कि टीएसपीएससी अधिकारियों द्वारा दी गई जानकारी में अंतर है।
यह निष्कर्ष निकाला गया कि टीएसपीएससी का विवरण डीएओ, एईई और एई पेपर के लीक को छिपाया रखा है। साथ ही, एसआईटी अधिकारियों को संदेह है कि टीएसपीएससी ने गलत सूचना दी है कि पेपर का मूल्यांकन नहीं किया गया है।
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు, మరో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రవి నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినందుకు భరత్, రోహిత్, సాయిను అదుపులోకి తీసుకున్నారు. వీరితో కలిపి ఈ కేసులోఅరెస్ట్ చేసిన వారి సంఖ్య 43కి చేరుకుంది.
ఈ కేసులో మే24వ తేదీన కూడా సిట్ అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏఈ పరీక్షలో టాప్ స్కోర్ సాధించిన రాయ్‌పూర్‌కు చెందిన దివ్య, రవి, కిశోర్‌లను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరు పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్టు అధికారులు గుర్తించారు. దీనితో వారిని విచారించిన సిట్.. పోలీసులు చెప్పిన వివరాల ఆధారంగా అనుమానం రావడంతో అరెస్ట్ చేశారు.
పేపర్ లీకేజి కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందికి కోర్టు బెయిల్ ఇచ్చింది. వీరిలో 11 మంది జైలు నుంచి ఇప్పటికే రిలీజ్ అయ్యారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ లకు మాత్రం బెయిల్ లభించకపోవడంతో జైల్లోనే ఉన్నారు. ఇక రేణుకకు మాత్రం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే సిట్ విచారణకు రేణుక హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పేపర్ కేసులో కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నశంకర్ లక్ష్మీ పాత్రపై సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె కాల్ డేటా వివరాలను సేకరించారు. 2017 నుంచి టీఎస్‌పీఎస్సీలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఇచ్చిన సమాచారంలో తేడాలు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
డీఏవో, ఏఈఈ, ఏఈ పేపర్ల లీక్ అంశంలో టీఎస్‌పీఎస్సీ వివరాలు దాచిపెట్టినట్లు తేల్చారు. అలాగే పేపర్లు వాల్యుయేషన్ చేయలేదని టీఎస్‌పీఎస్సీ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సిట్ అధికారులు అనుమాస్తున్నారు. (ఏజెన్సీలు)