BRAOU- నిరంతర అధ్యయనమే పరిశోధనలకు మూలం : ప్రొ. వి. వెంకయ్య

హైదరాబాద్: నిరంతర అధ్యయనం, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సరికొత్త ఆవిష్కరనలను పరిశోధకులు ఎప్పటికి అప్పుడు పరిశీలించాలని కృష్ణా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ మాజీ రెక్టర్ ఆచార్య. వి.వెంకయ్య అభిప్రాయపడ్డారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ప్రొ. జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో “అకాడెమిక్ పరిశోధన మరియు పరిశోధనకు మద్దతు” అనే అంశంపై నిర్వహించిన మూడు రోజుల సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఆచార్య.వెంకయ్య మాట్లాడుతూ పరిశోధకుల్లో చిత్తశుద్ధి, అన్వేషించాలి అనే తపన లేకుంటే కొత్తవాటిని కనిపెట్టడం, సమాజానికి ఉపయోగపడే వాటిని ఆవిష్కరించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పరిశోధన పత్రాల్లో నాణ్యత లేకుండా పరిశోధన పూర్తి చేసి పీఎచ్.డి. పొందినా ఆ పరిశోధన గ్రంధానికి విలువ ఉండదన్నారు. అంతర్జాతీయ జర్నల్స్ లో పరిశోధన పత్రాలు ప్రచురించినప్పుడే వాటికి ఎక్కువ విలువ ఉంటుందని ఈ దిశగా పరిశోధక విద్యార్ధులు, అధ్యాపకులు పనిచేయాలని సూచించారు.

ప్రొ. జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డైరెక్టర్ ప్రో. సుధారాణి మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సు పరిశోధక విద్యార్ధులకు, అధ్యాపకులకు ఉపయోగకారిగా నిలువనుందని వివరించారు. కార్యక్రమంలో పలు విభాగాల అధిపతులు, డీన్లు, అధ్యాపక, పలు విభాగాల పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

CONTINUOUS STUDY IS THE SOURCE OF RESEARCH: Prof. V. Venkaiah, Former Vice-Chancellor, Krishna University

Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU), Prof.G.Ram Reddy Centre for Research and Development organized a three day workshop on “Academic Research and Research Support” on May 16 to 18, 2023 at the University Campus. Prof .V. Venkaiah, Former Vice-Chancellor, Krishna University, Andhra Pradesh and Former Rector, Dr.BRAOU, Hyderabad was the chief guest for the Valedictory function. Prof. Venkaiah said that researchers should constantly study and examine the latest discoveries coming from all over the world.

He said, if the researchers do not have sincerity and desire to explore, it is not possible to discover new things and invent things that are useful to the society. He also said that even if one completes the research and gets a Ph.D without the quality of the research papers, the research paper will not have any value. He suggested that research students and teachers should work in this direction as research papers will have more value only when they are published in international journals.

Prof. E. Sudha Rani, Director GRCR&D, presented a detailed reported of three day workshop will be useful for research students and teachers. She explained the need and necessity of organizing this workshop. It has been revealed that many social science teachers will participate in this three-day workshop and guide the research students. All Directors, Deans, Heads of the Branches, Research Scholars & Students are participated in the program.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X