तेलंगाना में बढ़ता धूप, इन जिलों के लिए ऑरेंज अलर्ट जारी

हैदराबाद: तेलंगाना में तापमान धीरे-धीरे बढ़ता जा रहा है। गुरुवार को कई जिलों में इधर-उधर हल्की बौछारें पड़ीं। मौसम विभाग के अनुसार अगले चार दिनों तक धूप की तीव्रता इसी तरह रहने की संभावना है। आधे से ज्यादा जिलों को ऑरेंज अलर्ट जारी किया गया है।

आदिलाबाद, कुमारभीम आसिफाबाद, मंचेरियाल, निर्मल, निजामाबाद, जगित्याला, राजन्ना सिरिसिला, पेद्दापली, करीमनगर, सिद्दीपेट, जयशंकर भूपालपल्ली, जनगांव, वरंगल, महबूबाबाद, मुलुगु, खम्मम, सूर्यापेट, यादाद्री भुवनगिरी, नलगोंडा, नागरकुर्नूल, महबूबनगर, नारायणपेट, वनपर्ती और गदवाला जिलों ने ऑरेंज अलर्ट जारी किया है। साथ ही चेतावनी दी है कि संभावना है कि संबंधित जिलों में तापमान और बढ़ेगा।

दूसरी ओर गुरुवार को विकाराबाद, रंगारेड्डी, खम्मम, मुलुगु, नागरकुर्नूल, गदवाला, कोत्तागुडेम और सूर्यापेट जिलों में हल्की बारिश हुई। कोत्तागुडेम जिले के राजेंद्रनगर और दम्मापेट में सबसे अधिक 1.9 सेमी बारिश हुई।

इस बीच, करीमनगर जिले के वीणावंका और जगित्याला जिले के जैना में सबसे अधिक 44.3 डिग्री तापमान दर्ज किया गया। जयशंकर भूपालपल्ली जिले के ताडीचर्ला में 44.1 डिग्री, पेड्डापल्ली जिले के मुत्तारम में 43.8 डिग्री, आदिलाबाद जिले के छापरा में 43.3 डिग्री, निर्मल जिले के बुट्टापुर में 42.8 डिग्री और कव्वाल टाइगर रिजर्व में 42.8 डिग्री तापमान रिकॉर्ड किया गया।

తెలంగాణలో పెరుగుతున్న ఎండలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురువగా.. చాలా చోట్లా ఎండ దంచికొట్టింది. మరో నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సగానికిపైగా జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్​భూపాలపల్లి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

కాగా, గురువారం వికారాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ములుగు, నాగర్​కర్నూల్, గద్వాల, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రాజేంద్రనగర్, కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అత్యధికంగా 1.9 సెంటీ మీటర్ల వర్షం పడింది.

కాగా, కరీంనగర్​ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్​భూపాలపల్లి జిల్లా తాడిచర్లలో 44.1, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 43.8, ఆదిలాబాద్​ జిల్లా చాప్రాలలో 43.3, నిర్మల్​ జిల్లా బుట్టాపూర్​లో 42.8, కవ్వాల్​ టైగర్​ రిజర్వ్​లో 42.8 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X