TSPSC Paper Leak Scam: “బీజేపీ హస్తముంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?”

-ఇతరులు తప్పు చేస్తే మెడలు పట్టి గెంటేసేవాళ్లు కదా

-నీకొడుకు తప్పు చేస్తే ఎందుకు బర్తరఫ్ చేయడం లేదు?

-మున్సిపల్, ఐటీ శాఖ తప్పిదాలకు జనం బలైపోతుంటే మంత్రిపై చర్యలేవి?

-తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు చేయించడం లేదు?

-రాజశేఖర్ బీజేపీ వ్యక్తే అయితే… 13 ఏళ్లుగా టీఎస్సీఎస్సీ ఏం చేసినట్లు?

-పక్క రాష్ట్రం గురించి ఏడుపెందుకు?… మీ ఏడుపు మీరు ఏడవండి

-టీచర్లు ఈడ్చి కొట్టినట్లు తీర్పిచ్చినా అయ్యాకొడుకులకు బుద్ది రావడం లేదు

-చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ తీరు

-మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు సమాధానమిచ్చిన

-తెలంగాణ సామెతను ప్రస్తావిస్తూ చెప్పానే తప్ప మరో ఉద్దేశం లేదు

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ హస్తముందంటూ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ‘‘పేపర్ లీకేజీలో బీజేపీ హస్తముంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అధికారంలో ఉన్నది మీరే కదా? మేం అడుగుతున్నా… పేపర్ లీకేజీలో ఐటీ శాఖ తప్పిదాలున్నాయి. అందుకే బర్తరఫ్ చేయాలని అడుగుతున్నాం. మీరు నిజంగా తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదు’’అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో తనకు నచ్చనివాళ్లు తప్పు చేస్తే మెడలు పెట్టి గెంటివేసే కేసీఆర్ తన కొడుకు తప్పు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ కమిషన్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

• రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు సమాధానమిచ్చాను. వాళ్లు నా స్టేట్ మెంట్ రికార్డు చేశారు. మహిళా కమిషన్ గౌరవ ప్రదమైన సంస్థ. బీజేపీ మహిళలను గౌరవించే పార్టీ. రాష్ట్ర మహిళా కమిషన్ పిలవగానే రాష్ట్ర అధ్యక్షుడిగా వెళితే ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే వచ్చాను. వాళ్లు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానమిచ్చాను. తెలంగాణలోని సామెతను మాత్రమే ప్రస్తావిస్తూ చెప్పానే తప్ప నాకు మరో ఉద్దేశం లేదు…

• బండి సంజయ్ కు కామన్ సెన్స్ లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా… ‘‘ఎవరికి కామన్ సెన్స్ ఉందో… ఎవరికి లేదో ప్రజలకు తెలుసు. పరీక్ష సక్రమంగా నిర్వహించే తెలివిలేనోడు కామన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నడు. ఎవరి నిర్వాకంవల్ల ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు చనిపోయారు? ధరణివల్ల లక్షల మంది రైతులు ఎందుక ఇబ్బంది పడుతున్నారు? తన శాఖ పరిధిలోనే… కుక్కపిల్ల కరిచి పిల్లలు చనిపోతే కనీసం పట్టించుకోనోడు… నాలాల్లో పడి జనం చస్తే పట్టించుకోనోడు… సిటీలో ఫైర్ అయి చనిపోతున్నా పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నరు?

• మీ పార్టీలో వేరే వాళ్లు తప్పు చేస్తే మీ అయ్య మెడలు పట్టి నెట్టేసేవాళ్లు కాదా? మరి నీ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.

• టీఎస్పీఎస్సీ రాజ్యాంగ బద్ధ సంస్థ అని అంటున్నడు. మరి ఈడీ, సీబీఐ రాజ్యాంగ బద్ద సంస్థలు కాదా? నీకు నచ్చితే, చెప్పినట్లు వినేవి మాత్రమే రాజ్యాంగబద్ద సంస్థలా? లేకుంటే బీజేపీ సంస్థలైతయా? 30 లక్షల మంది జీవితాలను నాశనం చేసిన మీరు కనీసం వాళ్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేయకుండా గాలికొదిలేసే లిక్కర్ క్వీన్ ను కాపాడుకునేందుకు ఢిల్లీకి పోయి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు.

• నిరుద్యోగుల విషయంలో నువ్వేం చేస్తున్నవో…నీ ఏడుపేదో నువ్వు (కేటీఆర్ ను ఉద్దేశించి) ఏడవకుండా పక్కోడి గురించి నీకెందుకు? పక్క రాష్ట్రాల్లో జరిగే మంచి గురించి ఎందుకు మాట్లాడవు? నిన్ననే కదా… టీచర్లంతా జాడించి కొట్టినా మీకు బుద్ది రాలేదా…?

• పేపర్ లీకేజీలో బీజేపీ హస్తముందని ఆరోపిస్తున్న వాళ్లు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అధికారం మీ చేతిలోనే ఉంది కదా? రాజశేఖర్ రెడ్డి బీజేపీ వ్యక్తే అంటున్నోళ్లు 10 ఏళ్లకుపైగా అతను మీదగ్గరే పనిచేస్తున్నడు కదా? ఇన్నాళ్లు ఏం చేస్తున్నట్లు?

• 2010 నుండి రాజశేఖర్ మీదగ్గరే పనిచేస్తేన్నరు కదా… ఇన్నాళ్లు ఎందుకు దొంగను దొరకపట్టలేదు? ఏదైనా సంస్థ ఎవరికైనా ఉద్యోగమిస్తే.. బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుని నియమించుకుంటది. మరి రాజశేఖర్ విషయంలో టీఎస్పీఎస్సీ ఇన్నాళ్లు ఏం చేసినట్లు?

• నిరుద్యోగులు తమ కుటుంబ సభ్యులు కూలీనాలీ చేసి సంపాదించిన డబ్బులతో కోచింగ్ తీసుకుంటూ తినీతినక రాత్రింబవళ్లు చదువుతున్నరు. వాళ్ల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? టీఎస్సీఎస్పీ బోర్డు ఎందుకు పనికిరాకుండా పోయింది. దాంతో ఇక ఏం పనుంది? బోర్డును రద్దు చేసే అధికారం సీఎంకు లేదని అంటున్నారు కదా… రద్దు చేసే అధికారం ఎవరికుందో… వాళ్లకే లెటర్ ఎందుకు రాయడం లేదు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X