న్యూఢిల్లీ/హైదరాబాద్ : భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలుచేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేస్తున్నారు. అంతకుముందు వేదిక వద్దకు చేరిన ఎమ్మెల్సీ కవిత పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు.
దీక్షలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, రేఖానాయక్‌తోపాటు భారత జాగృతి మహిళా నేతలు కూర్చుకున్నారు. సీపీఎం నేత సీతారాం ఏచూరీ దీక్షలో పాల్గొని సంగీభావం తెలిపారు.